కొత్త ఆధార్ యాప్ కేవలం డిజిటల్ కార్డును దాచుకోవడానికే కాకుండా, అనేక స్మార్ట్ ఫీచర్లతో వచ్చింది. ఇందులో సెలెక్టివ్ షేర్ అనే అద్భుతమైన ఫీచర్ ఉంది.
New Aadhaar app allows cardholders to store their Aadhaar card in a verifiable credential digital format
Aadhaar : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఇప్పటివరకు మనం వాడుతున్న mAadhaar యాప్‌ను త్వరలోనే నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో సరికొత్త Aadhaar Appను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త యాప్ మరింత వేగంగా, సురక్షితంగా ఉంటుందని, ప్రజలు వెంటనే పాత యాప్ నుంచి కొత్త యాప్‌కు మారాలని యూఐడీఏఐ సూచించింది. ఇది అండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
కొత్త యాప్‌లో స్పెషల్ ఏంటి?
కొత్త ఆధార్ యాప్ కేవలం డిజిటల్ కార్డును దాచుకోవడానికే కాకుండా, అనేక స్మార్ట్ ఫీచర్లతో వచ్చింది. ఇందులో సెలెక్టివ్ షేర్ అనే అద్భుతమైన ఫీచర్ ఉంది. దీనివల్ల మీ ఆధార్ నంబర్ అవతలి వారికి తెలియకుండానే మీ ఐడెంటిటీని నిరూపించుకోవచ్చు. అంటే మీరు కేవలం మీ పేరు, వయస్సు లేదా ఫోటోను మాత్రమే అవసరమైన చోట షేర్ చేయవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత లభిస్తుంది.
ఫేస్ లాక్, బయోమెట్రిక్ కంట్రోల్
భద్రత విషయంలో ఈ యాప్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. మీ వేలిముద్రలు , కనుపాప లేదా ఫేస్ అథెంటికేషన్ డేటాను ఎవరూ తప్పుడు పనులకు వాడకుండా యాప్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే అన్‌లాక్ చేసి వాడుకోవచ్చు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా మీ వివరాలను ధృవీకరించుకోవచ్చు. ఈ యాప్ మొత్తం 13 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా వాడటం చాలా సులభం అవుతుంది.
ఒక్క అకౌంట్‌లో ఐదుగురి వివరాలు
ఈ యాప్‌లో మరో సౌకర్యం ఏంటంటే, మీరు మీ ప్రొఫైల్‌లో మీతో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణాల్లో లేదా అత్యవసర సమయాల్లో అందరి ఆధార్ కార్డులను మీ ఫోన్‌లోనే సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, అడ్రస్ వంటి వివరాలను నేరుగా యాప్ నుంచే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
పాత డేటా ఆటోమేటిక్‌గా రాదు
గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. పాత mAadhaar యాప్‌లో ఉన్న మీ ప్రొఫైల్ డేటా కొత్త యాప్‌లోకి ఆటోమేటిక్‌గా బదిలీ అవ్వదు. కాబట్టి కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ వివరాలతో మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాత యాప్ రిటైర్ అవ్వకముందే ఈ పని పూర్తి చేయడం మంచిది.
యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
* ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి Aadhaar Appను డౌన్‌లోడ్ చేయండి.
* మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
* మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించండి.
* ఆ తర్వాత మీ ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వెలుతురు సరిగ్గా ఉన్న చోట నిలబడి ఫోటో క్లిక్ చేయాలి.
* చివరగా యాప్ ఓపెన్ చేయడానికి ఒక 6 అంకెల పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
OnePlus Ace 7 Series Specifications Leaked, Could Launch in India as OnePlus 16R