రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో Samsung Galaxy A16 4G, Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌లు
ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో విడుదలైన Galaxy A15 5G, Galaxy A15 4G హ్యాండ్‌సెట్‌లకు కొనసాగింపుగా Samsung Galaxy A16 5G, 4G వేరియంట్‌లు లాంచ్ కానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించిన వివరాలు ఇటీవల ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ 5G వెర్షన్‌తోపాటు 4G కూడా లాంచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. Galaxy A16 4G వెర్షన్ ప్రారంభ ధర కూడా అంచనా వేయబడింది. తాజాగా ఓ నివేదిక ఆదారంగా Galaxy A16 5G, 4G వేరియంట్‌ల స్పెసిఫికేషన్స్ బయటకొచ్చాయి