ChatGPT : చాట్ జీపీటీలో సరికొత్త విప్లవం.. ఇక మీ అకౌంట్లోని పైసా పైసా లెక్క చెప్పే చెప్పేస్తుంది

చాట్ జీపీటీలో సరికొత్త పర్సనల్ ఫైనాన్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై మీ ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్లు, హోమ్ లోన్ల లెక్కలను చాట్ జీపీటీనే స్వయంగా చూసుకోనుంది.

ChatGPT : చాట్ జీపీటీలో సరికొత్త విప్లవం.. ఇక మీ అకౌంట్లోని  పైసా పైసా లెక్క చెప్పే చెప్పేస్తుంది

Photo Credit: OpenAI

OpenAI says eventually, the personal finance capability will be brought to all users

ముఖ్యాంశాలు
  • చాట్ జీపీటీలో సరికొత్త పర్సనల్ ఫైనాన్స్ ఫీచర్‌
  • యూజర్లు తమ క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంక్ అకౌంట్లు చాట్ జీపీటీకి లింక్
  • యాక్టివ్‌గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ల వివరాలు రియల్ టైమ్‌లో కనిపిస్తాయి
ప్రకటన

ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ ఏఐ తన యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. చాట్ జీపీటీలో సరికొత్త పర్సనల్ ఫైనాన్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇకపై మీ ఖర్చులు, పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్లు, హోమ్ లోన్ల లెక్కలను చాట్ జీపీటీనే స్వయంగా చూసుకోనుంది. ప్రస్తుతానికి అమెరికాలో చాట్ జీపీటీ ప్రో సబ్‌స్క్రైబర్లకు ప్రివ్యూ రూపంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్లస్ యూజర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారులందరికీ దీనిని విస్తరించనున్నారు.

బ్యాంక్ ఖాతాల అనుసంధానం.. ఎలా పనిచేస్తుందంటే?
ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా యూజర్లు తమ క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను నేరుగా చాట్ జీపీటీకి లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ప్లాయిడ్‎తో ఓపెన్ ఏఐ చేతులు కలిపింది. దీని సహాయంతో సుమారు 12,000కు పైగా ఆర్థిక సంస్థల అకౌంట్లను వెబ్ లేదా ఐఓఎస్ యాప్‌ ద్వారా చాట్ జీపీటీకి సురక్షితంగా కనెక్ట్ చేయవచ్చు. త్వరలోనే ప్రముఖ ట్యాక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇంటూయిట్ సపోర్ట్‌ను కూడా జోడించనున్నారు.

యూజర్లు చాట్ జీపీటీ సైడ్‌బార్‌లో ఉన్న ఫైనాన్సెస్ ఆప్షన్‌లోకి వెళ్లి  గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయడం ద్వారా లేదా ఏదైనా చాట్‌లో “@Finances, connect my accounts” అని టైప్ చేయడం ద్వారా తమ అకౌంట్లను లింక్ చేసుకోవచ్చు.

పవర్‌ఫుల్ ఫైనాన్స్ డాష్‌బోర్డ్ 
బ్యాంక్ అకౌంట్లు సింక్ అవ్వగానే చాట్ జీపీటీ స్క్రీన్‌పై ఒక విజువల్ డాష్‌బోర్డ్ ప్రత్యక్షమవుతుంది. ఇందులో మీ నెలవారీ ఖర్చులు, రాబోయే బిల్లుల పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ పర్ఫార్మెన్స్, యాక్టివ్‌గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ల వివరాలు రియల్ టైమ్‌లో కనిపిస్తాయి.

"నేను రాబోయే ఐదేళ్లలో ఇల్లు కొనాలంటే ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి?", "నా గత ట్రిప్‌కు మొత్తం ఎంత ఖర్చయింది?", "నేను మర్చిపోయిన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఏమైనా ఉన్నాయా?" వంటి క్లిష్టమైన ప్రశ్నలను చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. ప్రతిసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను చాట్‌బాట్‌కు టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే, అది మీ అకౌంట్ డేటాను బట్టి పక్కా పర్సనల్ ప్లానింగ్ ఇస్తుంది.

GPT-5.5 Thinking పవర్‌తో పక్కా కాలిక్యులేషన్స్ 
ఈ సరికొత్త పర్సనల్ ఫైనాన్స్ ఫీచర్ ఓపెన్ ఏఐ వారి మోస్ట్ అడ్వాన్స్‌డ్ GPT-5.5 Thinking మోడల్‌పై రన్ అవుతుంది. సాధారణ ప్రశ్నల కంటే ఇలాంటి మనీ మ్యాటర్స్, లెక్కల విషయాల్లో ఈ మోడల్ అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడించింది. సుమారు 50 మందికి పైగా ఫైనాన్స్ నిపుణులతో కలిసి నిర్వహించిన ఇంటర్నల్ టెస్టుల్లో ఈ మోడల్ అత్యుత్తమ స్కోరు సాధించినట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది యూజర్లు బడ్జెట్, ఇన్వెస్ట్‌మెంట్ సలహాల కోసం చాట్ జీపీటీని వాడుతున్నారని, అందుకే ఈ ఫీచర్ తెచ్చామని కంపెనీ తెలిపింది.

డేటా భద్రత ఎంతవరకు? 
బ్యాంక్ అకౌంట్లు అనగానే భద్రతపై ఆందోళన కలగడం సహజం. అయితే కస్టమర్ల డేటా కంట్రోల్ పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుందని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. చాట్ జీపీటీ కేవలం మీ బ్యాలెన్స్, లావాదేవీలను మాత్రమే చూడగలదు. కానీ మీ పూర్తి అకౌంట్ నంబర్లను అది చూడలేదు. అంతేకాకుండా చాట్ జీపీటీ ద్వారా మీ అకౌంట్ లోని డబ్బులను బదిలీ చేయడం, బిల్లులు కట్టడం లేదా స్టాక్స్ కొనడం వంటి పనులు చేయడం అస్సలు సాధ్యం కాదు.

యూజర్లు తమకు నచ్చినప్పుడు అకౌంట్లను డిస్‌కనెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసిన 30 రోజుల్లోనే సింక్ అయిన డేటా మొత్తం ఓపెన్ ఏఐ సర్వర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేయబడుతుంది. అలాగే మీ ఫైనాన్స్ చాట్ హిస్టరీ, ఫైనాన్షియల్ మెమొరీలను కూడా ఎప్పుడైనా మాన్యువల్‌గా డిలీట్ చేసుకునే సౌకర్యం ఉంది.

#తాజా కథనాలు
  1. ChatGPT : చాట్ జీపీటీలో సరికొత్త విప్లవం.. ఇక మీ అకౌంట్లోని పైసా పైసా లెక్క చెప్పే చెప్పేస్తుంది
  2. Motorola Edge 70 Pro+ : మోటో నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్.. అదిరిపోయే కెమెరా, లగ్జరీ లుక్స్
  3. Aadhaar : ఆధార్ కొత్త యాప్ వచ్చేసింది.. ఫేస్ లాక్, క్యూఆర్ షేరింగ్ వంటి అదిరిపోయే ఫీచర్లు
  4. Moto Buds 2 : 48 గంటల బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్.. మ్యూజిక్ లవర్స్‌కు మోటరోలా అదిరిపోయే గిఫ్ట్
  5. Amazon Great Summer Sale 2026 : రూ.10 వేల స్మార్ట్ స్పీకర్ కేవలం రూ.5 వేలకే.. పిచ్చెక్కిస్తున్న అమెజాన్ ఆఫర్లు
  6. Instagram : ఫొటో చూడగానే మాయమైపోతుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఇన్‌స్టెంట్ మ్యాజిక్
  7. HMD Vibe 2 : బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 5G ఫోన్.. 6000mAh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!
  8. Samsung : గూగుల్ జెమిని మాయాజాలం.. శామ్సంగ్ ఫోల్డ్ 8తో స్మార్ట్‌ఫోన్ చరిత్రే మారిపోతోంది
  9. Amazon Great Summer Sale 2026: అమెజాన్ సేల్‌లో డాష్‌క్యామ్‌లపై భారీ డిస్కౌంట్లు.. రూ.11 వేల వరకు ఆదా చేసే ఛాన్
  10. Amazon : అమెజాన్ సేల్‌లో సగం ధరకే బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు.. కరెంట్ ఆదా చేసే 5-స్టార్ మోడళ్లపై భారీ ఆఫర్లు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »