Upcoming Movies : ఆగస్ట్‌లో బాక్సాఫీస్ బొనాంజా.. థియేటర్లలో సందడి చేయనున్న 12 భారీ సౌత్ సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్ల నుంచి ఎమోషనల్ ఫ్యామిలీ కథల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా వినోదాన్ని పంచేందుకు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు బాక్సాఫీస్ రేసులో పోటీపడుతున్నారు.

Upcoming Movies : ఆగస్ట్‌లో బాక్సాఫీస్ బొనాంజా.. థియేటర్లలో సందడి చేయనున్న 12 భారీ సౌత్ సినిమాలు
ముఖ్యాంశాలు
  • సౌత్ చిత్రసీమ నుంచి థియేటర్లలో సందడి చేయబోతున్న 12 భారీ సినిమాలు
  • యష్ ‘టాక్సిక్’ నుంచి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వరకు
  • ఆగస్ట్ 2026 థియేట్రికల్ రిలీజ్ లైనప్ ఇదే
ప్రకటన

Upcoming Movies : సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ ఆగస్ట్ నెల మూవీ లవర్స్‎కు ఒక పెద్ద పండగలా మారబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ క్రేజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ ఎంటర్‌టైనర్ల నుంచి ఎమోషనల్ ఫ్యామిలీ కథల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా వినోదాన్ని పంచేందుకు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు బాక్సాఫీస్ రేసులో పోటీపడుతున్నారు. ఈ ఆగస్ట్ నెలలో మిస్ కాకుండా థియేటర్లలో తప్పక చూడాల్సిన టాప్ 12 సౌత్ సినిమాల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ 
కేజీయఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. ఈ కన్నడ-ఇంగ్లీష్ బైలింగ్వల్ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1940 - 1970ల మధ్య పోర్చుగీస్ పాలనలోని గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో రాయ్ అనే క్రూరుడైన వ్యక్తి అండర్‌వరల్డ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు. అతని కొడుకు రూమీ అలియాస్ టికెట్‌తో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది ఆగస్ట్ 26న థియేటర్లలో చూడవచ్చు.

2. డిసి 
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా అవతారమెత్తిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం డిసి. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రంలో వామిక గబ్బి, సంజనా కృష్ణమూర్తి కథానాయికలుగా నటించారు. ఆఫీసర్ హత్య, దొంగతనం నేరం మోపబడి పరారీలో ఉన్న దేవదాస్ అనే నేరస్థుడి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పాతకాలపు దేవదాస్ కథకు ఆధునిక రూపంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 7న విడుదల కానుంది.

3. కొరియన్ కనకరాజు 
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొణిదెల కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న డిఫరెంట్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు'. ఈ తెలుగు సినిమాలో రితిక నాయక్, సత్య, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఒక రహస్య కొరియన్ డ్రాగన్ పాత్రలో బంధించబడిన ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశించినప్పుడు, కొరియా అనే పదం వినగానే అతను కొరియన్ మాట్లాడే యోధుడిగా మారిపోయే క్రేజీ పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 7న థియేటర్లలోకి రానుంది.

4. జీడీఎన్ 
వర్సటైల్ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన బయోపిజల్ డ్రామా జీడీఎన్. ఈ తమిళ చిత్రంలో ప్రియమణి, సత్యరాజ్, దుషారా విజయన్, జయరామ్ తదితరులు నటించారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ వ్యక్తి తన వినూత్న ఆవిష్కరణలతో గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడనే ప్రేరణాత్మక కథతో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ అవుతోంది.

5. తొడక్కమ్  
మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ నటిగా అరంగేట్రం చేస్తున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ తొడక్కమ్. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనున్నారు. తన తండ్రితో ప్రశాంతంగా జీవిస్తున్న మీను జీవితంలోకి గతానికి సంబంధించిన ముప్పు ఎదురైనప్పుడు, తన కుటుంబ రక్షణ కోసం ఆమె ఎలా పోరాడిందనేది కథాంశం. ఈ సినిమా ఆగస్ట్ 7న విడుదలవుతోంది.

6. హాయ్ 
లేడీ సూపర్‌స్టార్ నయనతార, కేవీఎన్ కాంబినేషన్‌లో విష్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం  హాయ్. రాధికా శరత్‌కుమార్, ప్రభు, వీటీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న హాయ్‎తో మొదలైన పరిచయంతో ఎలా ప్రేమలో పడ్డారనేది ఈ సినిమా కథ.

7. ఐ యామ్ గేమ్ 
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్'. ఆంటోనీ వర్గీస్ పేపే, కతిర్, మిస్సికిన్, సంయుక్త, కయాదు లోహర్ నటించిన ఈ మలయాళ చిత్రం ఆగస్ట్ 20న రిలీజ్ కానుంది. అల్గోరిథం ఉపయోగించి బెట్టింగ్‌లు కాస్తూ జాలీగా బతికే డ్యాన్ జాన్ జీవితం, ఆ సిస్టమ్ అతనికే తిరగబడినప్పుడు ఎలా మారిపోయిందనే సస్పెన్స్ కథతో ఇది రాబోతోంది.

8. మగుడం  
మాస్ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన యాక్షన్ డ్రామా చిత్రం మగుడం. అంజలి, దుషారా విజయ్, యోగి బాబు నటించిన ఈ తమిళ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. శాంతియుతంగా బ్రతకాలనుకునే ఒక సాధారణ వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువులపై పగ తీర్చుకోవడానికి మళ్లీ హింసాత్మక మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడనేది ఈ సినిమా నేపథ్యం.

9. ఖలీఫా: పార్ట్ 1 - ది ఇంట్రో 
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో వైశాఖ్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఖలీఫా: పార్ట్ 1'. నీల్ నితిన్ ముకేష్, మాళవిక శర్మ నటించిన ఈ మలయాళ చిత్రంలో మోహన్ లాల్ కేమియో రోల్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్, లండన్, నేపాల్, కేరళ వ్యాప్తంగా విస్తరించిన గోల్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడిపే అమీర్ అలీ కథతో ఆగస్ట్ 20న ఈ చిత్రం రాబోతోంది.

Redmi K100 Pro Max : ఏకంగా 9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రాబోతున్న రెడ్‌మీ K100 ప్రొ మ్యాక్స్

10. ఇరుముడి  
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇరుముడి. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్ నటించిన ఈ తెలుగు చిత్రం ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతం వల్ల తాగుడుకు బానిసైన ఒక తండ్రి, తన చిన్న కూతురి కోరిక మేరకు మారాలని నిశ్చయించుకుని శబరిమల యాత్రకు బయలుదేరిన క్రమంలో ఎదురయ్యే భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రం.

11. విశ్వనాథ్ అండ్ సన్స్  
వర్సటైల్ నటుడు సూర్య, మమితా బైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కాంబినేషన్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా విశ్వనాథ్ అండ్ సన్స్. తన కెరీర్‌లో ఆఖరి రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సంజయ్ విశ్వనాథ్ అనే క్రీడాకారుడి జీవితం, ఒక చిన్న వయస్సు అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత ఎలా మలుపు తిరిగందనే ఆసక్తికర కథతో ఆగస్ట్ 14న ఈ తమిళ చిత్రం రానుంది.

12. బెత్లెహేము ఫ్యామిలీ యూనిట్ 
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం బెత్లెహేము ఫ్యామిలీ యూనిట్. వినయ్ ఫోర్ట్, శ్రీంద ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళ చిత్రం ఆగస్ట్ 21న విడుదల కానుంది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆష్లే అనే యువకుడు స్థానిక కుటుంబ కమిటీలో చిక్కుకోవడం, అక్కడ జరిగే ఒక వయస్సు వ్యత్యాసంతో కూడిన ప్రేమకథ, పెళ్లి రచ్చలతో నవ్వులు పూయించేలా ఈ సినిమా ఉండబోతోంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »