India Launched own AI video Generator Varya AI: అవతార్ ఏఐ అనే సంస్థ వర్య(Varya) పేరుతో ఈ అద్భుతమైన మోడల్‌ను లాంచ్ చేసింది.
Photo Credit: AI Generated
Avataar AI
India Launched own AI video Generator Varya AI : ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తున్న తరుణంలో, భారత్ సైతం ఈ రంగంలో తన ముద్రను గట్టిగా వేస్తోంది. ఇందులో భాగంగానే దేశీయంగా టెక్నాలజీని పెంపొందిస్తూ ఒక భారతీయ స్టార్టప్ సరికొత్త వీడియో జనరేషన్ ఏఐ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అవతార్ ఏఐ అనే సంస్థ వర్య(Varya) పేరుతో ఈ అద్భుతమైన మోడల్‌ను లాంచ్ చేసింది. దీనిని ముఖ్యంగా భారతీయ యూజర్ల అవసరాలు, మన దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలను సులభంగా అర్థం చేసుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దడం విశేషం.
అవతార్ ఏఐ సంస్థ సాధారణ స్టార్టప్ కాదు.. ఇది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ కింద ఎంపిక చేసిన టాప్-12 స్టార్టప్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వర్య ఏఐ మోడల్‌ను చైనా దిగ్గజం అలీబాబా విడుదల చేసిన ఓపెన్-సోర్స్ వీడియో జనరేషన్ మోడల్ Wan 2.2 ఆధారంగా డెవలప్ చేశారు. అయితే, భారతీయ అవసరాలకు తగ్గట్టుగా దీనిని మరింత చిన్నదిగా, వేగవంతమైనదిగా మార్చడానికి మోడల్ డిస్టిలేషన్ అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల కంప్యూటింగ్ అవసరాలు తగ్గినప్పటికీ, మోడల్ సామర్థ్యం మాత్రం అలాగే ఉంటుంది.
ఈ సరికొత్త ఆప్టిమైజేషన్ కారణంగా వర్య మోడల్ చాలా వేగంగా వీడియోలను క్రియేట్ చేయగలదు. సాధారణంగా అలీబాబాకి చెందిన ఒరిజినల్ మోడల్ ఒక వీడియోను తయారు చేయడానికి 50 స్టెప్స్ సమయం తీసుకుంటే.. మన దేశీయ వర్య మోడల్ కేవలం 4 స్టెప్స్ లోనే ఆ పనిని చాలా ఈజీగా పూర్తి చేస్తుంది. దీనివల్ల వీడియో జనరేషన్ స్పీడ్ ఏకంగా 10 రెట్లు పెరుగుతుందని, అదే సమయంలో దీనిని రన్ చేయడానికి అయ్యే ఖర్చు, పవర్ వినియోగం కూడా భారీగా తగ్గుతుందని అవతార్ ఏఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.
కంపెనీ ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ఇచ్చింది. అధునాతన NVIDIA H200 GPU సర్వర్ పై వర్య మోడల్ కేవలం 45 సెకన్ల వ్యవధిలోనే 720p హై-రెజల్యూషన్ కలిగిన 5 సెకన్ల అద్భుతమైన వీడియోను సిద్ధం చేస్తుంది. అదే పనిని ఒరిజినల్ చైనీస్ మోడల్ పూర్తి చేయడానికి దాదాపు 1,230 సెకన్ల (సుమారు 20 నిమిషాలు) సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే డిజిటల్ క్రియేటర్లకు, సినిమా రంగం వారికి ఈ టూల్ సమయాన్ని ఎంతలా ఆదా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
స్పీడ్ తో పాటు ధర పరంగా కూడా వర్య ఏఐ మోడల్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైనదిగా నిలిచింది. ఈ మోడల్ ద్వారా వీడియోలను జనరేట్ చేయడానికి కేవలం సెకనుకు 48 పైసలు మాత్రమే ఖర్చవుతుందని అవతార్ ఏఐ గట్టిగా చెబుతోంది. దీనివల్ల ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఇతర గ్లోబల్ వీడియో ఏఐ టూల్స్ తో పోలిస్తే ఇది చాలా రెట్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారతీయ చిన్న వ్యాపారస్తులకు, క్రియేటర్లకు ఎంతో లాభదాయకంగా మారనుంది.
Oppo : ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పై క్రేజీ ఆఫర్స్
వర్య ఏఐ మోడల్ అన్నింటికంటే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది మన దేశీయ వాతావరణాన్ని, సంస్కృతిని పక్కాగా అర్థం చేసుకోగలదు. విదేశీ ఏఐ టూల్స్ లో భారతీయ అంశాలు సరిగ్గా రావు. కానీ, ఈ మోడల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోకల్ డేటా సెట్స్ తో ట్రైనింగ్ ఇచ్చారు. దీనివల్ల భారతీయ పండుగలు, సాంప్రదాయ దుస్తులు (చీరలు, కుర్తాలు), స్థానిక వంటకాలు (బిర్యానీ, దోసెలు), మన దేశ శిల్పకళ, కట్టడాలను ఇది చాలా స్పష్టంగా గుర్తించి నాచురల్ విజువల్స్ అందిస్తుంది. దీని వాడకం కూడా చాలా సులభం.. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ రాయడం ద్వారా లేదా ఒక ఫోటో అప్‌లోడ్ చేయడం ద్వారా ఎవరైనా చిటికెలో వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Realme 16 Pro 5G Harry Potter Edition Launched in India: Price, Specifications
OnePlus 16 Design, Colours and Storage Variants Revealed as Phone Goes Up for Pre-Order in China
Apple’s First Smart Home Display Could Launch Next Month: Here's What You Need to Know