JBL Live 780NC Review: జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్స్ రివ్యూ.. రూ. 15,999 కి ఇది కొంటే ఆడియో పిచ్చి ఎక్కాల్సిందే

బెస్ట్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ అంటే పెట్టుకున్న తర్వాత వాటి ఉనికి మనకు తెలియకూడదు.

JBL Live 780NC Review: జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్స్ రివ్యూ.. రూ. 15,999 కి ఇది కొంటే ఆడియో పిచ్చి ఎక్కాల్సిందే

JBL Live 780NC

ముఖ్యాంశాలు
  • సంగీత ప్రియులను మైమరిపించే ఆడియో మ్యాజిక్
  • 80 గంటల మైండ్ బ్లాకింగ్ బ్యాటరీ లైఫ్‌తో జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్స
  • అద్భుతమైన ఏఎన్‌సీ, స్పేషియల్ సౌండ్‌తో జేబీఎల్ కొత్త ధమాకా
ప్రకటన

JBL Live 780NC Review:    జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్స్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), లాంగ్ టైం బ్యాటరీ లైఫ్, ఎల్‌డీఏసీ సపోర్ట్, డజన్ల కొద్దీ ఆప్షన్లు ఉన్న కంపా నియన్ యాప్ ఇందులో లభిస్తాయి. కానీ దాదాపు రెండు వారాల పాటు ఆఫీస్ కాల్స్, మ్యూజిక్, సినిమాలు, గేమింగ్ కోసం దీనిని ఉపయోగించిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఇన్ని ఫీచర్లు డైలీ లైఫ్‌లో ఎంత వరకు ఉపయోగపడతాయి? రూ. 15,999 ధరకు ఇది నిజంగా తగిన వాల్యూ ఇస్తుందా? అనేది స్పష్టంగా తెలుస్తుంది.

డిజైన్, కంఫర్ట్ 
బెస్ట్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ అంటే పెట్టుకున్న తర్వాత వాటి ఉనికి మనకు తెలియకూడదు. జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ సరిగ్గా అలాగే అనిపిస్తుంది. ఉదయం కాఫీ తాగిన దగ్గర నుంచి వర్క్, టీమ్స్ మీటింగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకు రోజంతా పెట్టుకున్నా చెవులపై ఎలాంటి అసౌకర్యం కలగదు. ఇయర్ క్యూషన్లు చాలా సాఫ్ట్‌గా ఉండి వేడిని పట్టుకోవు. 260 గ్రాముల బరువును హెడ్‌బ్యాండ్ సమానంగా పంచిపెడుతుంది. క్లాంపింగ్ ఫోర్స్ సరిగ్గా ఉండటంతో తల భారంగా అనిపించదు.
 

JBL Live 780NC gadgets 360 review inline2 JBL Live 780NC

మెడ చుట్టూ ఫ్లాట్‌గా తిరిగేలా, క్యారీయింగ్ పౌచ్‌లో సులభంగా మడతబెట్టి పెట్టుకునేలా దీనిని డిజైన్ చేశారు. బాక్స్‌లో ఇచ్చే ఫ్యాబ్రిక్ పౌచ్ దుమ్ము పడకుండా కాపాడుతుంది కానీ ప్రయాణాల్లో హార్డ్-షెల్ కేస్ ఉంటే ఇంకా బాగుండేది. మ్యాట్ ఫినిషింగ్‌తో ఎలాంటి హంగామా లేని ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంది. కాకపోతే ఐపీ  వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లేకపోవడం వల్ల భారీ వర్షంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు చెమట పడితే కాస్త జాగ్రత్తగా ఉండాలి.

JBL Live 780NC gadgets 360 review inline3 JBL Live 780NC

కంట్రోల్స్, వేర్ డిటెక్షన్ 
ఇందులో ఫిజికల్ బటన్లు, టచ్ కంట్రోల్స్ రెండూ ఉన్నాయి. టచ్ గెస్చర్స్ బాగా పనిచేసినప్పటికీ, ఫిజికల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వచ్చే స్పష్టత ఎంతో బాగుంటుంది. నడుస్తున్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు బటన్లు ఈజీగా చేతికి తగులుతాయి. అంతేకాకుండా వేర్ డిటెక్షన్ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. చెవి నుంచి హెడ్‌ఫోన్స్ తీయగానే పాట ఆగిపోవడం, మళ్లీ పెట్టుకోగానే ప్లే అవ్వడం క్షణాల్లో జరుగుతుంది.

యా, స్పెసిఫికేషన్లు 
జేబీఎల్ హెడ్‌ఫోన్స్ యాప్ అనేక ఫీచర్లతో నిండి ఉంది. బ్లూటూత్ పెయిర్ చేసిన వెంటనే సైన్-అప్ ప్రాసెస్ లేకుండానే యాప్‌లోకి వెళ్లవచ్చు. ఇందులో నాయిస్ కంట్రోల్స్, స్పేషియల్ సౌండ్, పర్సని-ఫై 3.0, ఆరాకాస్ట్, ఎల్ఈ ఆడియో, కాల్ సెట్టింగ్స్ వంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. బాక్స్ నుంచి నేరుగా ఉపయోగించినప్పుడు హెడ్‌ఫోన్స్ ఎక్కువ బాస్ సౌండ్ ఇస్తాయి. అయితే యాప్‌లోని 10-బ్యాండ్ ఈక్వలైజర్ ద్వారా బాస్‌ను కాస్త తగ్గించి వోకల్స్  స్పష్టంగా వినపడేలా సెట్ చేసుకోవచ్చు. స్పేషియల్ సౌండ్ ఫీచర్ సినిమాలు చూసేటప్పుడు థియేటర్ అనుభూతిని ఇస్తుంది.
 

jbl live 780nc gadgets 360 review inline1 JBL Live 780NC

సౌండ్ పర్ఫార్మెన్స్, ఏఎన్‌సీ, మైక్ క్వాలిటీ 
వివిధ రకాల పాటలు, హెవీ బాస్ ట్రాక్స్, హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు దీని ఆడియో క్వాలిటీ అద్భుతంగా అనిపిస్తుంది. గేమింగ్‌లో ఆడేటప్పుడు సౌండ్ పొజిషనింగ్ స్పష్టంగా వినిపిస్తుంది. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఆఫీస్ నాయిస్ లేదా ఫ్యాన్ శబ్దాలను సులభంగా దూరం చేస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ద్వారా బయట శబ్దాలను కూడా క్లియర్‌గా వినవచ్చు. కాలింగ్ విషయానికి వస్తే మైక్ క్వాలిటీ బాగుండటంతో బయట గాలి వీస్తున్నప్పుడు కూడా అవతలి వ్యక్తికి ఆడియో క్లియర్‌గా వెళ్తుంది.

బ్యాటరీ లైఫ్ 
ఈ హెడ్‌ఫోన్స్‌లో అత్యంత ఇష్టపడే అంశం బ్యాటరీ లైఫ్. రోజంతా వర్క్ చేసి, సాయంత్రం గేమింగ్ లేదా సినిమాలు చూసినా కూడా రోజుకి 10 శాతం కంటే ఎక్కువ బ్యాటరీ తగ్గలేదు. కంపెనీ చెప్పినట్లు ఏఎన్‌సీ లేకుండా 80 గంటల ప్లేబ్యాక్ టైమ్ నిరభ్యంతరంగా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.
 

JBL Live 780NC gadgets 360 review inline4 JBL Live 780nc


ఫైనల్లీ
మీరు రోజంతా కంఫర్ట్‌గా ఉండేలా, ఛార్జింగ్ తిప్పలు లేకుండా, అద్భుతమైన ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కోసం చూస్తుంటే రూ. 15,999 ధరకు  జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ ఖచ్చితంగా బెస్ట్ ఛాయిస్. ఒకవేళ మీరు ఇతర ఆప్షన్లు చూడాలనుకుంటే.. మరింత బ్యాలెన్స్‌డ్ సౌండ్ కోసం సెన్‌హైజర్ యాక్సెంటమ్ ప్లస్ (రూ. 13,990) లేదా హెవీ బాస్ కోసం  సోనీ ఆల్ట్ వేర్ (రూ. 14,989) మోడళ్లను కూడా పరిశీలించవచ్చు.

JBL Live 780NC gadgets 360 review inline6 JBL Live 780NC

JBL Live 780NC gadgets 360 review inline5 JBL Live 780NC

JBL Live 780NC gadgets 360 review inline7 JBL Live 780NC

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
  2. Amazon Great Freedom Day Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్ ధమాకా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 22,350 భారీ తగ్గింపు
  3. Amazon Great Freedom Day Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ డే సేల్ హంగామా.. రూ. 20,000 లోపు దొరికే టాప్ 5 5జి స్మార్ట్‌ఫోన్లు ఇవే
  4. JBL Live 780NC Review: జేబీఎల్ లైవ్ 780ఎన్‌సీ హెడ్‌ఫోన్స్ రివ్యూ.. రూ. 15,999 కి ఇది కొంటే ఆడియో పిచ్చి ఎక్కాల్సిందే
  5. WhatsApp : వాట్సాప్ యూజర్లకు సరికొత్త ముప్పు.. ఏఐ ఏజెంట్లతో అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం
  6. Amazon Freedom Day Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రాపై రూ. 40,000 డిస్కౌంట్
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ల వర్షం.. తగ్గిన ఐఫోన్ 17, ఐఫోన్ 16 ధరలు
  8. Redmi 17 5G : 6300mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ 17 5G వచ్చేసింది.. ధర ఎంతంటే?
  9. Spam Calls : స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లపై ట్రాయ్ ఉక్కుపాదం.. ఏకంగా 148 కోట్ల కాల్స్ బ్లాక్
  10. Airtel : ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ.299 నుంచే అపరిమిత డేటా, ఉచిత ఓటీటీ ప్లాన్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »