కొండలు, గుట్టలు, అత్యంత కఠినమైన రహదారులపై కూడా సునాయాసంగా ప్రయాణించేలా అడ్వాన్సుడ్ ఇంజనీరింగ్‌తో ఈ ఇ-బైక్‌ను ఆటోమొబైల్ లవర్స్ ముందుకు తీసుకొచ్చారు.
Photo Credit: Specialized
S-Works Turbo Levo R Ultralight
Specialized E Bike : గ్లోబల్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ ప్రముఖ అమెరికన్ సైకిల్స్ తయారీ సంస్థ స్పెషలైజ్డ్ తమ మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను అధికారికంగా మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్-వర్క్స్ టర్బో లెవో ఆర్ ఆల్ట్రాలైట్ పేరుతో వచ్చిన ఈ మోడల్‌ను కంపెనీ ఒక ఆల్ట్రా-ప్రీమియం ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్‌గా రూపొందించింది. కొండలు, గుట్టలు, అత్యంత కఠినమైన రహదారులపై కూడా సునాయాసంగా ప్రయాణించేలా అడ్వాన్సుడ్ ఇంజనీరింగ్‌తో ఈ ఇ-బైక్‌ను ఆటోమొబైల్ లవర్స్ ముందుకు తీసుకొచ్చారు.
అదిరిపోయే ధర, లుక్స్
ప్రత్యేకంగా అమెరికన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ స్పెషలైజ్డ్ ఎస్-వర్క్స్ టర్బో లెవో ఆర్ ఆల్ట్రాలైట్ ఇ-బైక్ ధరను 12,999.99 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ ఏకంగా సుమారు రూ. 12.55 లక్షలుగా ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఈ-బైక్‌ను అత్యంత రాయల్, స్పోర్టీ లుక్ ఇచ్చే సింగిల్ సాటిన్ కార్బన్' అనే ఏకైక కలర్ షేడ్‌లో ప్రవేశపెట్టారు.
స్ట్రాంగ్ టర్బో మోటార్, భారీ బ్యాటరీ
ఈ హై-ఎండ్ ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్‌లో టర్బో 3.1 ఎస్-వర్క్స్ పవర్‌ఫుల్ మోటార్‌ను అమర్చారు. ఇది ఏకంగా 850W పీక్ పవర్‌ను, 111Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 600Wh, 840Wh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లను ఇచ్చారు. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 4.4 గంటల పాటు నిరంతరంగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారి కోసం రేంజ్‌ను మరింత పెంచేలా 280Wh కెపాసిటీ గల స్పెషల్ రేంజ్ ఎక్స్‌టెండర్ సదుపాయాన్ని కూడా అందించారు.
iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
తేలికపాటి కార్బన్ ఫ్రేమ్, GENIE సస్పెన్షన్ టెక్నాలజీ
ఈ ఇ-బైక్ మెయిన్ ప్లస్ పాయింట్ దీని లైట్ వేట్ డిజైన్. ఇందులో వాడిన అత్యంత క్వాలిటీ FACT 11 కార్బన్ ఫ్రేమ్ కారణంగా ఈ సైకిల్ బరువు కేవలం 18 కిలోగ్రాములు మాత్రమే ఉంటుంది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత తేలికైన, ఫుల్-సస్పెన్షన్ కలిగిన మౌంటైన్ బైక్‌గా రికార్డు సృష్టించింది. ఇందులో కంపెనీ పేటెంట్ పొందిన GENIE సస్పెన్షన్ టెక్నాలజీని అందించారు. కఠినమైన దారుల్లో సాఫీగా సాగేందుకు వీలుగా దీని వెనుక వైపు 130mm, ముందు భాగంలో 140mm సస్పెన్షన్లను పొందుపరిచారు.
హైటెక్ ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్
స్మార్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ ఇ-బైక్‌లో 2.2-ఇంచుల మాస్టర్‌మైండ్ డిస్ప్లేని అమర్చారు. కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన కాంపాక్షన్ స్మార్ట్‌ఫోన్ యాప్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటానికి ఇది 12amp స్మార్ట్ ఛార్జర్, అతి వేగంగా ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. ఫిట్‌నెస్, అడ్వెంచర్ ఇష్టపడే ధనవంతులకు ఈ బైక్ ఒక అద్భుతమైన డ్రీమ్ బైక్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains