iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్

వచ్చే ఏడాది నాటికి ఫోల్డబుల్ మార్కెట్‌లో యాపిల్, శామ్‌సంగ్, హువాయ్ సంస్థలు మూడూ కలిసి ఏకంగా 80 శాతం వాటాను ఆక్రమించే అవకాశం ఉంది.

iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్

iPhone Ultra

ముఖ్యాంశాలు
  • శామ్‌సంగ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న యాపిల్
  • కోటి ఫోల్డబుల్ ఐఫోన్లతో యాపిల్ ధ్వజమెత్తడం ఖాయం
  • ప్రపంచాన్ని మైమరిపించే 3D టెక్నాలజీ, 2nm చిప్‌సెట్
ప్రకటన

iPhone Ultra : ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ త్వరలోనే తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం..  ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు ఐఫోన్ ఆల్ట్రా అని పేరు పెట్టే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా గ్లోబల్ మార్కెట్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ అత్యధిక మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యాపిల్ రాకతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.  

రాబోయే రోజుల్లో ఫోల్డబుల్ మార్కెట్ వృద్ధి  
స్మార్ట్ అనలిటిక్స్ గ్లోబల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక కొత్త శకం త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుత సంవత్సరంలో ఈ కేటగిరీ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 30 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఊహించని వృద్ధికి యాపిల్ తీసుకొస్తున్న ఐఫోన్ ఆల్ట్రాతో పాటు, ఇటీవలే శామ్‌సంగ్ లాంచ్ చేసిన కొత్త ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ప్రధాన కారణం కానున్నాయి.  

మార్కెట్ వాటాలో పోటీపడుతున్న దిగ్గజాలు  
ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో శామ్‌సంగ్ దాదాపు 28 శాతం వాటాతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే శామ్‌సంగ్ సంస్థ గ్లోబల్ మార్కెట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. వీటి అమ్మకాలు మార్కెట్‌లో భారీగా జరుగుతున్నాయి. ఇక చైనాకు చెందిన హువాయ్ సంస్థ 27 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. అయితే యాపిల్ ఐఫోన్ ఆల్ట్రా విడుదలయ్యాక దానికి లభించే ఆదరణ ఆధారంగా యాపిల్ విక్రయాలు రాకెట్ వేగంతో పుంజుకుంటాయని భావిస్తున్నారు.  

Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం

ఒక్కోక్కటిగా బయటపడుతున్న ఐఫోన్ ఆల్ట్రా ఫీచర్లు  
వచ్చే ఏడాది నాటికి ఫోల్డబుల్ మార్కెట్‌లో యాపిల్, శామ్‌సంగ్, హువాయ్ సంస్థలు మూడూ కలిసి ఏకంగా 80 శాతం వాటాను ఆక్రమించే అవకాశం ఉంది. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోవడానికి యాపిల్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ తయారీ లక్ష్యాన్ని ఏకంగా కోటి యూనిట్లకు పెంచే ఆలోచనలో ఉంది. గతంలో ఈ అంచనా 80 లక్షల యూనిట్లుగా మాత్రమే ఉండేది. సాంకేతిక వివరాల్లోకి వెళితే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో అత్యంత వేగవంతమైన 2nm ప్రాసెసర్‌పై తయారైన లేటెస్ట్ చిప్‌సెట్‌ను వాడనున్నారు.  

డిస్‌ప్లే టెక్నాలజీ, డిజైన్ ప్రత్యేకతలు
ఐఫోన్ ఆల్ట్రా మోడల్ డిస్‌ప్లే పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో 7.58 అంగుళాల పెద్ద ఇన్నర్ స్క్రీన్, 5.25 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే ఉండనున్నాయి. స్క్రీన్ మన్నిక కోసం డ్యూయల్-లేయర్ UTG, UFG గ్లాస్ డిజైన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్‌ను పూర్తిగా అన్‌ఫోల్డ్ చేసినప్పుడు దీని యూజర్ ఇంటర్‌ఫేస్ ఒక ఐప్యాడ్ వాడినట్లే అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా స్క్రీన్‌పై  క్రీజ్ కనిపించకుండా తగ్గించడానికి దీని హింజ్ డిజైన్ కోసం అత్యాధునిక 3D ప్రింటెడ్ టెక్నాలజీని వాడుతున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Vivo X300e : ఫోటోగ్రఫీ లవర్లకు పూనకాలే.. కెమెరా సెన్సార్లతో మార్కెట్‌ను ఊపేస్తున్న వివో నయా ఫోన్
  2. iPhone Ultra : అన్‌ఫోల్డ్ చేస్తే ఐప్యాడ్.. ఫోల్డ్ చేస్తే ఐఫోన్.. యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  3. Lenovo Legion 27-1r : లెనోవో నుంచి అదిరిపోయే గేమింగ్ మానిటర్.. గేమర్స్ ఇక తిండి తిప్పలు మానడం ఖాయం
  4. Redmi 17 4G : మార్కెట్‌లోకి రెడ్‌మీ 17 4జి.. లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్లు
  5. Ugreen 100W Mini Ice GaN Charger : క్రెడిట్ కార్డ్ సైజులో 100W సూపర్ ఛార్జర్.. చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
  6. Crypto : దేశంలో క్రిప్టో కరెన్సీపై మళ్లీ మొదలైన చర్చ.. నిబంధనలు లేవు కానీ.. టాక్స్ రూల్స్ మాత్రం పక్కా
  7. iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
  8. xMEMS Labs Microfan : స్మార్ట్ టెక్నాలజీ చరిత్రలోనే అద్భుత విప్లవం.. చేతి గోరు సైజులో మైక్రో ఫ్యాన్ ఆవిష్కరణ
  9. Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
  10. Stuffcool Omni Pro Powerbank : జేబులో పట్టేంత సైజ్.. పర్ఫామెన్సులో మాత్రం పవర్‌హౌస్.. మార్కెట్లోకి కొత్త పవర్ బ్యాంక్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »