వాట్సాప్ తన సిస్టమ్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూ సురక్షితంగా ఉంచుతామని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, ఇటీవల భద్రతా పరిశోధకులు ఒక కొత్త ప్రమాదాన్ని కనుగొన్నారు.
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ యాప్‌ను బిలియన్ల కొద్దీ ప్రజలు రోజువారీ చాటింగుల కోసం ఉపయోగిస్తున్నారు. భారత్‌లోనూ కోట్లాది మంది ప్రతిరోజూ యాడ్స్, ప్రమోషన్లు, పర్సనల్ మెసేజ్‌లు మార్పిడి చేసుకుంటారు. వాట్సాప్ తన సిస్టమ్‌ను నిరంతరం అప్‌డేట్ చేస్తూ సురక్షితంగా ఉంచుతామని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, ఇటీవల భద్రతా పరిశోధకులు ఒక కొత్త ప్రమాదాన్ని కనుగొన్నారు. ఏఐ సిస్టమ్స్ ద్వారా వాట్సాప్ అకౌంట్‌లలోని కాంటాక్ట్‌లను ఈజీగా హ్యాక్ లేదా మానిప్యులేట్ చేయవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అట్లాస్ బ్రౌజర్, ఏఐ ఏజెంట్ల పాత్ర
ప్రసిద్ధ సైబర్ సెక్యూరిటీ సంస్థ జెనిటీ పరిశోధకులు వెల్లడించిన కథనం ప్రకారం.. ఓపెన్ఏఐ వంటి పెద్ద సాంకేతిక సంస్థలు తీసుకొచ్చిన ఏఐ ఏజెంట్ల ఆధారంగా వాట్సాప్ చాట్ స్క్రీన్‌ను పూర్తిగా ఆటోమేట్ చేయవచ్చు. ముఖ్యంగా OpenAI కి చెందిన అట్లాస్ వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ రకమైన హ్యాకింగ్ సాధ్యమవుతోందని వారు గుర్తించారు. అట్లాస్ బ్రౌజర్‌లో ఇన్-బిల్ట్‌గా ఉండే ఏఐ ఏజెంట్ వినియోగదారుడికి బదులుగా వెబ్‌లో నావిగేట్ చేస్తూ పనులను పూర్తి చేయగలదు. అయితే ఈ ఏఐ ఏజెంట్‌ను హ్యాకర్లు సులభంగా బురిడీ కొట్టించి, యూజర్‌కు తెలియకుండానే వారి వాట్సాప్ కాంటాక్ట్‌లన్నింటికీ ఒకేసారి స్పామ్ మెసేజ్‌లు పంపేలా చేయవచ్చు.
వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ సురక్షితమేనా?
ఈ సైబర్ దాడి వల్ల వాట్సాప్ సొంత ఎన్‌క్రిప్షన్ లేదా మెటా ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ కోడింగ్‌లో ఎలాంటి లోపం రాలేదు. వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఎప్పటిలాగే సురక్షితంగానే ఉంటుంది. అయితే, ఏఐ ఏజెంట్ ఇన్‌స్ట్రక్షన్లను అర్థం చేసుకుని పనిచేసే విధానంలో ఉన్న లోపాలను హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే వాట్సాప్ సెక్యూరిటీ వాల్స్‌ను బద్దలు కొట్టకుండానే, బ్రౌజర్‌లో లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్‌ను ఏఐ ఏజెంట్ ద్వారా హ్యాకర్లు నియంత్రిస్తున్నారు.
Amazon Freedom Day Sale : అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రాపై రూ. 40,000 డిస్కౌంట్
ఈ హ్యాకింగ్ అటాక్ ఎలా జరుగుతుంది?
పరిశోధకులు జరిపిన ప్రయోగంలో.. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ఒక లింక్ ద్వారా న్యూస్‌లెటర్ సైన్-అప్ చేయమని అట్లాస్ ఏఐ ఏజెంట్‌ను కోరారు. ఆ వెబ్‌పేజీలో ఏఐ ఏజెంట్ కోసం కొన్ని దాచిన సూచనలు ఉన్నాయి. ఆ సూచనల ఆధారంగా ఏఐ ఏజెంట్ వినియోగదారుడి లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్‌ను ఓపెన్ చేసి, కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ అదే న్యూస్‌లెటర్ లింక్‌ను స్పామ్ మెసేజ్‌గా పంపింది. మెసేజ్ అందుకున్న కాంటాక్ట్‌లు కూడా ఆ లింక్ నమ్మదగినదేనని భావించి క్లిక్ చేయడంతో ఈ స్పామ్ నెట్‌వర్క్ చైన్ లాగా వేగంగా వ్యాపిస్తోంది. కాబట్టి థర్డ్ పార్టీ ఏఐ బ్రౌజర్లు వాడేటప్పుడు అపరిచిత లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Googlebook Render Leaked Again Ahead of Launch; Reveals Slim Profile