Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో Realme TechLife 43 inch Smart Google TV 2026 రూ.19,999 జాబితా ధరతో అందుబాటులో ఉంది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

Photo Credit: Samsung

Samsung 43 inch Smart Tizen TV

ముఖ్యాంశాలు
  • ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా
  • ఇంటిని థియేటర్‌గా మార్చేయండి
  • 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
ప్రకటన

Flipkart Freedom Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు స్మార్ట్ టీవీలపై కూడా భారీ ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా 43 ఇంచుల పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం. రియల్‌మీ, శామ్‌సంగ్, మోటోరోలా, షియోమీ, హైయర్ వంటి ప్రముఖ బ్రాండ్ల టీవీలపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో Realme TechLife 43 inch Smart Google TV 2026 రూ.19,999 జాబితా ధరతో అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీ ఎఫెక్టివ్ ధర రూ.18,749కు వస్తుంది. అంతేకాదు, పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.6,380 వరకు అదనంగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎక్స్ఛేంజ్ విలువ పాత టీవీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

శామ్‌సంగ్ 43 ఇంచ్ టీవీ
Samsung 43 inch Full HD LED Smart Tizen TV జాబితా ధర రూ.23,250గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.3,550 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.19,700కు తగ్గుతుంది. ఈ టీవీలో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కంట్రోల్, HDR10+ సపోర్ట్, శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీ, డిజిటల్ ట్యూనర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, అడాప్టివ్ సౌండ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

మోటోరోలా 43 ఇంచ్ 4K టీవీ
Motorola 43 inch Smart Google TV 2025 Edition జాబితా ధర రూ.24,099గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందుతుంది. దీంతో ఈ టీవీ రూ.22,849 ఎఫెక్టివ్ ధరకు లభిస్తుంది. ఇందులో 43 ఇంచుల QLED Ultra HD (4K) డిస్‌ప్లే ఉంది. గేమింగ్‌ ఇష్టపడేవారికి 120Hz గేమ్ యాక్సిలరేషన్ సపోర్ట్ అందించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ టీవీ 5.0 ఓఎస్‌పై పనిచేస్తుంది.

షియోమీ 43 ఇంచ్ ఫైర్ టీవీ
Xiaomi FX Pro 43 inch Smart Fire TV జాబితా ధర రూ.26,499. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4,250 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ.22,249కు తగ్గుతుంది. ఈ టీవీలో ఇన్‌బిల్ట్ అలెక్సా, 32GB స్టోరేజ్, HDR10+, 30W డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌తో పాటు ఫిల్మ్‌మేకర్ మోడ్ కూడా ఉంది.

Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు

హైయర్ 43 ఇంచ్ గూగుల్ టీవీ
Haier 43 inch Smart Google TV జాబితా ధర రూ.29,490గా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.5,750 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ టీవీ రూ.23,740 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ సెర్చ్, HDR10, MEMC, డాల్బీ ఆడియో, టోటల్ సోనిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, 2GB ర్యామ్ కూడా ఇందులో ఉన్నాయి.

43 ఇంచ్ టీవీ కొనేవారికి మంచి ఆప్షన్లు
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీల్లో రూ.18,749 ఎఫెక్టివ్ ధరతో రియల్‌మీ మోడల్ అత్యంత తక్కువ ధరలో ఉంది. మరోవైపు 4K QLED డిస్‌ప్లే, గేమింగ్ ఫీచర్ల కోసం మోటోరోలా, ఎక్కువ స్టోరేజ్, డాల్బీ ఆడియో కోసం షియోమీ, ప్రీమియం ఫీచర్ల కోసం హైయర్ వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ విలువలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు చేసే ముందు తాజా ధరను చెక్ చేయడం మంచిది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »