Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఈ ఏఐ-ఆధారిత స్టెయిన్ డిటెక్షన్ సిస్టమ్‎ను పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు.

Indian Railways : బెడ్‌షీట్‌పై చిన్న మచ్చ ఉన్నా ఇక ఏఐ పట్టేస్తుంది.. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

Photo Credit: Pexels/ 天 明

Indian Railways

ముఖ్యాంశాలు
  • రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • బెడ్‌షీట్ల పరిశుభ్రత కోసం 'AI' టెక్నాలజీ
  • కంటికి కనిపించని మచ్చలైనా పసిగట్టేస్తుంది!
ప్రకటన

Indian Railways : రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన, పరిశుభ్రమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు భారతీయ రైల్వేస్ సరికొత్త అడుగు వేసింది. ఏసీ ప్రయాణికులకు అందించే బెడ్‌షీట్లు, దిండు కవర్ల పరిశుభ్రతను తనిఖీ చేసేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. రైల్వేస్ ఎంపిక చేసిన కొన్ని డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని కింద ఏర్పాటు చేసిన AI కెమెరాలు, ఉతికిన తర్వాత బెడ్‌షీట్లపై ఏమైనా మరకలు లేదా మచ్చలు మిగిలి ఉన్నాయా అనేది ఆటోమేటిక్ గా పసిగడతాయి. ప్రయాణికులకు ఎల్లప్పుడూ అత్యంత శుభ్రమైన, క్వాలిటీ లిగెన్‌ను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

రాజ్యసభలో స్పష్టం చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ప్రస్తుతానికి ఈ ఏఐ-ఆధారిత స్టెయిన్ డిటెక్షన్ సిస్టమ్‎ను పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ రైల్వేకు చెందిన పూణే డివిజన్, అలాగే నార్త్ వెస్ట్రన్ రైల్వేకు చెందిన జైపూర్, జోధ్‌పూర్ డివిజన్లలోని మెకనైజ్డ్ లాండ్రీలలో ఈ సిస్టమ్‌ను అమర్చారు. ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సహాయంతో ఉతికిన తర్వాత చాదర్ల నాణ్యతను నిశితంగా పరిశీలిస్తారు. దీంతో పాటు లాండ్రీలలో జరిగే ఉతుకుడు ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చారు. అలాగే శుభ్రత నాణ్యతను కొలిచేందుకు మునుపటి నుంచే ఉపయోగిస్తున్న వైటో-మీటర్ పరికరాల వాడకం కూడా కొనసాగుతుంది.

Stuffcool Omni Pro Powerbank : జేబులో పట్టేంత సైజ్.. పర్ఫామెన్సులో మాత్రం పవర్‌హౌస్.. మార్కెట్లోకి కొత్త పవర్ బ్యాంక్

ఏసీ కోచ్ ప్రయాణికులకు లభించే బెడ్‌రోల్ కిట్ వివరాలు
రైల్వే నిబంధనల ప్రకారం.. ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి ఒక బెడ్‌రోల్ ప్యాక్ లభిస్తుంది. ఇందులో రెండు బెడ్‌షీట్లు, ఒక దిండు కవర్,  ఒక హ్యాండ్ టవల్ ఉంటాయి. ఈ రెండు బెడ్‌షీట్లలో ఒకదానిని బెర్త్‌పై పరుచుకోవడానికి, మరొక దానిని బ్లాంకెట్ శరీరానికి నేరుగా తగలకుండా మధ్యలో కప్పుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ కవర్ షీట్‌ను ప్రతి ప్రయాణం తర్వాత తప్పనిసరిగా ఉతుకుతారు. ఇక ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు, నార్త్ వెస్ట్రన్ రైల్వే రైళ్లతో పాటు కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్ రైలులో అన్ని ఏసీ ప్రయాణికులకు ప్రత్యేక బ్లాంకెట్ కవర్లు కూడా ఇస్తున్నారు. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది.

పాతబడిన, ఖరాబైన వాటి తొలగింపు నిబంధనలు
రైల్వే లాండ్రీ వ్యవస్థలో ప్రతి బెడ్‌షీట్, దిండు కవర్, ఇతర మెటీరియల్‌కు నిర్దిష్ట వినియోగ కాలపరిమితి ఉంటుంది. రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ఈ లిగెన్ పరిస్థితిని నిశితంగా తనిఖీ చేస్తుంటారు. నిర్దేశిత కాలపరిమితి ముగిసినా లేదా ఉపయోగించడానికి వీలు లేకుండా పాడైపోయినా, వాటి స్థానంలో నిబంధనల ప్రకారం కొత్త లిగెన్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు ఈ నాణ్యతా ప్రమాణాలను రైల్వే శాఖ మరింత కఠినతరం చేస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »