Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్

ఐఫోన్ 17 మోడల్ అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించబడింది.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్

Photo Credit: Apple

iPhone 17

ముఖ్యాంశాలు
  • ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్ 17 పై భారీ ఆఫర్లు!
  • ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17 కొనుగోలుకు పోటెత్తుతున్న జనాలు
  • ఐఫోన్ 17 కొనుగోలుపై వేలల్లో ఆదా!
ప్రకటన

Flipkart Freedom Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరి కోసం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026ను ప్రారంభించింది. ఈ సేల్‌లో యాపిల్ లవర్స్‎కు అత్యంత ఇష్టమైన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ యాపిల్ ఐఫోన్ 17 పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన, లాభదాయకమైన అవకాశంగా నిలవనుంది.

ధర తగ్గింపు, ఆకర్షణీయ బ్యాంక్ ఆఫర్లు 
ఐఫోన్ 17 మోడల్‌లోని 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 81,900 వద్ద లిస్ట్ అయింది. ఈ ఫోన్ గత సెప్టెంబర్ 2026లో రూ. 82,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అంటే లాంచ్ ధర కంటే నేరుగా రూ. 1,000 తగ్గింపు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత లేదా నిరుపయోగంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 60,800 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ మీరు ఇచ్చే పాత డివైజ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్, కనెక్టివిటీ ఫీచర్లు 
ఐఫోన్ 17 మోడల్ అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులో 6.3-ఇంచుల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే అమర్చబడింది. ఇది 2622x1206 పిక్సెల్స్ రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ పర్ఫామెన్స్ కోసం ఆపిల్ సొంత 'A19' పవర్ఫుల్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కోసం లేటెస్ట్ iOS 26పై నడుస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, 5జీ, వై-ఫై 7, ఈ-సిమ్ సపోర్ట్, బ్లూటూత్ 6, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు కలవు.

Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

కెమెరా, సైజ్ స్పెసిఫికేషన్లు 
ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ఐఫోన్ 17 లో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించారు. దీని వెనుక భాగంలో f/1.78 అపర్చర్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా,  f/2.2 అపర్చర్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సరికొత్తగా f/1.9 అపర్చర్‌తో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ కొలతల విషయానికొస్తే 71.5 మిమీ వెడల్పు, 149.6 మిమీ ఎత్తు, 7.95 మిమీ మందం కలిగి ఉండి, కేవలం 177 గ్రాముల తేలికపాటి బరువుతో హ్యాండీగా ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »