iPhone 17 Price Hiked: 17 ఐఫోన్ కొనాలనుకునే వారికి ఆపిల్ ఊహించని షాక్.. ఒకేసారి 11 శాతం పెరిగిన ధరలు!

Apple hikes iPhone 17 Prices by up to 11%: ఐఫోన్ 17 పాత ధర 1,29,800 యెన్ల నుంచి కొత్తగా 1,42,800 యెన్లకు (సుమారు రూ.84,600) పెరిగింది.

iPhone 17 Price Hiked: 17 ఐఫోన్ కొనాలనుకునే వారికి ఆపిల్ ఊహించని షాక్.. ఒకేసారి 11 శాతం పెరిగిన ధరలు!

Photo Credit: Apple

iPhone Air

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్
  • జపాన్‌లో భారీగా పెరిగిన ఐఫోన్ 17 ధరలు
  • రాబోయే ఐఫోన్ 18 సిరీస్ మరింత కాస్ట్లీ
ప్రకటన

Apple Hikes iPhone 17 Prices by up to 11%: గ్లోబల్ ఆపిల్ ప్రియులకు దిమ్మతిరిగే వార్త వెలువడింది. మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌ల ధరలను పెంచిన ఆపిల్, ఇప్పుడు జపాన్‌లో ఐఫోన్ల ధరలను కూడా భారీగా పెంచేసింది. ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు సరికొత్త ఐఫోన్ 17, ఐఫోన్ ఏరియా, ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ వరకు అన్ని రకాల ఐఫోన్ మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. జపాన్‌లో పెరిగిన ధరల వల్ల రాబోయే ఐఫోన్ 18 ప్రో మోడళ్ల ధరలు కూడా భవిష్యత్తులో ఆకాశాన్ని తాకుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

జపాన్‌లో షాకిచ్చిన ఆపిల్.. ఎంత పెరిగాయి..?

ఆపిల్ కంపెనీ జపాన్‌లో తమ ఐఫోన్‌ల ధరలను గరిష్టంగా 11.3% వరకు పెంచేసింది. జపనీస్ కరెన్సీ (యెన్) విలువ పడిపోవడం, విడిభాగాల వ్యయం పెరగడమే ఇందుకు కారణం.  

ఐఫోన్ 17: పాత ధర 1,29,800 యెన్ల నుంచి కొత్తగా 1,42,800 యెన్లకు (సుమారు రూ.84,600) పెరిగింది.  

ఐఫోన్ ఏర్: 1,59,800 యెన్ల నుంచి 1,77,800 యెన్లకు (సుమారు రూ.1,05,336) ఎగబాకింది.  

ఐఫోన్ 17 ప్రో: 1,79,800 యెన్ల నుంచి ఏకంగా 1,94,800 యెన్లకు (సుమారు రూ.1,15,400) పెరిగింది.  

ఐఫోన్ 17 ప్రో మాక్స్: 1,94,800 యెన్ల నుంచి 2,14,800 యెన్లకు (సుమారు రూ.1,27,000) చేరింది.  

ఎంట్రీ లెవెల్ మోడల్స్ ఐఫోన్ 17e ధర 1,07,800 యెన్లు (సుమారు రూ.63,865) కాగా, ఐఫోన్ 16 ధర 1,14,800 యెన్లకు (సుమారు రూ.68,012) పెరిగింది.  

Samsung Galaxy Unpacked Event: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం

భారత్‌లోనూ ఐఫోన్లు ప్రియం కానున్నాయా..?

గ్లోబల్‌గా మెమరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ వ్యయం గణనీయంగా పెరగడం వల్లనే ఈ ధరల భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందే సూచించారు. ఈ ప్రభావంతో భారత్‌లోనూ ఇప్పటికే ఆపిల్ వన్, ఆపిల్ మ్యూజిక్ ప్లాన్‌ల ధరలను కంపెనీ సవరించింది. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ల ధరల పెంపుపై ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలోనూ ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »