Moto Pad 70 Groove టాబ్లెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌లో లభించనుంది.
Photo Credit: Motorola
Moto Pad 70 Groove
Moto Pad 70 Groove : ప్రముఖ టెక్ దిగ్గజం మోటోరోలా భారతీయ వినియోగదారుల కోసం తమ లేటెస్ట్ ప్రీమియం టాబ్లెట్ Moto Pad 70 Grooveను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, ఆఫీస్ పనులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పవర్ఫఉల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వచ్చింది. అంతేకాకుండా రోజంతా ఎలాంటి అంతరాయం లేకుండా వాడేందుకు ఏకంగా 10,200mAh భారీ బ్యాటరీ కెపాసిటీని ఇందులో అందించడం విశేషం.
ధర, లభ్యత వివరాలు ఇవే
ధర విషయానికి వస్తే Moto Pad 70 Groove టాబ్లెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌లో లభించనుంది. దీని ధరను కంపెనీ రూ. 33,999 గా నిర్ణయించింది. ఈ టాబ్లెట్ కొనుగోలు చేయడానికి మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు దీనిని అత్యంత ఆకర్షణీయమైన పాంటోన్ బ్లూ సర్ఫ్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
అద్భుతమైన 2.5K డిస్‌ప్లే.. జెబిఎల్ సౌండ్ సిస్టమ్!
ఫీచర్ల పరంగా చూస్తే Moto Pad 70 Groove లో 12.1 అంగుళాల 2.5K LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 2560x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, HDR10, DCI-P3 కలర్ గేమట్‌తో వస్తుంది. ఆడియో లవర్స్ కోసం ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన 9 యూనిట్ల JBL ప్రో స్పీకర్ సిస్టమ్ అమర్చారు. ప్రాసెసింగ్ కోసం ఇందులో Arm Mali-G615 MC2 GPU తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను అందించారు. ఈ టాబ్లెట్‌లో 8GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు.
Deepfake Alert : మోదీ ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదం.. మెటా ఇండియా హెడ్ పై పోలీస్ కేసు
బిగ్ బ్యాటరీ సపోర్ట్.. పవర్ ఫుల్ కెమెరా విశేషాలు
బ్యాటరీ విభాగంలో ఈ టాబ్లెట్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులో ఇచ్చిన 10,200mAh బ్యాటరీ 68W ఫాస్ట్ ఛార్జింగ్, 45W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫొటోలు, వీడియోల కోసం వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఇది IP52 రేటింగ్‌తో వస్తుంది. కంటి రక్షణ కోసం TÜV Rheinland లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కనెక్టివిటీ పరంగా వై-ఫై 6, బ్లూటూత్ 5.4 , టైప్-సి పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains