Samsung Galaxy Unpacked Event on July 22: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం

Samsung Galaxy Unpacked event on July 22 in London: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తమ తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈవెంట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8 మోడళ్లను లాంచ్ చేసే అవకాశముంది

Samsung Galaxy Unpacked Event on July 22: జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు సిద్ధం

Samsung

ముఖ్యాంశాలు
  • జూలై 22న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్
  • పాస్‌పోర్ట్ సైజ్ డిజైన్‌తో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8
  • గెలాక్సీ Z ఫోల్డ్ 8, అల్ట్రా, ఫ్లిప్ 8 లాంచ్ డేట్ ఖరారు
ప్రకటన

Samsung Galaxy Unpacked Event set for July 22 in London: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తమ తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. లండన్‌ వేదికగా జూలై 22న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ గ్రాండ్ ఈవెంట్‌లో ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌లను అధికారికంగా పరిచయం చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8 మోడళ్లను లాంచ్ చేసే అవకాశముంది. ఈసారి కంపెనీ తన తయారీ ప్రణాళికల్లో కీలక మార్పులు చేస్తూ ఉత్పత్తుల ఉత్పత్తి సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తోంది.

మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం శామ్‌సంగ్ వైడ్ డిస్ప్లేతో రానున్న గెలాక్సీ Z ఫోల్డ్ 8 ప్రొడక్షన్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ మోడల్‌ను సుమారు 28 లక్షల (2.8 మిలియన్) యూనిట్లు ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. మరోవైపు ప్రీమియం మోడల్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రాను 20 లక్షల యూనిట్లు, గెలాక్సీ Z ఫ్లిప్ 8ను దాదాపు 15 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో రెండు ఫోల్డ్ మోడళ్లకు సమాన సంఖ్యలో ప్రొడక్షన్ కెపాసిటీ కేటాయించినప్పటికీ, ఈసారి డిమాండ్‌ను బట్టి వ్యూహాన్ని మార్చింది.

Truth Social : ట్రంప్ ట్వీట్ ముందే కావాలా? నెలకు రూ. 85 లక్షలు కట్టాల్సిందే

పాస్‌పోర్ట్ సైజ్ డిజైన్.. అదిరిపోయే డిస్ప్లే..

సాధారణంగా శామ్‌సంగ్ ప్రతి ఏటా Z సిరీస్ నుంచి దాదాపు 60 లక్షల యూనిట్లను షిప్‌మెంట్ చేస్తుంటుంది. గత ఏడాది గెలాక్సీ Z ఫోల్డ్ 7కి లభించిన భారీ ఆదరణతో ఈ మార్క్ సులువుగా దాటింది. ఇక రాబోయే గెలాక్సీ Z ఫోల్డ్ 8 డిజైన్ విషయంలో శామ్‌సంగ్ పెద్ద ప్రయోగమే చేస్తోంది. ఇది పాస్‌పోర్ట్ తరహా వైడ్-ఫోల్డింగ్ డిజైన్‌తో రానున్న కంపెనీ మొదటి ఫోన్ కానుంది. ఇందులో 5.5 ఇంచుల కవర్ స్క్రీన్, 7.6 ఇంచుల AMOLED ఇన్నర్ స్క్రీన్ ఉండనున్నాయి. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా దీని ధర అల్ట్రా మోడల్ కంటే తక్కువగా ఉండవచ్చని వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ రానుందని సమాచారం.

లండన్ ఈవెంట్‌లో ఇతర కొత్త గాడ్జెట్లు..

జూలై 22న బ్రిటన్‌లోని లండన్ నగరంలో అట్టహాసంగా జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్ గాడ్జెట్‌లు కూడా సందడి చేయనున్నాయి. శామ్‌సంగ్ నుంచి కొత్తగా రాబోతున్న గెలాక్సీ వాచ్ అల్ట్రా 2, గెలాక్సీ వాచ్ 9 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లను కూడా ఇదే వేదికపై ఆవిష్కరించడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »