Oneplus Nord Buds 4 Design reveal: ఈ కొత్త నోర్డ్ బడ్స్ 4 లో క్లాసిక్ స్టెమ్ స్టైల్ డిజైన్‌ను అందించారు. ఇవి చెవుల్లో పవర్‌ఫుల్‌గా కూర్చోవడానికి వీలుగా సాఫ్ట్ సిలికాన్ ఇయర్‌టిప్స్‌ను జత చేశారు.
Photo Credit: OnePlus
OnePlus Nord Buds 4
Oneplus Nord Buds 4 Design Reveal: భారతీయ ఆడియో, ఇయర్‌బడ్స్ మార్కెట్లో వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ బడ్స్‌కు చాలా మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలోనే ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా వన్‌ప్లస్ కంపెనీ తన అప్‌కమింగ్ మోడల్ వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4కి సంబంధించిన అధికారిక టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసింది. ఈ టీజర్ ద్వారా సరికొత్త ఇయర్‌బడ్స్ ఫస్ట్ లుక్, డిజైన్ వివరాలు అధికారికంగా బయటకు వచ్చాయి.
పూర్తిగా మారిన సరికొత్త డిజైన్..
కంపెనీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్ ప్రకారం.. ఈ కొత్త నోర్డ్ బడ్స్ 4 లో క్లాసిక్ స్టెమ్ స్టైల్ డిజైన్‌ను అందించారు. ఇవి చెవుల్లో పవర్‌ఫుల్‌గా కూర్చోవడానికి వీలుగా సాఫ్ట్ సిలికాన్ ఇయర్‌టిప్స్‌ను జత చేశారు. ఇక అన్నింటికంటే పెద్ద మార్పు దీని ఛార్జింగ్ కేస్‌లో కనిపిస్తోంది. పాత తరం నోర్డ్ బడ్స్ 3 లో గుండ్రటి షేప్ కేస్ ఉండగా.. ఈ నయా నోర్డ్ బడ్స్ 4 లో కంపెనీ రెక్టాంగిల్ షేప్ కేస్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త లుక్ బడ్స్‌కు మరింత ప్రీమియం, స్టైలిష్ అప్పీల్‌ను ఇస్తోంది.
టచ్ కంట్రోల్స్, అదిరిపోయే ఫీచర్లు..
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఇయర్‌బడ్స్‌పై సులభంగా మ్యూజిక్ మార్చుకోవడానికి, కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుగా స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఆప్షన్స్ ఇవ్వనున్నారు. గతంలో కంపెనీ లాంచ్ చేసిన ప్రో మోడల్ ధర రూ.3,999 గా ఉంది. కాబట్టి ఈ స్టాండర్డ్ మోడల్ నోర్డ్ బడ్స్ 4 ధర అంతకంటే చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో అడ్వాన్స్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు లేటెస్ట్ బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని అందించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఆడియో కనెక్టివిటీ ఎక్కడా లాగ్ అవ్వకుండా ల్యాగ్‌లెస్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
Flipkart June Epic Sale : మోటరోలా లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. జూన్ ఎపిక్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
50 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్..
వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ ఇయర్‌బడ్స్ ఎప్పుడూ కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. ఈ క్రమంలోనే రాబోయే వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4 లో ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 50 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ టైమ్ లభించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటు దుమ్ము, నీటి చుక్కల నుండి రక్షణ కోసం బెస్ట్ ఐపీ రేటింగ్ ఫీచర్‌ను కూడా అందించనున్నారు. ఈ ఫీచర్లు అన్నీ కలిపి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో దీనిని ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలబెట్టనున్నాయి.
భారత్‌లో అంచనా ధర, లభ్యత..
భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4 ధర సుమారు రూ.2,999 ఆస్పాస్‌లో ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. వన్‌ప్లస్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సౌండ్ చెక్ త్వరలోనే ప్రారంభం కానుంది అంటూ పోస్ట్ చేయడంతో.. ఈ నెలాఖరుకల్లా ఇవి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android