iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్స్ లీక్.. మూడు సరికొత్త రాయల్ షేడ్స్‌తో మార్కెట్లోకి ఐఫోన్

ఆపిల్ కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ అయిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్ వేరియంట్లు, డిజైన్ లీక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ జాన్ రెట్టింగర్ (@Jon4Lakers) ద్వారా అధికారికంగా లీక్ అయ్యాయి.

iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్స్ లీక్.. మూడు సరికొత్త రాయల్ షేడ్స్‌తో మార్కెట్లోకి ఐఫోన్

Photo Credit: X/@Jon4Lakers

iPhone 18 Pro Max

ముఖ్యాంశాలు
  • ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్స్ లీక్
  • రెడ్, పింక్ కాంబినేషన్‌తో అదిరిపోయే ఐఫోన్ లుక్
  • సరికొత్త ట్విట్టర్ లీక్స్‌లో షాకింగ్ ఫొటోలు
ప్రకటన

iPhone 18 Pro Max : గ్లోబల్ టెక్ మార్కెట్లో ఆపిల్ కంపెనీ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో వచ్చే కొత్త ఐఫోన్ సిరీస్ కోసం యాపిల్ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది చివర్లో రాబోతున్న ఐఫోన్ 18 సిరీస్ గురించిన వార్తలు ఇంటర్నెట్‌లో ఇప్పుడే తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ అయిన  ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్ వేరియంట్లు, డిజైన్ లీక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ప్రముఖ టిప్‌స్టర్ జాన్ రెట్టింగర్ (@Jon4Lakers) ద్వారా అధికారికంగా లీక్ అయ్యాయి.

లీకైన ఫొటోల ప్రకారం.. ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ఆపిల్ కంపెనీ డార్క్ చెర్రీ అనే సరికొత్త విప్లవాత్మక రంగును పరిచయం చేయబోతోంది. సాధారణంగా ఆపిల్ తన ఫోన్లలో రెడ్, పింక్ రంగులను విడివిడిగా ఇస్తుంది. కానీ ఈసారి పింక్ కలర్ లో ఉండే సాఫ్ట్‌నెస్, రెడ్ కలర్ లో ఉండే బోల్డ్ లుక్‌ను కలిపి ఈ డార్క్ చెర్రీ షేడ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కలర్ ఐఫోన్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన, మోస్ట్ ప్రీమియం లుక్‌ను ఇస్తుందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు.

ఈ లీక్స్‌లో డార్క్ చెర్రీతో పాటు మరో రెండు ఆకర్షణీయమైన కలర్ షేడ్స్ కూడా కనిపించాయి. అందులో ఒకటి లైట్ బ్లూ కలర్. ఈసారి బ్లూ కలర్‌ను మునుపటి కంటే కాస్త గాఢంగా, ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో ఆపిల్ రూపొందించింది. అలాగే యాపిల్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్న క్లాసిక్ మ్యాట్ బ్లాక్ కలర్ కూడా ఈ సిరీస్ ద్వారా తిరిగి రాబోతోంది. ఈ బ్లాక్ కలర్ వేరియంట్‌లో బ్యాక్ ప్యానెల్ మ్యాట్ ఫినిషింగ్‌తో ఉండి.. కెమెరా ఐలాండ్ ఏరియా మాత్రం కాస్త డార్క్ గ్లోసీ బ్లాక్ కలర్ లో ఉండేలా డ్యూయల్ టోన్ డిజైన్‌ను అందించడం విశేషం.

 

Avataar AI : భారతీయ స్టార్టప్ సరికొత్త సంచలనం.. సొంత వీడియో జనరేషన్ ఏఐ మోడల్ Varya లాంచ్



డిజైన్ పరంగా ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. స్క్రీన్ పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజును ఈసారి కంపెనీ దాదాపు 30 శాతం వరకు తగ్గించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల కస్టమర్లకు స్క్రీన్ పై డిస్‌ప్లే ఏరియా మరింత ఎక్కువగా లభిస్తుంది. గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు ఈ చిన్న డైనమిక్ ఐలాండ్ వినియోగదారులకు అస్సలు అడ్డుగా అనిపించదు.

సాంకేతిక పరంగా ఐఫోన్ 18 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్ కాబోతోంది. ఇందులో ఆపిల్ కంపెనీ సరికొత్త  A20 ప్రో ప్రాసెసర్‌ను ఉపయోగించనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, తక్కువ బ్యాటరీని వినియోగించుకునే సామర్థ్యం కలిగిన చిప్‌సెట్ అని తెలుస్తోంది. దీనితో పాటు మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం లేటెస్ట్ సి2 మోడెమ్‌ను కూడా ఇందులో జత చేయనున్నారు. ఆపిల్ తన పాత ట్రెండ్‌ను ఫాలో అయితే గనుక ఈ సరికొత్త ఐఫోన్ 18 సిరీస్ అధికారిక గ్లోబల్ లాంచ్ సెప్టెంబర్ 2026 మధ్య వారంలో ఉండే అవకాశం ఉంది.

#తాజా కథనాలు
  1. OTT Movies : ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వీకెండ్ డిఫరెంట్ జోనర్లలో ఐదు సరికొత్త సినిమాలు, సిరీస్‌లు
  2. Honor X80 Pro Max : ఏకంగా 11,000mAh బ్యాటరీ.. సరికొత్త రికార్డు సృష్టించబోతున్న హానర్ నయా మొబైల్
  3. OnePlus Nord Buds : ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్?.. వన్‌ప్లస్ కొత్త ఇయర్‌బడ్స్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
  4. Oppo Reno 16 : ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా... భారత్‌లో ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ డేట్ లీక్
  5. iPhone 18 Pro Max : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కలర్స్ లీక్.. మూడు సరికొత్త రాయల్ షేడ్స్‌తో మార్కెట్లోకి ఐఫోన్
  6. WhatsApp : ఉచిత సేవలకు కాలం చెల్లనుందా?.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు నెలకు రూ.2,200
  7. Oppo Reno 16 Pro : జులై 2న ఇండియాలో గ్రాండ్ ఎంట్రీ.. ఒప్పో రెనో 16 సిరీస్ స్పెసిఫికేషన్ల లీక్
  8. Flipkart June Epic Sale : మోటరోలా లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. జూన్ ఎపిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
  9. Avataar AI : భారతీయ స్టార్టప్ సరికొత్త సంచలనం.. సొంత వీడియో జనరేషన్ ఏఐ మోడల్ Varya లాంచ్
  10. Samsung : ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే.. శామ్‌సంగ్ నుంచి సరికొత్త విజన్ ఏఐ బిగ్ టీవీ ఆఫర్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »