Meta Apps lost 2 Million users in 3 Months: మెటాకు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లో 2 కోట్ల మంది యూజర్లు జంప్

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్ కలిపి గత మూడు నెలల్లో ఏకంగా 20 మిలియన్ల (2 కోట్లు) డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయాయి

Meta Apps lost 2 Million users in 3 Months: మెటాకు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లో 2 కోట్ల మంది యూజర్లు జంప్
ముఖ్యాంశాలు
  • గత 3 నెలల్లో ఏకంగా 20 మిలియన్ల యూజర్లను కోల్పోయిన మెటా యాప్స్
  • ఇరాన్‌లో ఇంటర్నెట్ అంతరాయం, రష్యాలో వాట్సాప్‌పై ఆంక్షలు కారణం
  • యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి ఇన్‌స్టా అల్గారిథమ్‌లో భారీ మార్పులు
ప్రకటన

Meta Apps lost 2 Million users in 3 Months: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు గట్టి షాక్ తగిలింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్ కలిపి గత మూడు నెలల్లో ఏకంగా 20 మిలియన్ల (2 కోట్లు) డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వారం విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఈ విషయాన్ని అంగీకరించింది. గత ఏడాదితో పోలిస్తే యూజర్ల సంఖ్య 4 శాతం పెరిగినప్పటికీ, గత క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం వినియోగదారులు తగ్గిపోవడం మార్క్ జుకర్‌బర్గ్‌ను కలవరపెడుతోంది.

ఎందుకు ఈ పతనం? కారణాలేంటి?

యూజర్లు తగ్గిపోవడానికి మెటా ప్రధానంగా రెండు కారణాలను చెబుతోంది. ఒకటి ఇరాన్‌లో ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడటం, రెండోది రష్యాలో వాట్సాప్‌పై ఆంక్షలు విధించడం. అయితే, కేవలం ఇవే కాకుండా మన సోషల్ మీడియా ఫీడ్‌లో కనిపిస్తున్న కంటెంట్ క్వాలిటీ తగ్గిపోవడమే అసలు కారణమని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే ఒరిజినల్ కంటెంట్ కంటే కాపీ కొట్టిన వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయని, దీనివల్ల యూజర్లకు విసుగు పుడుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక కాపీ వీడియోలకు చెక్ 

యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు తన అల్గారిథమ్‌లో భారీ మార్పులు చేస్తోంది. ఇకపై ఎక్కడో చూసి కాపీ కొట్టిన కంటెంట్‌ను లేదా రీ పర్పస్డ్(వేరే చోటి నుంచి తెచ్చిన) వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ప్రోత్సహించదు. ఎవరైతే సొంతంగా వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తారో వారికే ఎక్కువ రీచ్ లభిస్తుంది. అలాగే ఏవైనా వెబ్‌సైట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనవసరంగా క్లిక్స్ సంపాదిస్తున్నా, వాటి రీచ్‌ను కూడా తగ్గించాలని మెటా నిర్ణయించింది. న్యూస్ విషయంలో కూడా పారదర్శకత లేని అకౌంట్లకు చెక్ పెట్టనున్నారు.

AI కోసం రూ.95 వేల కోట్ల పెట్టుబడి 

యూజర్లు తగ్గుతున్నా, మెటా తన ఏఐ ప్రయాణాన్ని మాత్రం వేగవంతం చేస్తోంది. ఈ ఏడాది ఏఐ పరిశోధనల కోసం అదనంగా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.94,947 కోట్లు) ఖర్చు చేయాలని జుకర్‌బర్గ్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఫ్యూచర్‌లో మెటా ఏఐ బిజినెస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు మరింత మెరుగుపడనున్నాయి. మరోవైపు, వాట్సాప్‌లో కూడా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మెసెంజర్ తరహా చాట్ బబుల్స్ ఫీచర్‌ను త్వరలోనే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
 



(हेडलाइन के अलावा, इस खबर को एनडीटीवी टीम ने संपादित नहीं किया है, यह सिंडीकेट फीड से सीधे प्रकाशित की गई है।)

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  2. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
  3. Google Pixel 11 Series Launch: ఆగస్టు 12న గూగుల్ మెగా ఈవెంట్.. నాలుగు మోడళ్లలో పిక్సెల్ 11 సిరీస్ లాంచ్
  4. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 399లకే బ్రాండెడ్ పవర్ బ్యాంక్‌లు
  5. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఊహించని ధమాకా.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
  6. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. రూ. 30 వేల బడ్జెట్‌లో టాప్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
  7. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. 43 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం.. 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు
  9. ITR Refund: ఐటీఆర్ రీఫండ్ కోసం చూస్తున్నారా? నిమిషాల్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా ?
  10. TVS Motor: టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ఐక్యూబ్, ఆర్బిటర్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »