Apple Rolls Out iOS 27: ఐఫోన్ యూజర్లకు పండగే.. సరికొత్త iOS 27 పబ్లిక్ బీటా విడుదల చేసిన యాపిల్

Apple Rolls Out iOS 27 with Next-Gen Siri AI: ఈ కొత్త iOS 27 అనేది ప్రధానంగా ఐఫోన్ వేగాన్ని, పర్ఫార్మెన్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టింది.

Apple Rolls Out iOS 27: ఐఫోన్ యూజర్లకు పండగే.. సరికొత్త iOS 27 పబ్లిక్ బీటా విడుదల చేసిన యాపిల్

iOS 27

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ యూజర్లకు పండగే
  • సరికొత్త iOS 27 పబ్లిక్ బీటా విడుదల చేసిన యాపిల్
  • ఇప్పుడు ఎవరైనా సరే కొత్త ఐఓఎస్ ఫీచర్లు వాడేయొచ్చు
ప్రకటన

Apple Rolls Out iOS 27 with Next-Gen Siri AI: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27 పబ్లిక్ బీటా వర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. గ్లోబల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ WWDC 2026లో ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను యాపిల్ మొదటిసారిగా పరిచయం చేసింది. ఇప్పుడు దీనిని సాధారణ వినియోగదారులందరూ ఉచితంగా టెస్ట్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా డెవలపర్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే లభించే ఈ ఫీచర్లను, ఇప్పుడు ఎలాంటి డెవలపర్ ఐడీ లేకుండానే నార్మల్ ఐఫోన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. రాబోయే ఐఫోన్ 18 సిరీస్ మొబైళ్లతో పాటు ఈ సాఫ్ట్‌వేర్ పూర్తి స్థాయి స్టేబుల్ వర్షన్ సెప్టెంబర్ నెలలో అధికారికంగా విడుదల కానుంది.

యాపిల్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త iOS 27 అనేది ప్రధానంగా ఐఫోన్ వేగాన్ని, పర్ఫార్మెన్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఐఫోన్‌లోని వివిధ యాప్‌లు 30 శాతం వేగంగా ఓపెన్ అవుతాయి. అలాగే ఫోటోలు క్లిక్ చేసిన వెంటనే గ్యాలరీలో లోడ్ అయ్యే స్పీడ్ ఏకంగా 70 శాతం వరకు పెరుగుతుంది. యాపిల్ వినియోగదారులు ఎక్కువగా వాడే ఫైల్ షేరింగ్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్ వేగాన్ని కూడా ఈ అప్‌డేట్‌లో ఏకంగా 80 శాతం వరకు పెంచారు. దీంతో పెద్ద ఫైళ్లను కూడా క్షణాల వ్యవధిలో వేరే యాపిల్ డివైజ్‌లకు పంపించుకోవచ్చు.

ఈ సరికొత్త అప్‌డేట్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నెక్స్ట్-జెన్ ఏఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి మరింత తెలివిగా మారబోతోంది. ఇది మీ వ్యక్తిగత మెసేజ్‌లలోని వివరాలను వెతకగలదు, మీ ఈమెయిల్స్ చదివి అందులోని సారాంశాన్ని చెప్పగలదు, అంతేకాకుండా గ్యాలరీలోని ఫోటోలను కూడా సులభంగా శోధించగలదు. ఇందుకోసం యాపిల్ ప్రత్యేకంగా ఒక కొత్త సిరి యాప్‎ను కూడా ప్రవేశపెట్టింది. దీనిలోని మీ సంభాషణల హిస్టరీ ఐక్లౌడ్ ద్వారా మీ అన్ని యాపిల్ డివైజ్‌లలో ఆటోమేటిక్‌గా సింక్ అవుతుంది. దీనితో పాటు పేరంటల్ కంట్రోల్స్, స్క్రీన్ టైమ్ ఫీచర్లు, హెల్త్ యాప్‌లో కూడా కీలక మార్పులు చేశారు.

ఈ సరికొత్త iOS 27 పబ్లిక్ బీటా ఫీచర్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, దీనిని మీ మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని యాపిల్ గట్టిగా హెచ్చరిస్తోంది. ఇది కేవలం టెస్టింగ్ కోసం విడుదల చేసిన బీటా వర్షన్ మాత్రమే కాబట్టి, ఇందులో కొన్ని బగ్‌లు, పనితీరుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన యాప్‌లు సరిగ్గా ఓపెన్ కాకపోవడం లేదా ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోవడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే, మీ రోజువారీ పనులకు ఉపయోగించే ముఖ్యమైన ఐఫోన్‎లో దీనిని ఇన్‌స్టాల్ చేయవద్దని కంపెనీ సలహా ఇస్తోంది. అలాగే అప్‌డేట్ చేసే ముందు మీ ఫోన్ డేటాను ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌లో బ్యాకప్ తీసుకోవడం మర్చిపోకండి.

Xiaomi : ఒక్కో ఫోటో ప్రింట్‌కు రూపాయిన్నర ఖర్చు మాత్రమే.. మార్కెట్లోని షావోమీ కొత్త ప్రింటర్

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్  

మీ దగ్గర అదనంగా ఉన్న ఐఫోన్‌లో లేదా సమస్యలు వచ్చినా పర్వాలేదు అనుకుంటే, ఈ కింది సింపుల్ స్టెప్స్ ఫాలో అయి iOS 27 పబ్లిక్ బీటాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
* స్టెప్ 1: మొదటగా మీ ఐఫోన్‌లోని సఫారీ బ్రౌజర్ ద్వారా Apple Beta Software Program అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
* స్టెప్ 2: అక్కడ మీ యాపిల్ ఐడీని ఉపయోగించి లాగిన్ అయి, బీటా ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అవ్వండి.
* స్టెప్ 3: ఇప్పుడు మీ ఐఫోన్‌లోని Settings > General > Software Update ఆప్షన్‌కు వెళ్లండి.
* స్టెప్ 4: అక్కడ కొత్తగా కనిపించే Beta Updates ఆప్షన్‌ను క్లిక్ చేసి, అందులో iOS 27 Public Betaని ఎంచుకోండి.
* స్టెప్ 5: ఇప్పుడు స్క్రీన్ పై కనిపించే డౌన్‌లోడ్ బటన్ నొక్కి, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »