iQOO's First Mini Tablet coming soon and features leaked: కాంపాక్ట్ సైజ్‌లో, చేతిలో సులభంగా ఇమిడిపోయేలా రూపుదిద్దుకుంటున్న ఈ టాబ్లెట్‌ను తమ రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 16తో పాటుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి
Photo Credit: iQOO
Pad 6 Pro
iQOO's First Mini Tablet Coming Soon: టెక్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ కస్టమర్ల కోసం ఒక సంచలన అప్డేట్ తీసుకొచ్చింది. ఈ కంపెనీ త్వరలోనే తన మొట్టమొదటి మిని టాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంపాక్ట్ సైజ్‌లో, చేతిలో సులభంగా ఇమిడిపోయేలా రూపుదిద్దుకుంటున్న ఈ టాబ్లెట్‌ను తమ రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐకూ 16తో పాటుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సర్టిఫికేషన్ సైట్లో ప్రత్యక్షమైన మోడల్ నంబర్..
ప్రసిద్ధ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త మిని టాబ్లెట్ చైనాకు చెందిన ముఖ్యమైన SRRC డేటాబేస్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో iPA2691 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ 2.4GHz, 5GHz డ్యూయల్ బాండ్ వై-ఫై కనెక్టివిటీతో పాటు అడ్వాన్స్డ్ బ్లూటూత్ సపోర్ట్‌ను కలిగి ఉన్నట్లు స్పష్టమైంది. అంటే ప్రాథమికంగా ఈ టాబ్లెట్ వై-ఫై వేరియంట్లలో మార్కెట్లోకి అడుగుపెట్టనుందని అర్థమవుతోంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్సెట్..
ఈ అప్‌కమింగ్ మిని టాబ్లెట్‌లో క్వాల్‌కామ్‌కు చెందిన అత్యంత పవర్ఫుల్ 2nm ప్రాసెసింగ్‌పై నిర్మించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌ను అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లో ఈ డివైజ్ అసాధారణమైన స్పీడ్, పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ కొత్త డివైజ్‌ను ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఐకూ 16 సిరీస్‌తో పాటు గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Realme P4 Lite 5G : బడ్జెట్ ప్రియులకు రియల్మీ బిగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ P4 లైట్ 5Gపై భారీ డిస్కౌంట్
భారీ బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సపోర్ట్..
తాజా లీకుల ప్రకారం.. ఐకూ 16 ఫోన్‌తో పాటు వస్తున్న ఈ మిని టాబ్లెట్ సిరీస్‌లో ఏకంగా 8500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. డివైజ్ సెక్యూరిటీ కోసం స్క్రీన్ కింద 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చనున్నారు. అంతేకాకుండా ఫొటోగ్రఫీ, జూమింగ్ కోసం పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా లెన్స్ మరియు హై-రిజల్యూషన్ డిస్ప్లేను ఈ టాబ్లెట్‌లో పొందుపరచనున్నట్లు సమాచారం.
ఐకూ ప్యాడ్ 6 ప్రోకు కొనసాగింపుగా మిని వెర్షన్..
గతంలో మే 2026 లో ఐకూ సంస్థ ఐకూ ప్యాడ్ 6 ప్రోను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టాబ్లెట్ 13.2 అంగుళాల 4K LCD డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 3D కూలింగ్ సిస్టమ్, 8-స్పీకర్ల పనోరమిక్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చింది. ప్రస్తుతం రాబోతున్న మిని టాబ్లెట్ ఆ మోడల్‌కు కాంపాక్ట్ వర్షన్‌గా, మరింత మెరుగైన ప్రాసెసర్‌తో కస్టమర్ల ముందుకు రాబోతుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update