భారతదేశంలో ఈ సరికొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ధరను రూ.4,999గా ఫిక్స్ చేశారు.
Photo Credit: Amazon
The new lFire TV Stick HD comes with an Alexa Voice Remote
Amazon : ఇంట్లో పాత ఎల్‌ఈడీ టీవీ లేదా నార్మల్ టీవీ ఉండి.. అందులో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు సరిగ్గా రావడం లేదని బాధపడుతున్నారా? అయితే మీకోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. తన మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ డివైజ్ లైనప్‌లో సరికొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీని మంగళవారం భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. పాత తరం హెచ్‌డీ మోడల్‌తో పోలిస్తే ఇది ఏకంగా 30 శాతం వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ధర ఎంత? ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది?
భారతదేశంలో ఈ సరికొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ధరను రూ.4,999గా ఫిక్స్ చేశారు. ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం ఇది Amazon.in వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ లోనూ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, అర్జెంట్‌గా కావాలనుకునే వారి కోసం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టోలలో కూడా ఇది లభిస్తోంది. అంటే ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఇది మీ ఇంటికి వచ్చేస్తుందన్నమాట. త్వరలోనే మీ ఊర్లోని నార్మల్ రీటైల్ ఎలక్ట్రానిక్ షాపుల్లోనూ ఇది నేరుగా దొరకనుంది.
స్పెసిఫికేషన్లు ఇవే..
ఈ చిన్న డివైజ్ లోపల పవర్‌ఫుల్ 1.7GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి తోడు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. దీనివల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, మెనూలు స్క్రోల్ చేయడం చాలా స్మూత్‌గా సాగుతుంది. ఈ ఫైర్ స్టిక్ సాయంతో మీరు మీ టీవీలో ఫుల్-హెచ్‌డీ (1080p) క్వాలిటీతో సెకనుకు 60 ఫ్రేమ్స్ స్పీడ్‌తో లాగ్ లేకుండా వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ కోసం ఇందులో డాల్బీ-ఎన్‌కోడెడ్ సౌండ్ టెక్నాలజీని కూడా జోడించారు. విజువల్స్ అదిరిపోయేలా ఉండటానికి HDR10, HDR10+, HLG, AV1 వంటి హై-ఎండ్ వీడియో ఫార్మాట్లకు ఇది సపోర్ట్ చేస్తుంది.
బఫరింగ్‌కు ఇక శాశ్వతంగా గుడ్‌బై
చాలా మంది ఫైర్ స్టిక్ వాడుతున్నప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా అందక వీడియోలు మధ్యమధ్యలో ఆగిపోతుంటాయి. కానీ ఈ కొత్త మోడల్‌లో అమెజాన్ లేటెస్ట్ డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 6 టెక్నాలజీని ఇచ్చింది. మీ ఇంట్లో వై-ఫై 6 రూటర్ ఉంటే గనుక, నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా కూడా ఈ డివైజ్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను లాగేసుకుని అస్సలు బఫరింగ్ లేకుండా వీడియోలను ప్లే చేస్తుంది. అలాగే ఇందులో బ్లూటూత్ 5.3 కూడా ఉంది. దీనివల్ల మీ బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, స్పీకర్లు లేదా గేమింగ్ కంట్రోలర్లను చాలా ఈజీగా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. రాత్రి పూట ఇంట్లో వాళ్లు పడుకున్నప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని టీవీ చూసేవారికి ఇది బెస్ట్ ఫీచర్.
కొత్త ఇంటర్‌ఫేస్
ఈ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ ద్వారా అమెజాన్ తన సరికొత్త రీడిజైన్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ను పరిచయం చేసింది. పాత మోడల్స్ లాగా కాకుండా ఇది సరికొత్త టైల్-బేస్డ్ లేఅవుట్, హారిజాంటల్ స్క్రోలింగ్‌తో వస్తుంది. దీనివల్ల మీకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్లు, యాప్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే టైమ్ చాలా వరకు ఆదా అవుతుంది. మీరు హోమ్ స్క్రీన్ చూడగానే ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ అంతా క్లియర్‌గా కనిపిస్తుంది.
నోటి మాటతో నడిచే అలెక్సా రిమోట్
ఈ డివైజ్‌తో పాటు సరికొత్త అలెక్సా వాయిస్ రిమోట్ ఉచితంగా వస్తుంది. మీరు రిమోట్‌లోని బటన్ నొక్కి నోటితో చెప్తే చాలు.. యాప్స్ ఓపెన్ చేయడం, నచ్చిన పాటలు ప్లే చేయడం, వాల్యూమ్ పెంచడం వంటివన్నీ అలెక్సా చిటికెలో చేసేస్తుంది. కేవలం టీవీయే కాదు.. మీ ఇంట్లో అలెక్సాకు సపోర్ట్ చేసే స్మార్ట్ బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు లేదా సెక్యూరిటీ కెమెరాలు ఉంటే, వాటిని కూడా మీ టీవీ రిమోట్ వాయిస్ కమాండ్స్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. అదనంగా రేపటి వాతావరణం ఎలా ఉందో అడిగినా, రిమైండర్లు సెట్ చేయాలన్నా ఈ రిమోట్ ముచ్చటగా చేసి పెడుతుంది.
టీవీలోనే ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్
గేమింగ్ పిచ్చి ఉన్నవారికి అమెజాన్ ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ ఫైర్ టీవీ స్టిక్‌లో లగ్జరీ ఫీచర్ అయిన Xbox Cloud Gaming సపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. అంటే మీ దగ్గర ఎలాంటి ఖరీదైన గేమింగ్ కన్సోల్ లేకపోయినా.. జస్ట్ ఒక బ్లూటూత్ గేమింగ్ కంట్రోలర్‌ను ఈ ఫైర్ స్టిక్‌కు కనెక్ట్ చేసి, ఎక్స్‌బాక్స్ యాప్ ద్వారా నేరుగా టీవీలోనే హై-ఎండ్ గేమ్స్ ఆడేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ వాడటానికి మీ దగ్గర ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బడ్జెట్ ధరలో ఇన్ని ఫీచర్లు ఇస్తుండటంతో టెక్ వెబ్‌సైట్లు ఈ డివైజ్‌కు రేటింగ్స్ భారీగా ఇస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S27 Series Tipped to Include New Pro Model; Galaxy S27 Ultra Said to Offer Hardware Upgrades