ఇక్కడ మీ ఐటీఆర్ ప్రాసెస్ అయిందా లేదా, ఈ-వెరిఫికేషన్ పూర్తయిందా లేదా అనే వివరాలతో పాటు టాక్స్ రీఫండ్ స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది.
ITR Refund
ITR Refund: మీరు ఇప్పటికే మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేసి, రావలసిన పన్ను రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఆ వివరాలు తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖ తన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా మీ ఐటీఆర్ ప్రాసెస్ అయిందా లేదా, రీఫండ్ విడుదలైందా లేదా ఇంకా పెండింగ్‌లో ఉందా అనే విషయాన్ని కేవలం కొద్ది నిమిషాల్లోనే సులభంగా తెలుసుకోవచ్చు.
ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసే క్రమబద్ధమైన విధానం:
* ముందుగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in లోకి వెళ్లండి.
* హోమ్‌పేజీలో కుడివైపున ఉన్న Login ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ వివరాలు (PAN లేదా User ID) నమోదు చేసి ప్యాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వండి. (అకౌంట్ లేకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి).
* లాగిన్ అయిన తర్వాత పైన కనిపించే e-File సెక్షన్‌కి వెళ్లండి. అందులో Income Tax Returns ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఆ తర్వాత View Filed Returns ఆప్షన్‌ను ఎంచుకోండి.
* ఇప్పుడు మీరు ఫైల్ చేసిన ఐటీఆర్‌ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఇక్కడ మీ ఐటీఆర్ ప్రాసెస్ అయిందా లేదా, ఈ-వెరిఫికేషన్ పూర్తయిందా లేదా అనే వివరాలతో పాటు టాక్స్ రీఫండ్ స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే ఇక్కడి నుంచే అక్నాలెడ్జ్‌మెంట్ ఫారమ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రీఫండ్ ఆలస్యం కావడానికి గల ప్రధాన కారణాలు
ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా నిర్ణీత సమయంలో మీ టాక్స్ రీఫండ్ రాకపోతే, ముందుగా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లోని నోటిఫికేషన్లను తనిఖీ చేయండి. కొన్నిసార్లు డాక్యుమెంట్లు, బ్యాంక్ వివరాలు లేదా ఇతర సమాచారంలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే పన్ను శాఖ నోటీసులు పంపుతుంది. దీనివల్ల రీఫండ్ ప్రాసెసింగ్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది.
TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
భవిష్యత్తులో ఆలస్యం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రీఫండ్ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో బ్యాంక్ ఖాతా సంఖ్య మరియు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతా ముందే ప్రీ-వాలిడేట్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలి. దీనికి తోడు మీ గుర్తింపు కార్డులు బ్యాంక్‌తో సరిగ్గా లింక్ అయి ఉండటం, అలాగే ఐటీఆర్ సమర్పించిన వెంటనే సమయానికి ఈ-వెరిఫై పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే రీఫండ్ సొమ్ము త్వరితగతిన మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
HMD Pro India Confirmed to Launch in India Soon; Flipkart Availability Confirmed