గత మూడేళ్లుగా ఆపిల్ భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర తన రెవెన్యూను నిలకడగా పెంచుకుంటూ వస్తోంది.
Photo Credit: Pexels/IRFHKMZ
Apple
Apple : ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో చరిత్ర సృష్టించింది. మార్చి 2026 నాటికి ఆపిల్ భారత్‌లో ఉత్పత్తులు, సేవల విక్రయం ద్వారా ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఆర్జించింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఆపిల్ భారత్‌లో ఈ రికార్డు స్థాయి మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి. అంతకుముందు సంవత్సరంలో ఈ రెవెన్యూ దాదాపు 9 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ మొత్తం విక్రయాల్లో ఐఫోన్‌ల వాటా అత్యధికంగా ఉండటంతో పాటు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లకు కూడా భారతీయ వినియోగదారుల నుంచి ఊహించని డిమాండ్ లభించింది.
మందగించిన మార్కెట్‌లోనూ ఆపిల్ విజయకేతనం
గత మూడేళ్లుగా ఆపిల్ భారత్‌లో ప్రతి సంవత్సరం దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర తన రెవెన్యూను నిలకడగా పెంచుకుంటూ వస్తోంది. ఈ రకమైన స్థిరమైన వృద్ధి వల్ల ఆపిల్‌కు భారత్ కేవలం ఒక సాధారణ మార్కెట్‌లా కాకుండా అత్యంత వ్యూహాత్మక మార్కెట్‌గా మారిపోయింది. 2026 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ క్షీణించినప్పటికీ ఆపిల్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఐడిసి నివేదిక ప్రకారం.. 2026 క్యూ1లో భారతదేశంలో మొత్తం 31 మిలియన్ ఐఫోన్లు షిప్‌మెంట్ కాగా, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 4.1 శాతం తక్కువ. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. గత 6 ఏళ్లలో ఇది అతి తక్కువ త్రైమాసికం కావడం గమనార్హం. అయినప్పటికీ ఆపిల్ తన రెవెన్యూలో మాత్రం ఏకంగా ఒక బిలియన్ డాలర్ల పెరుగుదలను సాధించింది.
గ్లోబల్ రెవెన్యూలో భారత్ ప్రాధాన్యత
జూన్ 2026 త్రైమాసికంలో ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా $109.4 బిలియన్ల గ్లోబల్ రెవెన్యూను నమోదు చేసింది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం ఎక్కువ. దీనిని బట్టి చూస్తే భారత్‌లో ఆపిల్ ఏడాది మొత్తం చేసే విక్రయాలు, గ్లోబల్ మార్కెట్‌లో దాని ఒక త్రైమాసిక విక్రయాల్లో పదో వంతు కంటే తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ, ప్రపంచంలో మిగిలిన ప్రధాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ కేటగిరీ మందగించిన సమయంలో, భారత్ మాత్రం ఆపిల్‌కు అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆశాకిరణంగా నిలిచింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా పలు సందర్భాల్లో భారత్‌ను తమ అత్యంత వేగవంతమైన వృద్ధి మార్కెట్లలో ఒకటిగా అభివర్ణించారు.
Mahindra : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మహీంద్రా రికార్డుల వేట.. నంబర్ 1 స్థానంలో నిలిచిన XEV 9S
షిప్‌మెంట్లలో 9 శాతం.. కానీ ఆదాయంలో 28 శాతం వాటా
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఫోన్లు ప్రీమియం విభాగంలో ఉంటాయి. ఐడిసి 2026 క్యూ1 డేటా ప్రకారం.. విక్రయించిన యూనిట్ల (వాల్యూమ్) పరంగా 9 శాతం వాటాతో ఆపిల్ నాల్గో స్థానంలో ఉంది. ఈ విభాగంలో వివో, శామ్‌సంగ్, ఒప్పో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తం మార్కెట్ సంపాదించిన రాబడి విషయానికి వస్తే మాత్రం ఆపిల్ ఏకంగా 28 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. అంటే మార్కెట్లో అమ్ముడైన ప్రతి 100 ఫోన్లలో కేవలం 9 మాత్రమే ఐఫోన్లు ఉండగా, ఆ 100 ఫోన్ల అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి 100 రూపాయల ఆదాయంలో ఆపిల్ ఒక్కటే రూ. 28 సొంతం చేసుకుంది.
ఐఫోన్ 17 సిరీస్ మ్యాజిక్.. తగ్గని క్రేజ్
ఐడిసి నివేదిక ప్రకారం.. ఒక్క ఐఫోన్ 17 మోడల్ మాత్రమే ఆ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ విక్రయాలలో 4 శాతం వాటాను ఆక్రమించింది. మన దేశంలో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 82,900 గా ఉంది. ఆపిల్ షిప్‌మెంట్ యూనిట్లు ఏడాది ప్రాతిపదికన 5 శాతం తగ్గినప్పటికీ, ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ప్రొడక్ట్ మిక్స్ అని స్పష్టమవుతోంది. ఫలితంగా ఐఫోన్ల విక్రయ సంఖ్య తగ్గినా, వచ్చే ఆదాయంలో మాత్రం ఆపిల్ ఎలాంటి నష్టాన్ని చవిచూడలేదు.
ప్రకటన
ప్రకటన
Flipkart Freedom Sale: Nothing Phone 4a Series, Reno 15 Series, More to Be Offered at a Discount
HP OmniPad 12 Goes on Sale in India With Snapdragon Chip, Detachable Keyboard