iPhone 18 : ఐఫోన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. ఐఫోన్ 18 సిరీస్ ధరల పెంపుపై ఊరటనిచ్చే వార్త

టిమ్ కుక్ వ్యాఖ్యలతో ఐఫోన్ 18 ప్రో మోడల్స్ మునుపటి కంటే భారీ ధరలతో మార్కెట్లోకి వస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పత్రికలు అంచనా వేశాయి.

iPhone 18 : ఐఫోన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. ఐఫోన్ 18 సిరీస్ ధరల పెంపుపై ఊరటనిచ్చే వార్త

Photo Credit: iPhone 18

iPhone 18

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ ప్రియులకు బిగ్ రిలీఫ్
  • ఐఫోన్ 18 ప్రో రేట్లు ఊహించినంతగా పెరగకపోవచ్చు
  • రూ. 19 వేలు పెరగాల్సింది పోయి కేవలం రూ. 4,800 మాత్రమే
ప్రకటన

iPhone 18 : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఒక ప్రముఖ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఐఫోన్లు, ఇతర ఆపిల్ డివైజ్‌ల ధరల పెంపును నివారించడం అసాధ్యమని స్పష్టం చేశారు. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల తయారీకి అవసరమయ్యే డీరామ్ (DRAM), నంద్ (NAND) వంటి మెమొరీ, స్టోరేజ్ భాగాల కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఇకపై ఈ పెరిగిన అదనపు భారాన్ని భరించలేదని, కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మోడళ్ల ధరలు పెరగక తప్పదని ఆయన హింట్ ఇచ్చారు.

టిమ్ కుక్ వ్యాఖ్యలతో ఐఫోన్ 18 ప్రో మోడల్స్ మునుపటి కంటే భారీ ధరలతో మార్కెట్లోకి వస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పత్రికలు అంచనా వేశాయి. పాత మోడల్ తో పోలిస్తే దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.19,000) ప్రీమియం ధర పెరిగే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా జేపీ మోర్గాన్ విశ్లేషకుల నివేదిక ఆధారంగా క్రియేటివ్ స్ట్రాటజీస్ ప్రతినిధి మాక్స్ వీన్‌బాచ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఐఫోన్ 17 సిరీస్, రాబోయే ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ ధరల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండబోతుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

తాజా అంచనాల ప్రకారం.. ఆపిల్ సంస్థ ఐఫోన్ 18 సిరీస్ ధరలను కేవలం 50 డాలర్లు (సుమారు రూ.4,800) మాత్రమే పెంచే అవకాశం ఉంది. మెమొరీ చిప్స్ ధరలు పెరిగినప్పటికీ, ఆపిల్ ఒక స్మార్ట్ వ్యూహంతో ఈ తయారీ ఖర్చును కంట్రోల్ చేయబోతోంది. ఇప్పటివరకు ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో వాడిన క్వాల్‌కామ్   మోడెమ్స్‌కు బదులుగా.. ఐఫోన్ 18 లైనప్‌లో ఆపిల్ తన సొంత ఆపిల్ సి-సిరీస్ ప్రొప్రైటరీ మోడెమ్స్‌ను ఉపయోగించనుంది. దీనివల్ల థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, భారీగా ఖర్చు కలిసిరానుంది.

కస్టమర్ల అవగాహన కోసం చూస్తే.. గత ఏడాది సెప్టెంబర్ 2025 లో భారత మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ.1,34,900 గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రారంభ ధర రూ.1,49,900 వద్ద లాంచ్ అయింది. ఒకవేళ గతంలో అంచనా వేసినట్లు 200 డాలర్ల ధర పెరిగితే.. ఐఫోన్ 18 ప్రో గ్లోబల్ ధర 1,299 డాలర్లకు (సుమారు రూ. 1,23,000 కి పైగా) చేరి, ఇండియాలో ఐఫోన్ రేట్లు ఆకాశాన్ని తాకేవి. కానీ ఇప్పుడు కేవలం 50 డాలర్ల పెంపుతోనే సరిపెట్టనుండటంతో ఐఫోన్ లవర్స్ హ్యాపీగా ఉన్నారు.

Samsung Galaxy A27 5G : భారత మార్కెట్లోకి శామ్‌సంగ్ కొత్త 5G ఫోన్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు

నివేదికల ప్రకారం.. ఒక ఐఫోన్ 18 ప్రో ఫోన్‌ను తయారు చేయడానికి ఆపిల్ కంపెనీకి అయ్యే ఖర్చు 726 డాలర్లకు (సుమారు రూ.68,000) పెరగనుంది. గతంలో ఐఫోన్ 17 ప్రో తయారీకి కంపెనీకి 582 డాలర్లు (సుమారు రూ.55,000) మాత్రమే ఖర్చయ్యేది. ఈ పెరిగిన వ్యయంలో ఎక్కువ భాగం కేవలం మెమొరీ, స్టోరేజ్ కాంపోనెంట్స్ వల్లనే జరిగింది. అయితే, ప్రతి ఫోన్ పై ఆపిల్ ఆశించే ప్రాఫిట్ మార్జిన్ లో ఎలాంటి మార్పులు చేయకుండా.. కేవలం అంతర్గత విడిభాగాల మార్పుల ద్వారానే ఈ ధరలను కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని కంపెనీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 సిరీస్ లో పెద్ద కెమెరా మాడ్యూల్ రానుండటం కూడా ఈ ఖర్చు పెంపునకు ఒక కారణం కావచ్చు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Hydrogen Train : ప్రపంచంలోనే మొదటిసారి.. పట్టాలెక్కబోతున్న సరికొత్త హైడ్రోజన్ రైలు
  2. vivo y05e : భారత మార్కెట్లోకి వివో సరికొత్త బడ్జెట్ ఫోన్.. వివో Y05e లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
  3. Lava Smart 4 Plus : భారత మార్కెట్లోకి లావా కొత్త బడ్జెట్ ఫోన్.. రూ.10 వేల లోపే లావా స్మార్ట్ 4 ప్లస్ లాంచ్
  4. Oppo Reno 16 : భారత మార్కెట్లోకి ఒప్పో సరికొత్త సంచలనం.. జూలై 2న ఒప్పో రెనో 16 సిరీస్ గ్రాండ్ లాంచ్
  5. Apple : యాపిల్ లవర్స్‌కు భారీ షాక్.. ఇండియాలో మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌ల ధరలు విపరీతంగా పెంపు
  6. iPhone 18 : ఐఫోన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. ఐఫోన్ 18 సిరీస్ ధరల పెంపుపై ఊరటనిచ్చే వార్త
  7. Samsung Galaxy A27 5G : భారత మార్కెట్లోకి శామ్‌సంగ్ కొత్త 5G ఫోన్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు
  8. itel Soundbar : ఇంటినే థియేటర్‌లా మార్చే ఐటెల్ సరికొత్త సౌండ్‌బార్లు.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే లాంచ్
  9. Vivo X Fold 6 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో కొత్త సంచలనం.. జూన్ 26న వివో X ఫోల్డ్ 6 గ్రాండ్ లాంచ్
  10. Redmi 17C : రెడ్‌మి నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్.. చైనా మార్కెట్లో రెడ్‌మి 17C గ్రాండ్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »