సోనీ బ్రావియా 9 II రెండు స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. దీని 75-ఇంచ్ మోడల్ MRP ధర రూ.8,39,900 కాగా, బెస్ట్ బై ప్రైస్ కింద రూ.5,39,990 కే లభిస్తుంది.
Photo Credit: Sony
Sony
Sony : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఇండియా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ తన మోస్ట్ అల్ట్రా-ప్రీమియం స్మార్ట్ టీవీ సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో బ్రావియా 9 II, బ్రావియా 7 II మోడల్స్ ఉన్నాయి. వీటిలో సరికొత్త బ్రావియా 9 II సిరీస్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ 2026 మోడల్‌గా నిలిచింది. ఈ బ్రావియా టీవీ సిరీస్‌లలోనే మొదటిసారిగా అత్యంత అధునాతన ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ టెక్నాలజీని ఉపయోగించినట్లు సోనీ గర్వంగా ప్రకటించింది. ఈ టీవీలలో ఏఐ ఆధారిత కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్‌ఆర్, గూగుల్ టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, గూగుల్ జెమిని ఏఐ సపోర్ట్ వంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు లభిస్తాయి.
ఈ అల్ట్రా ప్రీమియం స్మార్ట్ టీవీలు విభిన్న స్క్రీన్ సైజులలో భారీ ధరలతో అందుబాటులోకి వచ్చాయి. సోనీ బ్రావియా 9 II రెండు స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. దీని 75-ఇంచ్ మోడల్ MRP ధర రూ.8,39,900 కాగా, బెస్ట్ బై ప్రైస్ కింద రూ.5,39,990 కే లభిస్తుంది. అలాగే దీని 85-ఇంచ్ టాప్ మోడల్ MRP ధర రూ.9,89,900 కాగా, ఆఫర్ ధర రూ.6,69,990 గా నిర్ణయించారు.
మరోవైపు, సోనీ బ్రావియా 7 II సిరీస్ మొత్తం నాలుగు స్క్రీన్ సైజుల్లో లభిస్తుంది. దీని 55-ఇంచ్ మోడల్ ధర రూ.2,21,990 (MRP రూ.3,59,900), 65-ఇంచ్ మోడల్ ధర రూ.2,74,990 (MRP రూ.4,39,900), 75-ఇంచ్ మోడల్ ధర రూ.4,19,990 (MRP రూ.6,19,900), 85-ఇంచ్ భారీ స్క్రీన్ మోడల్ ధర రూ.5,29,990 (MRP రూ.7,19,900) గా ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడల్ బ్రావియా 9 II సేల్స్ జూన్ 29, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి, బ్రావియా 7 II మోడల్ ఇప్పటికే మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. వీటిని సోనీ సెంటర్స్, సోనీ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు స్మార్ట్ టీవీలలో 4K UHD (3840×2160) ట్రూ ఆర్‌జీబీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది గేమింగ్, స్మూత్ విజువల్స్ కోసం 120Hz హై-రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇందులో ఉపయోగించిన ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో టెక్నాలజీ రెడ్, గ్రీన్, బ్లూ ఎల్‌ఈడీలను విడివిడిగా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల కళ్లు చెదిరే బ్రైట్‌నెస్, నేచురల్ కలర్స్, అద్భుతమైన డీప్ బ్లాక్ లెవెల్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. సినిమా పిక్చర్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఇందులో ఏఐ ఆధారిత కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్‌ఆర్ ఇచ్చారు. దీనితో పాటు ఎక్స్‌ఆర్ కాంట్రాస్ట్ బూస్టర్, ఆర్‌జీబీ ట్రిలుమినోస్ మాక్స్, లూమినెన్స్ బూస్టర్ ప్రో, డాల్బీ విజన్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని ఇమ్మర్సివ్ బ్లాక్ స్క్రీన్ ప్రో టెక్నాలజీ స్క్రీన్‌పై పడే వెలుతురు రిఫ్లెక్షన్లను చాలా వరకు తగ్గిస్తుంది.
Delhi EV Policy : 2028 నుంచి పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు బంద్.. ఢిల్లీ ప్రభుత్వం హిస్టారికల్ నిర్ణయం
సౌండ్ క్వాలిటీ పరంగా సోనీ ఎక్కడా రాజీ పడలేదు. బ్రావియా 9 II మోడల్‌లో 80W కెపాసిటీ గల అకౌస్టిక్ మల్టీ-ఆడియో+ సిస్టమ్‌ను, బ్రావియా 7 II మోడల్‌లో 40W అకౌస్టిక్ మల్టీ-ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. ఇవి డాల్బీ అట్మోస్, డీటీఎస్, వాయిస్ జూమ్ 3, 3D సరౌండ్ అప్‌స్కేలింగ్‌ను సపోర్ట్ చేస్తూ థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్‌ను ఇంట్లోనే అందిస్తాయి. ఈ టీవీలు గూగుల్ టీవీ ఓఎస్‌పై రన్ అవుతాయి. ఇందులో గూగుల్ క్రోమ్‌కాస్ట్, ఆపిల్ ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఓటీఏ (OTA) అప్‌డేట్ ద్వారా ఈ టీవీలలో జెమిని ఫర్ గూగుల్ టీవీ ఏఐ సపోర్ట్ కూడా లభించనుందని సోనీ పేర్కొంది. అదనపు ప్రయోజనంగా యూజర్లకు సోనీ పిక్చర్స్ కోర్, ఐమాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ కంటెంట్‌తో పాటు 24 నెలల పాటు 10 మూవీ క్రెడిట్స్ ఉచితంగా లభిస్తాయి.
ఈ టీవీలు అల్ట్రా స్లిమ్ ఇమ్మర్సివ్ ఫ్రేమ్ డిజైన్, మిరాజ్ స్టాండ్, అధునాతన కేబుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తాయి. దీనితో పాటు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే ప్రీమియం రిమోట్ లభిస్తుంది. ఈ రిమోట్‌లో చీకటిలో కూడా కనిపించే బ్యాక్‌లిట్ బటన్స్, రిమోట్ ఎక్కడైనా పోతే వెతుక్కునే ఫైండ్ మై రిమోట్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం బ్రావియా 9 II మోడల్‌లో 4 HDMI 2.1 పోర్ట్స్, బ్రావియా 7 II లో 4 సాధారణ HDMI పోర్ట్స్, యూఎస్‌బీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఈథర్‌నెట్, -ఆర్క్ (eARC) సపోర్ట్ ఇవ్వబడ్డాయి.
ప్రకటన
ప్రకటన