Meta one subscription plans: ఉచిత సేవలకు కాలం చెల్లనుందా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు నెలకు రూ.2,200

Meta one subscription plans: ఇప్పుడు ఈ మెటా వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లకు సంబంధించిన సపోర్ట్‌ను వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా జోడిస్తున్నట్లు సమాచారం లీకైంది.

Meta one subscription plans: ఉచిత సేవలకు కాలం చెల్లనుందా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు నెలకు రూ.2,200

Photo Credit: Pixabay

Meta One Premium plan reportedly costs EUR 20.99 (roughly Rs. 2,200) per month

ముఖ్యాంశాలు
  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు పెయిడ్ ప్లాన్స్
  • మెటా నుంచి రెండు రకాల ప్లాన్స్
  • యాప్ నుంచే డైరెక్ట్‌గా మేనేజ్ చేసుకోవచ్చు
ప్రకటన

Meta one subscription Plans: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన యూజర్ల కోసం సరికొత్త పెయిడ్ సేవలను విస్తరించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. గత నెలలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యాప్స్ కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిని మెటా వన్ అనే ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి టెస్టింగ్ చేస్తోంది. కాగా, ఇప్పుడు ఈ మెటా వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లకు సంబంధించిన సపోర్ట్‌ను వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా జోడిస్తున్నట్లు సమాచారం లీకైంది. దీనివల్ల యూజర్లు వేర్వేరుగా కాకుండా, ఒకే ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో మెటాకు చెందిన అన్ని యాప్స్‌లోనూ ప్రీమియం ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో లీకైన ప్లాన్ల వివరాలు
వాట్సాప్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్లను ట్రాక్ చేసే ప్రైవేట్ పోర్టల్ వాబీటాఇన్ఫో ఈ సరికొత్త మార్పును గుర్తించింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.23.10 లో ఈ మెటా వన్ ప్లాన్లకు సంబంధించిన కోడింగ్, స్క్రీన్‌షాట్లు బయటకు వచ్చాయి. ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు ఇతర వెబ్‌సైట్లకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్ యాప్ లోపల నుంచే ఈ ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు, అలాగే వాటిని మేనేజ్ లేదా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి వాట్సాప్ ప్లస్ ప్రయోజనాలతో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, మెటా ఏఐ లలో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు లభిస్తాయి.

మెటా వన్ ప్లస్ ధర, ఫీచర్లు
లీకైన నివేదికల ప్రకారం.. మెటా సంస్థ ఇందులో రెండు రకాల ప్లాన్లను ఆఫర్ చేయబోతోంది. మొదటిది మెటా వన్ ప్లస్ ప్లాన్. దీని ధర నెలకు 6.99 యూరోలు (మన భారత కరెన్సీలో దాదాపు రూ.700)గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి వాట్సాప్ ప్లస్ సేవలతో పాటు అడ్వాన్స్‌డ్ ఇమేజ్ క్రియేషన్ టూల్స్, హై క్వాలిటీ వీడియో ఎడిటింగ్ టూల్స్ లభిస్తాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్, పోస్టులు చేసే క్రియేటర్లకు ఈ బేసిక్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మెటా వన్ ప్రీమియం ధర, ఫీచర్లు
ఇక భారీ ఫీచర్లతో రాబోతున్న రెండో ప్లాన్  మెటా వన్ ప్రీమియం. దీని ధర నెలకు 20.99 యూరోలు (మన కరెన్సీలో దాదాపు రూ.2,200) గా ఉండే అవకాశం ఉందని స్క్రీన్‌షాట్ల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ప్లాన్‌పై ఒక నెల పాటు ఉచిత ట్రయల్ కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రీమియం ప్లాన్‌లో మెటా వన్ ప్లస్ ఫీచర్లతో పాటు.. మెటా ఏఐకి సంబంధించిన గరిష్ట అధికారాలు లభిస్తాయి. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే అడ్వాన్స్‌డ్ రీజనింగ్ సామర్థ్యం, అపరిమితంగా ఇమేజ్-వీడియో జనరేషన్ అలవెన్స్, అత్యధిక ఏఐ యూసేజ్ లిమిట్స్ ఈ ప్లాన్ సొంతం.

OnePlus : స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. మార్కెట్లోకి 9000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ ఫోన్లు

వాట్సాప్ ప్లస్‌తో రాబోయే క్రేజీ మార్పులు ఇవే
ఈ రెండు ప్లాన్లలోనూ వినియోగదారులకు వాట్సాప్ ప్లస్ సేవలు ఉచితంగా లభిస్తాయి. దీని ద్వారా సాధారణ వాట్సాప్ యూజర్ల కంటే పెయిడ్ యూజర్లకు సరికొత్త యాప్ థీమ్స్, మనకు నచ్చినట్లు సెట్ చేసుకునే కస్టమ్ రింగ్‌టోన్లు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన చాట్స్‌ను ఎక్కువ సంఖ్యలో పిన్ చేసుకునే సదుపాయం, కస్టమ్ లిస్ట్ మేనేజ్‌మెంట్, సరికొత్త ప్రీమియం స్టిక్కర్లు, అదనపు ప్రైవసీ ఫీచర్లు లభిస్తాయి. ప్రస్తుతం ఈ ఫేస్‌బుక్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సేవలు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా రోల్ అవుట్ కానున్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi K100 Pro Series  : ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరా.. షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు
  2. iQOO Z11 : ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు.. ఐకూ Z11 ల్యాంచ్ డేట్ మీద క్లారిటీ వచ్చేసింది
  3. Samsung Galaxy : ఇక ఏ వస్తువు పోయినా ఈజీగా దొరికేస్తుంది..శాంసంగ్ నుంచి నెక్స్ట్ లెవెల్ ట్రాకర్
  4. Apple : యాపిల్ సేల్స్ సునామీ.. ఏకంగా 10.43 లక్షల కోట్ల ఆదాయంతో సరికొత్త రికార్డు
  5. ITR Filing : ఐటీఆర్ ప్రాసెస్ చాలా సింపుల్.. కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పూర్త్యయ్యేలా ఈజీ స్టెప్స్ ఇవే
  6. FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్
  7. Google Play Store : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
  8. Samsung Galaxy F70 Pro 5G : 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఆగస్టు 3న శాంసంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్
  9. HMD Pulse 2 Series : 5000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతున్న హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 సిరీస్
  10. Oppo K13 Turbo Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 టర్బో ప్రో 5G పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 12,000 కంటే ఎక్కువ ఆదా
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »