గత నెలలోనే పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను లాంచ్ చేసిన ఈ బ్రాండ్, ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో ఫోన్‌ను దించేందుకు రెడీ అయిపోయింది.
Photo Credit: Flipkart/ Motorola
Motorola Edge 70 Pro+ will sport a hole-punch display cutout
Motorola Edge 70 Pro+ : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు మోటోరోలా కంపెనీ వరుస సర్ప్రైజ్‌లు ఇస్తోంది. గత నెలలోనే పవర్‌ఫుల్ ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను లాంచ్ చేసిన ఈ బ్రాండ్, ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో ఫోన్‌ను దించేందుకు రెడీ అయిపోయింది. అదే మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్. ఈ ప్రీమియం ఫోన్ భారత్‌లో త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా హింట్ ఇచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌కు సంబంధించిన స్పెషల్ పేజీ కూడా లైవ్ అయింది. ఈ సైట్ యూఆర్ఎల్లో ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరు స్పష్టంగా కనిపిస్తుండటంతో టెక్ ప్రియుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
మూడు క్రేజీ కలర్స్.. లగ్జరీ డిజైన్
ఈ అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లుక్స్ పరంగా కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ఇది మూడు విభిన్నమైన, అదిరిపోయే కలర్ ఆప్షన్లలో లభించనుంది.
* బ్రౌన్ కలర్: ఇది క్లాసిక్ స్కల్ప్టెడ్ వుడ్ ఫినిషింగ్‌తో రానుంది.
* రెడ్ కలర్: ఇది రాయల్ శాటిన్-లక్స్ ఫినిషింగ్‌తో మెరిసిపోనుంది.
* టీల్ కలర్: ఇది సరికొత్త ట్విల్-ఇన్‌స్పైర్డ్ స్టైలిష్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే గత ఎడ్జ్ 70 ప్రో మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, దీనికి ప్రీమియం మెటల్ ఫ్రేమ్ ఇచ్చే అవకాశం ఉంది. డిస్‌ప్లే పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ అందించారు. కుడివైపున వాల్యూమ్ బటన్స్, వాటి కింద పవర్ బటన్ ఉన్నాయి.
సోనీ కెమెరాతో ఫొటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్
ఫొటోగ్రఫీని ఇష్టపడేవారి కోసం ఈ ప్లస్ మోడల్‌లో భారీ మార్పులు చేశారు. ఫోన్ వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో సోనీ ఎల్‌వైటి సెన్సార్‌ను వాడుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ టీజర్ ద్వారా కన్ఫర్మ్ అయింది. ఇది 81mm ఫోకల్ లెంగ్త్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో రానుంది. దీనివల్ల లాంగ్ రేంజ్ పోర్ట్రెయిట్ షాట్స్, అద్భుతమైన క్లారిటీతో బ్లర్ లేకుండా వస్తాయి. ఇందులో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.
ప్రో మోడల్ కంటే ఏంటి స్పెషల్?
సాధారణ ప్రో మోడల్‌తో పోలిస్తే ఈ ప్రో ప్లస్ వేరియంట్‌లో మూడు ప్రధాన అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిది మెరుగైన టెలిఫోటో కెమెరా కాగా, రెండవది మోటో ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్న వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్. ఇక మూడవది మెరుగైన మల్టీటాస్కింగ్ కోసం ఏకంగా 16GB RAM వేరియంట్‌ను కూడా తీసుకురాబోతున్నారు.
గత ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు, ధరపై ఒక లుక్
గత నెల ఏప్రిల్ 22న లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో టాప్ వేరియంట్ (12GB + 256GB) ధర భారత్‌లో రూ.41,999 గా ఉంది. ఆ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను వాడారు. అలాగే 90W ఫాస్ట్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6,500mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా పరంగా 50MP మెయిన్ + 50MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ప్రో ప్లస్ మోడల్ ఫీచర్లు ఇంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయి కాబట్టి, దీని ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Xiaomi 17T India Launch Seemingly Confirmed a Week Ahead of Global Debut
Take-Two CEO Strauss Zelnick Reaffirms GTA 6 Release Date, Says Game Was Delayed by 18 Months