జియో తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్ ద్వారా కస్టమర్లు దేశవ్యాప్తంగా దాదాపు 16 కి పైగా ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉన్న లైవ్ టీవీ ఛానెళ్లను ఆస్వాదించవచ్చు.
Photo Credit: Jio
Jio
Jio : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం మరో సంచలన ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ కేవలం రూ. 55లకే సరికొత్త జియోటీవీ ప్రో ప్యాక్‌ను పరిచయం చేసింది. ఇదొక ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్-ఓన్లీ ప్లాన్. అంటే ఇందులో ఎలాంటి కాలింగ్ లేదా ఎస్ఎమ్ఎస్ వంటి టెలికాం ప్రయోజనాలు లభించవు. కేవలం వినోదం మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో యూజర్లు ఏకంగా 30 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను తమ మొబైల్‌లోనే నేరుగా వీక్షించవచ్చు.
16 భాషల్లో వినోదాల విందు
జియో తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్ ద్వారా కస్టమర్లు దేశవ్యాప్తంగా దాదాపు 16 కి పైగా ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉన్న లైవ్ టీవీ ఛానెళ్లను ఆస్వాదించవచ్చు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్యాక్‌లో 150 కి పైగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హెచ్‌డీ ఛానెళ్లు కూడా ఇన్-బిల్ట్‌గా వస్తున్నాయి. ఇందులో భాగంగా కస్టమర్లకు ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు, బ్రేకింగ్ న్యూస్, కిడ్స్ స్పెషల్స్, లైఫ్‌స్టైల్, రీజనల్ కంటెంట్‌కు సంబంధించిన అన్ని కేటగిరీల ఛానెళ్ల యాక్సెస్ లభిస్తుంది.
స్టార్ ప్లస్, ఈటీవీ ఛానెల్స్ లభ్యం
ఈ సరికొత్త రూ.55 ప్లాన్ కింద లభించే ప్రధాన ఛానెళ్ల జాబితాను గమనిస్తే.. స్టార్ ప్లస్ HD, కలర్స్ HD, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ HD, సోనీ సబ్ HD, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి పాపులర్ ఛానెళ్లు ఉన్నాయి. వీటితో పాటు సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉన్న సన్ టీవీ నెట్‌వర్క్, ఈటీవీ ఛానెళ్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే స్పోర్ట్స్ లవర్స్‌కు ఈ ప్లాన్ కాస్త నిరాశ కలిగిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే జియోస్టార్ లేదా సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన క్రీడా ఛానెళ్లు ఈ ప్యాక్‌లో భాగం కావు.
Oppo Reno 13 5G : ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చివరి రోజే బంపర్ ఆఫర్.. భారీ డిస్కౌంట్‌తో ఒప్పో రెనో 13 5G
ఎలాంటి అదనపు యాక్టివేషన్ అవసరం లేదు
ఈ ప్రత్యేకమైన జియోటీవీ ప్రో ప్యాక్ సౌకర్యాన్ని పొందడానికి యూజర్ వద్ద ముందే ఏదైనా ఒక యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ఉండటం తప్పనిసరి. కేవలం ఒక బూస్టర్ ప్యాక్‌లాగా మీ నంబర్‌కు రూ.55 రీఛార్జ్ చేసుకున్న వెంటనే ఈ సేవలు యాక్టివేట్ అవుతాయి. దీనికోసం ఎలాంటి ప్రత్యేకమైన ఆక్టివేషన్ కోడ్స్ లేదా కస్టమర్ కేర్ సాయం అవసరం లేదు. రీఛార్జ్ పూర్తయిన తర్వాత యూజర్లు నేరుగా తమ స్మార్ట్‌ఫోన్‌లో JioTV యాప్ ఓపెన్ చేసి, తమ జియో నంబర్‌తో లాగిన్ అయితే సరిపోతుంది. వెంటనే అన్ని ప్రీమియం ఛానెళ్ల లైవ్ ప్రసారాలు మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
ఒకేసారి రెండు మూడు రీఛార్జ్‌లు చేసుకున్నా నో ప్రాబ్లమ్
ఈ ప్లాన్ కేవలం ఒకే ఒక్క మొబైల్ డివైజ్‌లో జియోటీవీ యాప్ ద్వారా ఉపయోగించడానికి మాత్రమే చెల్లుతుంది. ఒకవేళ ఎవరైనా యూజర్ ఆఫర్ బాగుంది కదా అని ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ రూ.55 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, ఆ అదనపు ప్యాక్‌లు అన్నీ కూడా ఆటోమేటిక్‌గా క్యూ సిస్టమ్‌లో యాడ్ అవుతాయి. అంటే ప్రస్తుతం నడుస్తున్న 30 రోజుల ప్లాన్ గడువు ముగిసిన వెంటనే, తర్వాతి ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. తక్కువ బడ్జెట్ లో లైవ్ టీవీని చూడాలనుకునే ప్రయాణికులకు, బ్యాచిలర్స్‌కు, సామాన్యులకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals