ఐఫోన్‌ను కేవలం రూ.2,371 ప్రారంభ నెలవారీ ఈఎంఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
Apple: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆపిల్ అధికారిక విక్రేత ఇన్వెంట్ ఫ్రీడమ్ టు అప్‌గ్రేడ్ పేరుతో మైండ్ బ్లోయింగ్ సేల్‌ను ప్రారంభించింది. ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా పిలుపు లాంటి అవకాశమే. ప్రియమైన ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో పాటు భారీ ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను సైతం అందిస్తోంది.
ఐఫోన్‌పై రూ.12,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్
ఈ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్‌ను కేవలం రూ.2,371 ప్రారంభ నెలవారీ ఈఎంఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే మోడల్, ఆఫర్‌ను బట్టి ఈ ఈఎంఐ ధర మారుతుంది. ఉదాహరణకు సరికొత్త ఐఫోన్ 17 మోడల్‌ను నెలకు రూ.3,412 అత్యంత తక్కువ ఈఎంఐకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.12,000 వరకు అదనపు బోనస్ లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కొత్త ఐఫోన్ అసలు ధర భారీగా తగ్గుతుంది. అయితే మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్ ఆధారంగా తుది ఎక్స్చేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది.
మ్యాక్‌బుక్, ఐప్యాడ్లపై కూడా అదిరిపోయే డిస్కౌంట్స్
ఐఫోన్‌తో పాటు మ్యాక్‌బుక్, ఐప్యాడ్ లవర్స్‌కు కూడా ఇన్వెంట్ తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన మ్యాక్‌బుక్ మోడళ్లపై నేరుగా 8 శాతం వరకు తక్షణ తగ్గించి ఇస్తోంది. దీనికి అదనంగా రూ. 15,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే వెసులుబాటు కూడా ఉంది. విద్యార్థులు, విద్యా రంగానికి చెందిన వారి కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంచారు. ఐప్యాడ్ లవర్స్ కోసం ఎంపిక చేసిన మోడళ్లపై 5 శాతం తగ్గింపుతో పాటు రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఆఫర్లను ఉపయోగించుకుని తక్కువ ధరకే ప్రీమియం డివైజ్‌లను కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ ఫ్లాగ్షిప్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఆఫర్.. రూ.45,000 తక్కువకే 200MP కెమెరా ఫోన్
24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ స్పెషల్
ఈ సేల్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ 24 నెలల సుదీర్ఘమైన నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్. ఎటువంటి వడ్డీ లేకుండా రెండేళ్ల కాలవ్యవధిలో నెలకు కొద్దిమొత్తంలో చెల్లించే వెసులుబాటు ఉండటంతో సామాన్యులు కూడా ప్రీమియం ఆపిల్ డివైజ్‌లను సులభంగా సొంతం చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Vivo X500 Pro Max Reportedly Bags 3C Certification, Charging Speed Revealed
CD Projekt Red Confirms Layoffs at Project Sirius Witcher Multiplayer Spinoff