ఇప్పుడు ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని ప్రమేయం లేకుండానే, వారి సంతకం, అటెస్టేషన్ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
Photo Credit: EPFO
EPFO 3.0 refers to the next digital phase of the Employees’ Provident Fund Organisation’s services
EPFO : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు నిధి లేదా పీఎఫ్ అనేది ఒక పెద్ద ఆర్థిక భరోసా. అత్యవసర సమయాల్లో లేదా ఉద్యోగం మారినప్పుడు ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవడం ఒకప్పుడు చాలా పెద్ద తలనొప్పి వ్యవహారంగా ఉండేది. కంపెనీ చుట్టూ తిరిగి, మేనేజర్ సంతకాలు పెట్టించుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగితేనే గానీ పైసలు చేతికి వచ్చేవి కావు. కానీ ఇకపై అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. నయా ఈపీఎఫ్ఓ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని ప్రమేయం లేకుండానే, వారి సంతకం, అటెస్టేషన్ అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులను సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
కంపెనీ అప్రూవల్ ఎందుకు అవసరం లేదు?
గతంలో చాలా కంపెనీలు ఉద్యోగులు మానేసినప్పుడు పీఎఫ్ క్లెయిమ్‌లను సకాలంలో ప్రాసెస్ చేయకుండా ఇబ్బందులకు గురిచేసేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఈపీఎఫ్ఓ తన వ్యవస్థను నేరుగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్ సిస్టమ్‌తో అనుసంధానించింది. దీనివల్ల ఉద్యోగి గుర్తింపును ఈపీఎఫ్ఓ నేరుగా ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తుంది. మీ కేవైసీ వివరాలు గనుక పక్కాగా ఉంటే, ఇక మధ్యలో కంపెనీతో ఎలాంటి అవసరం లేకుండానే ప్రభుత్వమే నేరుగా మీ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తుంది.
ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?
యజమాని సంతకం లేకుండా ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే మీ యూఏఎన్ నంబర్‌కు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు లింక్ అయి ఉండాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ వర్కింగ్‌లో ఉండాలి. ఎందుకంటే క్లెయిమ్ చివర్లో వచ్చే ఓటీపీ దీనికే వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మానేసి పూర్తి డబ్బులు డ్రా చేయాలనుకుంటే, మీ కంపెనీ వారు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్‌డేట్ చేశారో లేదో ఒకసారి చూసుకోవాలి.
ఏయే ఫారమ్‌ల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు?
కొత్త నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు మూడు రకాల క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో యజమాని ప్రమేయం లేకుండా సబ్మిట్ చేయవచ్చు:
* ఫారమ్ 19 : ఉద్యోగం పూర్తిగా మానేసినప్పుడు పీఎఫ్ సెటిల్‌మెంట్ కోసం దీనిని వాడతారు.
* ఫారమ్ 10సి : పీఎఫ్ డబ్బులతో పాటు పెన్షన్ ఫండ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
* ఫారమ్ 31 : ఉద్యోగంలో ఉండగానే వైద్య అత్యవసరాలు, పిల్లల ఉన్నత చదువులు, వివాహం, ఇల్లు కొనడం లేదా ఇంటి రిపేర్ల కోసం ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవడానికి ఈ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
* స్టెప్ 1: మొదట ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ-సేవా పోర్టల్ ఓపెన్ చేసి, మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
* స్టెప్ 2: హోమ్‌పేజీలోకి వెళ్లాక పైన ఉన్న Manage సెక్షన్‌పై క్లిక్ చేసి KYC ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు Approved అని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
* స్టెప్ 3: అంతా పక్కాగా ఉంటే, మెనూ బార్‌లోని Online Servicesలోకి వెళ్లి Claim (Form-31, 19, 10C & 10D) పై క్లిక్ చేయాలి.
* స్టెప్ 4: స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి, అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై బటన్ నొక్కండి.
* స్టెప్ 5: ఆ తర్వాత Proceed For Online Claim పై క్లిక్ చేసి, మీ అవసరాన్ని బట్టి ఫుల్ సెటిల్‌మెంట్ లేదా అడ్వాన్స్ పీఎఫ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
* స్టెప్ 6: చివరిగా మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే మీ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తవుతుంది. మీ క్లెయిమ్ ఏ స్టేజీలో ఉందో Track Claim Statusలో చూసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999