గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ. 1,19,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ 256GB స్టోరేజ్ వేరియంట్, ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో రూ. 97,900కి లిస్ట్ అయింది.
Photo Credit: Apple
iPhone Air
Amazon Great Freedom Day Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్ ఈ రోజు నుంచి వైభవంగా ప్రారంభమైంది. ఇందులో అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లు చెదిరే డీల్స్ లభిస్తున్నాయి. మీరు గనుక ఒక కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. యాపిల్ సంస్థ రూపొందించిన అత్యంత స్లిమ్ కస్టమైజ్డ్ మోడల్ ఐఫోన్ ఎయిర్ పై అమెజాన్ ఈ సేల్‌లో ఊహించని రేంజ్ డిస్కౌంట్ ఇస్తోంది. పవర్ఫుల్ ఆపిల్ ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, దీని ఎఫెక్టివ్ ధర ఎంత ఉందో వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్ ఎయిర్ ధర, బ్యాంక్ ఆఫర్లు
గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ. 1,19,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ 256GB స్టోరేజ్ వేరియంట్, ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో రూ. 97,900కి లిస్ట్ అయింది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్ కింద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఉపయోగించి కొనుగోలు చేస్తే 10% (రూ. 1,250 వరకు) ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందే వీలుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ వర్తించిన తర్వాత ఐఫోన్ ఎయిర్ ఎఫెక్టివ్ ధర రూ. 96,650 కి చేరుకుంటుంది. అంటే దీని లాంచ్ ధరతో పోలిస్తే కస్టమర్లకు ఏకంగా రూ. 22,350 వరకు ఆదా అవుతుంది.
ఐఫోన్ ఎయిర్ అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఐఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.5 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్OLED డిస్ప్లేను అందించారు. ఇది 2736x1260 పిక్సెల్స్ రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. మంచి పర్ఫామెన్స్ కోసం ఇందులో పవర్ఫుల్ ఆపిల్ ఏ19 ప్రో చిప్సెట్ అమర్చారు. ఇది లేటెస్ట్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. నీరు, దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ అందించారు. భద్రత కోసం అత్యంత సురక్షితమైన ఫేస్ ఐడీ సపోర్ట్ ఉంది.
కెమెరా క్వాలిటీ, సన్నని డిజైన్, కనెక్టివిటీ
కెమెరా విభాగానికి వస్తే, ఐఫోన్ ఎయిర్ వెనుక భాగంలో ƒ/1.6 అపెర్చర్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు ƒ/1.9 అపెర్చర్‌తో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం 5.64 మిమీ సన్నని మందంతో, 165 గ్రాముల తక్కువ బరువును కలిగి ఉంటుంది. దీని పొడవు 156.2 మిమీ, వెడల్పు 74.7 మిమీగా ఉంది. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6, జిపిఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఈ-సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్సీ వంటి అన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch