Xiaomi Mijia Desktop photo printer 2: పాత మోడళ్లతో పోలిస్తే సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ప్రింటింగ్ టెక్నాలజీ, మెరుగైన కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ గ్యాడ్జెట్ యూజర్లకు ల్యాబ్ క్వాలిటీ ఫోటో ప్రింటింగ్ అనుభూతిని అందిస్తుంది.
Photo Credit: Xiaomi
Xiaomi Mijia Desktop Photo Printer 2: గ్లోబల్ టెక్ దిగ్గజం షావోమి తన సరికొత్త స్మార్ట్ హోమ్ ప్రొడక్ట్ లైనప్‌లో భాగంగా మిజియా డెస్క్‌టాప్ ఫోటో ప్రింటర్ 2ను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కొత్త డివైజ్‌ను కంపెనీ చైనాలోని తన ప్రసిద్ధ యూపిన్ ప్లాట్‌ఫారమ్‌లో క్రౌడ్‌ఫండింగ్ ద్వారా కొనుగోలుదారులకు పరిచయం చేసింది. పాత మోడళ్లతో పోలిస్తే సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ప్రింటింగ్ టెక్నాలజీ, మెరుగైన కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ గ్యాడ్జెట్ యూజర్లకు ల్యాబ్ క్వాలిటీ ఫోటో ప్రింటింగ్ అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లతో నిత్యం ఫోటోలు తీసుకునే వారికి ఇంట్లోనే ప్రొఫెషనల్ ఫోటోలు ప్రింట్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ సరికొత్త మిజియా డెస్క్‌టాప్ ఫోటో ప్రింటర్ 2 లో చేసిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఇందులో 4-కలర్ (CMYK) డై-సబ్లిమేషన్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. గతంలో వచ్చిన వన్ ఎస్ మోడల్ కంటే ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా బ్లాక్ కలర్ లేయర్‌ను జత చేయడం వల్ల ఫోటోలలోని నలుపు రంగు మరింత గాఢంగా, గ్రేడియంట్స్ ఎంతో స్మూత్‌గా కనిపిస్తాయి. దీనివల్ల ఫోటో అవుట్‌పుట్ అత్యంత సహజమైన రంగులతో ప్రొఫెషనల్ క్వాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఫోటో ప్రింటర్ 300×300dpi రిజల్యూషన్ క్వాలిటీతో పాటు 4 ఇంచులు, 6 ఇంచుల ఫోటో పేపర్ సైజులను సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ ప్రింటర్‌లో వై-ఫైకి బదులుగా సరికొత్త బ్లూటూత్ 5.2 టెక్నాలజీని అందించారు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌లను ప్రింటర్‌తో పేరింగ్ చేయడం మునుపటి కంటే చాలా వేగంగా, స్థిరంగా జరుగుతుంది. ఈ ప్రింటర్ ఒకేసారి గరిష్టంగా మూడు విభిన్న డివైజ్‌లతో కనెక్ట్ అయ్యే సదుపాయాన్ని కలిగి ఉంది. అలాగే ఇది గ్లోబల్ ఇమేజ్ ఫార్మాట్లు అయిన JPG, PNG తో పాటు ఐఫోన్‌లలో వాడే HEIC ఫైల్ ఫార్మాట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రింటింగ్ స్పీడ్ విషయానికి వస్తే, ఫోటో క్వాలిటీ సెట్టింగ్స్ ఆధారంగా ఒక్కో ఫోటో కేవలం 53 నుంచి 85 సెకన్ల వ్యవధిలోనే ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది.
ధరల విషయానికి వస్తే.. క్రౌడ్‌ఫండింగ్ వ్యవధిలో మిజియా డెస్క్‌టాప్ ఫోటో ప్రింటర్ 2 ధరను 699 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.9,900)గా నిర్ణయించారు. ఈ ఆఫర్ పూర్తయిన తర్వాత దీని సాధారణ మార్కెట్ ధర 799 యువాన్లు (దాదాపు రూ.11,300) గా ఉండనుంది. ఈ ప్రింటర్‌తో ఉపయోగించే 4 ఇంచులు, 6 ఇంచుల ఫోటో పేపర్‌తో కూడిన కన్జూమబుల్ ప్యాక్ ధర 69.2 యువాన్లుగా ఉంది. షావోమి లెక్కల ప్రకారం, చిన్న సైజు ఫోటో పేపర్ మీద ఒక్కో ప్రింట్ వేయడానికి సుమారు 0.99 యువాన్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.40 పైసలు) మాత్రమే ఖర్చవుతుంది.
Oppo Find X10 : ఏకంగా 200ఎంపీతో మూడు వెనుక కెమెరాలు.. ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ లీకైన క్రేజీ ఫీచర్లు
ఈ స్మార్ట్ ప్రింటర్ కేవలం ఫోటోలను ప్రింట్ చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో LUT కలర్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ద్వారా మనకు నచ్చినట్లు కలర్స్ మార్చుకోవచ్చు. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ లేదా స్టాంప్ సైజ్ ఫోటోల కోసం ఆటోమేటిక్ ఐడీ ఫోటో జనరేషన్ ఫీచర్ కూడా ఉంది. వీటితో పాటు ఏఆర్ డైనమిక్ ఫోటోస్ వంటి క్రేజీ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫోటోలు ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి, రంగులు వెలిసిపోకుండా రక్షించడానికి ప్రత్యేక ల్యామినేషన్ ఫిల్మ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని సైజ్ కేవలం 199×126.6×85.7mm మాత్రమే ఉండటం వల్ల మీ ఆఫీస్ టేబుల్ లేదా స్టడీ డెస్క్ మీద చాలా తక్కువ స్థలంలోనే దీనిని అమర్చుకోవచ్చు. అయితే ఈ ప్రింటర్ గ్లోబల్ లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999