యూపీఐ నెట్‌వర్క్ భవిష్యత్తు విస్తరణకు, సాంకేతిక నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది.
Photo Credit: Pexels/Nataliya Vaitkevich
UPI
UPI : భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇకపై పూర్తి ఉచితంగా అందుబాటులో ఉండకపోవచ్చు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లో పలు కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ మార్పుల ద్వారా యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ (MDR) అమలు చేయడానికి మార్గం సుగమం కానుంది. యూపీఐ నెట్‌వర్క్ భవిష్యత్తు విస్తరణకు, సాంకేతిక నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయకుండా ఉన్న నిబంధనను తొలగించాలని ఈ సవరణ ప్రతిపాదిస్తోంది.
అసలు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది ఒక విధమైన ప్రాసెసింగ్ రుసుము. వినియోగదారులు డిజిటల్ ద్వారా చేసే చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు గాను వ్యాపారస్థులు, బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లకు ఈ రుసుమును చెల్లిస్తారు. 2020 సంవత్సరం నుంచి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై 0% ఎండీఆర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. సాధారణంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో రూ. 1,000 చెల్లిస్తే, అందులో కొంత చిన్న మొత్తం కోత విధించి బ్యాంకులకు పంచుతారు. మిగిలిన మొత్తం వ్యాపారికి చేరుతుంది. కానీ ప్రస్తుతం యూపీఐ లావాదేవీలలో వ్యాపారికి పూర్తి మొత్తం అందుతుంది, బ్యాంకులకు రూపాయి కూడా రాదు.
సాధారణ యూపీఐ వినియోగదారులపై పడే ప్రభావం ఎంత?
ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, ఏయే లావాదేవీలపై, ఎంత శాతం రుసుం విధించాలనే దానిపై స్పష్టమైన రేట్లను ఖరారు చేస్తారు. అయితే ఈ ప్రతిపాదనలో సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొనలేదు. అంటే ఎండీఆర్ భారం కేవలం వ్యాపారులపై మాత్రమే పడుతుంది. కాబట్టి రోజువారీగా యూపీఐ యాప్‌లను ఉపయోగించే సామాన్య ప్రజలు లేదా వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా ట్రాన్సాక్షన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
యూపీఐ పై ఎండీఆర్ విధింపుకు కారణాలేంటి?
ఆర్థిక శాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో ఏకంగా 88 శాతం వాటా ఒక్క యూపీఐ దే కావడం విశేషం. దీని ద్వారా బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు ప్రతి నెలా దాదాపు రూ. 30 లక్షల కోట్ల విలువైన 23 బిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నారు. జీరో ఎండీఆర్ విధానం వల్ల యూపీఐ వ్యవస్థను సుదీర్ఘకాలం ఉచితంగా నిర్వహించడం ఆర్థికంగా అసాధ్యమని కమిటీ హెచ్చరించింది. భవిష్యత్తులో నెలకు 100 నుంచి 150 బిలియన్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉన్నందున, నిరంతర సాంకేతిక పెట్టుబడులు అవసరమని, దీనిని కేవలం ప్రభుత్వ ప్రోత్సాహకాలతో భరించడం వీలుకాదని పేర్కొంది.
Redmi K100 Pro Max : ఏకంగా 9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రాబోతున్న రెడ్‌మీ K100 ప్రొ మ్యాక్స్
పరిశ్రమ వర్గాలు ఎండీఆర్ కోరడానికి ప్రధాన కారణాలు
సుమారు 180 మంది సభ్యులతో కూడిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. జీరో ఎండీఆర్ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కోరింది. ఉచిత విధానం వల్ల డిజిటల్ పేమెంట్ వ్యవస్థ తీవ్ర ఆర్థిక స్థిరత్వ సమస్యలను ఎదుర్కొంటోందని PCI ఆందోళన వ్యక్తం చేసింది. యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఏటా దాదాపు రూ. 10,000 కోట్లు ఖర్చవుతుండగా, ప్రభుత్వం ఇస్తున్న రూ. 1,500 కోట్ల సబ్సిడీ ఏమాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రుపే డెబిట్ కార్డులపై అందరు వ్యాపారులకు ఎండీఆర్ వర్తింపజేయాలని, అలాగే పెద్ద వ్యాపారులకు మాత్రమే యూపీఐ పై 0.3% ఎండీఆర్ విధించాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains