క్రిప్టో ఎక్స్ఛేంజీలు, ఇతర మధ్యవర్తులు పన్ను చట్టాల ప్రకారం లావాదేవీల వివరాలను తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Crypto
Crypto : గత కొన్నేళ్లుగా మన దేశంలో క్రిప్టో కరెన్సీల మార్కెట్ చాలా వేగంగా పెరిగింది. వేలాది మంది పెట్టుబడిదారులు ఇందులో డబ్బులు పెడుతున్నారు. అయితే, ఈ డిజిటల్ కరెన్సీలపై సరైన చట్టాలు, నిబంధనలు మాత్రం ఇంకా స్పష్టంగా లేవు. ఒకవైపు పెట్టుబడులు పెరుగుతుంటే, మరోవైపు దీనికి సంబంధించిన నిబంధనలపై అయోమయం కొనసాగుతూనే ఉంది.
CBDT సరికొత్త గైడ్‌లైన్స్
ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కీలక నిర్ణయం తీసుకుంది. క్రిప్టో ఎక్స్ఛేంజీలు, ఇతర మధ్యవర్తులు పన్ను చట్టాల ప్రకారం లావాదేవీల వివరాలను తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని CBDT స్పష్టం చేసింది. డిజిటల్ రూపంలో ఉన్న ల్యావాదేవీలను సురక్షితంగా రికార్డ్ చేసే క్రిప్టోగ్రాఫికల్లీ సెక్యూర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని ఉపయోగించే ఏ డిజిటల్ వ్యాల్యూనైనా క్రిప్టో-అసెట్‌గా CBDT నిర్వచించింది.
అంతర్జాతీయ వ్యవస్థతో జోడీ
పన్ను వివరాల సేకరణను మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సంస్థ అయిన OECD (Organization for Economic Co-operation and Development) రూపొందించిన క్రిప్టో-అసెట్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా భారతదేశం ఈ మార్గదర్శకాలతో కలిపి అమలు చేస్తోంది. ఈ సిస్టమ్ ద్వారా వివిధ దేశాల మధ్య క్రిప్టో లావాదేవీలకు సంబంధించిన పన్ను సమాచారం ఆటోమేటిక్‌గా మార్పిడి అవుతుంది. జి-20 కూటమి కూడా దీనికి గ్లోబల్ స్టాండర్డ్‌గా గుర్తింపు ఇచ్చింది.
iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G vs Moto G77 Power: మీ బడ్జెట్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
క్రిప్టో అనేది ఆస్తి కాదన్న ప్రభుత్వం
మరోవైపు, క్రిప్టో రంగాన్ని ప్రత్యేకంగా రెగ్యులేట్ చేసే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్పష్టం చేసింది. భారతదేశంలో క్రిప్టో కరెన్సీకి ఒక ఆస్తి హోదా లేదా చట్టబద్ధత ఇవ్వలేదని, అలాంటప్పుడు దానిపై ప్రత్యేక నిబంధనలు తెచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పింది. కాగా, క్రిప్టో వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాలు ఉన్నాయని, దానిపై పూర్తిగా నిషేధం విధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే అభిప్రాయపడింది.
ఫేక్ న్యూస్‌పై PIB క్లారిటీ.. ఆ ప్రచారంలో నిజం లేదు
సోషల్ మీడియాలో క్రిప్టో రెగ్యులేషన్‌పై వస్తున్న వార్తలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. క్రిప్టోను రెగ్యులేట్ చేసేందుకు RBI, SEBIలతో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని PIB స్పష్టం చేసింది. భారత చట్టాల ప్రకారం క్రిప్టోకు అసెట్ హోదా లేదని, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి అలాంటి ఆదేశాలేవీ వెళ్లలేదని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా PIB క్లారిటీ ఇచ్చింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999