మోటో బడ్స్ 2లో ఆడియో అనుభవం నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఇందులో 11mm, 6mm డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అమర్చారు.
Photo Credit: Motorola
Moto Buds 2 was initially unveiled at MWC 2026 in Barcelona
Moto Buds 2 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న మోటరోలా, ఇప్పుడు ఆడియో రంగంలోనూ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రీమియం వెర్షన్ మోటో బడ్స్ 2 ప్లస్‌ను లాంచ్ చేసిన కంపెనీ, ఇప్పుడు బడ్జెట్ ధరలో మోటో బడ్స్ 2ను ఇండియాకు తీసుకువస్తోంది. మే 19న ఈ సరికొత్త ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టబోతున్నాయి. ఇదే రోజున మోటో G37 సిరీస్ ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేయనుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సౌండ్ క్వాలిటీలో తగ్గేదేలే
మోటో బడ్స్ 2లో ఆడియో అనుభవం నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఇందులో 11mm, 6mm డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అమర్చారు. దీనివల్ల బేస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా, హై-ఫ్రీక్వెన్సీ శబ్దాలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. అంతేకాకుండా, ఇందులో స్పేషియల్ ఆడియో, LHDC సపోర్ట్ ఉండటం వల్ల మీకు సినిమా థియేటర్‌లో ఉన్నట్లుగా 360-డిగ్రీల సౌండ్ అనుభూతి కలుగుతుంది.
నాయిస్ క్యాన్సిలేషన్..
బయట ఎంత గోల ఉన్నా మీరు ప్రశాంతంగా మ్యూజిక్ వినడానికి ఇందులో 55dB వరకు డైనమిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇది మీ చుట్టూ ఉన్న శబ్దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఎవరైనా మాట్లాడినప్పుడు వినడానికి స్మార్ట్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినబడటం కోసం ఏకంగా ఆరు మైక్రోఫోన్లను ఇందులో వాడారు. గాలి వీస్తున్నా లేదా ట్రాఫిక్‌లో ఉన్నా మీ వాయిస్ క్లియర్‌గా వెళ్తుంది.
బ్యాటరీ లైఫ్.. ఛార్జింగ్ టెన్షన్ ఉండదు
మ్యూజిక్ అంటే ఇష్టపడే వారికి బ్యాటరీ విషయంలో మోటరోలా పెద్ద ఊరటనిచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 11 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే ఏకంగా 48 నుంచి 53 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3 గంటల పాటు పాటలు వినవచ్చు. ఇది ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
స్మార్ట్ ఫీచర్లు మరిన్ని..
ఈ బడ్స్ మోటో AIతో అనుసంధానం చేయబడ్డాయి. ఇందులో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ ఉంది, దీనివల్ల ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ ఇష్టపడే వారి కోసం లో-లేటెన్సీ మోడ్ ఉంది. ఇంకా ఇయర్ డిటెక్షన్ (చెవిలోంచి తీయగానే పాట ఆగిపోవడం), టచ్ కంట్రోల్స్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.4,000 నుంచి రూ.5,000 మధ్య ఉండవచ్చని అంచనా.
ప్రకటన
ప్రకటన
YouTube’s Likeness Detection Tool Is Now Available to All Adult Creators
Vi Postpaid Users in India Can Choose New International Roaming Plans From Rs 649
Red Magic 11S Pro, Red Magic 11S Pro+ Launched With Snapdragon 8 Elite Gen 5 Leading Edition SoC: Price, Specifications