గత మే నెలలోనే చైనాలో విడుదలైన ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో అనే రెండు మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి.
Photo Credit: Oppo
OPPO Reno 16
Oppo Reno 16 : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో, భారతీయ మొబైల్ ప్రియుల కోసం సరికొత్త ప్రీమియం ఫోన్లను తీసుకురాబోతోంది. గత కొన్ని రోజులుగా టెక్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారిన ఒప్పో రెనో 16 సిరీస్ భారత లాంచ్ తేదీ ఎట్టకేలకు లీక్ అయింది. ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా షేర్ చేసిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ వచ్చే నెల జులై 2, 2026న అధికారికంగా భారతదేశంలో విడుదల కానుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కళ్లు చెదిరే డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్
గత మే నెలలోనే చైనాలో విడుదలైన ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో అనే రెండు మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో హై-ఎండ్ వేరియంట్ అయిన ప్రో మోడల్‌లో 6.78 ఇంచుల 1.5K రిజల్యూషన్ కలిగిన అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీనితో పాటు స్మూత్ గేమింగ్, స్క్రోలింగ్ అనుభూతి కోసం 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను జోడించారు. భారతీయ వేరియంట్లలో కూడా ఇవే ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
200 మెగాపిక్సెల్ కెమెరాతో నెక్స్ట్ లెవెల్ ఫొటోగ్రఫీ
ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు ఎప్పుడూ కెమెరా పర్ఫార్మెన్స్‌కు చాలా ఫేమస్. ఈ క్రమంలోనే కొత్త రెనో 16 సిరీస్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ మెయిన్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. దీని సహాయంతో కస్టమర్లు అత్యంత స్పష్టమైన, హై-క్వాలిటీ ఫొటోలు, 4K వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నైట్ ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్ ఈ ఫోన్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Samsung : ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే.. శామ్‌సంగ్ నుంచి సరికొత్త విజన్ ఏఐ బిగ్ టీవీ ఆఫర్లు
కొండలాంటి బ్యాటరీ బ్యాకప్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్లలోని మరో బిగ్గెస్ట్ హైలైట్ దీని బ్యాటరీ లైఫ్. ఒప్పో రెనో 16 ప్రో మోడల్‌లో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని అందించగా.. బేస్ మోడల్ ఒప్పో రెనో 16 లో 6,700 mAh బ్యాటరీని అమర్చారు. హెవీగా ఫోన్ వాడే వారికి కూడా ఈ బ్యాటరీ రెండు రోజుల పాటు సులభంగా బ్యాకప్ ఇస్తుంది. దీనికి తోడు ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించడం విశేషం.
చైనా ధరలు, భారత మార్కెట్ అంచనాలు
చైనా మార్కెట్లో విడుదలైన ధరల ప్రకారం.. ఒప్పో రెనో 16 బేస్ మోడల్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర CNY 3,499 (మన కరెన్సీలో సుమారు రూ.49,000) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే హై-ఎండ్ మోడల్ అయిన ఒప్పో రెనో 16 ప్రో (12GB RAM + 256GB స్టోరేజ్) ధర CNY 4,499 (మన కరెన్సీలో సుమారు రూ.63,000) గా ఉంది. భారతదేశంలో పన్నులు ఇతర ఛార్జీల కారణంగా ఈ సిరీస్ ధరలు కొద్దిగా ఎక్కువ లేదా ఈ బడ్జెట్ ఆస్పాస్‌లోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Z Fold 8 Listed on US FCC Database With Snapdragon Chipset