శామ్‌సంగ్, ఫిలిప్స్, టీసీఎల్, షియోమీ, విడబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీలపై బ్యాంక్ ఆఫర్లు, ధరల తగ్గింపులు లభిస్తున్నాయి.
Photo Credit: Amazon
Amazon Great Freedom Sale
Amazon Great Freedom Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, టీవీలపై స్పెషల్ డిస్కౌంట్లు అందిస్తోంది. ముఖ్యంగా 32 అంగుళాల స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ సేల్‌లో పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. శామ్‌సంగ్, ఫిలిప్స్, టీసీఎల్, షియోమీ, విడబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీలపై బ్యాంక్ ఆఫర్లు, ధరల తగ్గింపులు లభిస్తున్నాయి.
Samsung 32 inches HD Smart LED TV: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో శామ్‌సంగ్ 32 ఇంచుల HD Smart LED TV జాబితా ధర రూ.15,490గా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1,750 వరకు డిస్కౌంట్‌తో ఈ టీవీ ఎఫెక్టివ్ ధర రూ.13,941కు చేరుతుంది. ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే, 768p రెజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సేఫ్టీ కోసం Samsung Knox Security, Voice Search Remote, HDR, Samsung TV Plus వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ Samsung Tizen OSపై పనిచేస్తుంది.
Philips 32 inches 6100 Series Frameless TV: ఫిలిప్స్ 32 ఇంచుల 6100 సిరీస్ ఫ్రేమ్‌లెస్ టీవీ జాబితా ధర రూ.15,999గా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, గరిష్టంగా రూ.1,750 వరకు లభిస్తుంది. దీంతో ఎఫెక్టివ్ ధర రూ.14,400కు తగ్గుతుంది. ఈ టీవీలో HD LED డిస్‌ప్లే, 720p రెజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి యాప్‌లకు సపోర్ట్‌తో పాటు Chromecast, Google Voice Assistant, Dual-Band Wi-Fi సదుపాయాలు కూడా ఉన్నాయి.
TCL 32 inches HD Ready Smart QLED Google TV: TCL 32 ఇంచుల HD Ready Smart QLED Google TV జాబితా ధర రూ.16,490. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, గరిష్టంగా రూ.1,750 వరకు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఎఫెక్టివ్ ధర రూ.14,841గా ఉంటుంది. ఇందులో HD Ready QLED డిస్‌ప్లే, 768p రెజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 1GB RAM, 8GB ROM, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
VW 32 inches Spectra Series Smart TV: తక్కువ బడ్జెట్‌లో 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి VW Spectra Series Smart TV మరో ఆప్షన్‌గా ఉంది. దీని జాబితా ధర రూ.9,499 కాగా, Amazon Pay ICICI క్రెడిట్ కార్డుపై రూ.284 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో ఎఫెక్టివ్ ధర రూ.9,215గా ఉంటుంది. ఇందులో HD Ready QLED డిస్‌ప్లే, 1080p రెజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, జీయో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు సపోర్ట్ లభిస్తుంది.
Xiaomi 32 ఇంచ్ F Series Smart TV: షియోమీ 32 ఇంచ్ F సిరీస్ స్మార్ట్ టీవీ జాబితా ధర రూ.12,999గా ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, గరిష్టంగా రూ.1,750 వరకు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఎఫెక్టివ్ ధర రూ.11,700గా ఉంటుంది. ఇందులో 1366x768 పిక్సెల్స్ HD Ready డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, బ్లూటూత్, బిల్ట్-ఇన్ వై ఫై ఉన్నాయి. 20W ఆడియో అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, DTS-HD సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999