గూగుల్ వార్డ్‌రోబ్ ఫీచర్ తో వర్చువల్‌గా ఏ డ్రెస్ మీకు సెట్ అవుతుందో మొబైల్‌లోనే చూసుకోవచ్చు.
Google Photos Wardrobe: ప్రతిరోజూ ఉదయం ఆఫీసుకో లేదా ఫంక్షన్‌కో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏం బట్టలు వేసుకోవాలి? అని తల పట్టుకునే వారికి గూగుల్ ఒక సూపర్ వార్త చెప్పింది. గూగుల్ ఫొటోస్ త్వరలో వార్డ్‌రోబ్ అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు బట్టలు మార్చుకునే శ్రమ లేకుండానే, వర్చువల్‌గా ఏ డ్రెస్ మీకు సెట్ అవుతుందో మొబైల్‌లోనే చూసుకోవచ్చు.
ఈ వార్డ్‌రోబ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. మీ గూగుల్ ఫొటోస్ లైబ్రరీలో ఉన్న పాత ఫొటోలను ఏఐ స్కాన్ చేస్తుంది. మీరు గతంలో వేసుకున్న షర్టులు, ప్యాంట్లు, డ్రెస్సులను గుర్తించి వాటన్నింటినీ విడివిడిగా ఒక డిజిటల్ లైబ్రరీలా మారుస్తుంది. అంటే మీ దగ్గర ఉన్న బట్టలన్నీ యాప్‌లో ఒక డిజిటల్ బీరువా లాగా కనిపిస్తాయి. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఫొటోలు దిగాల్సిన అవసరం లేదు, గూగుల్ ఏఐ తనంతట తానే మీ బట్టలను సెగ్రిగేట్ చేస్తుంది.
![]()
వార్డ్‌రోబ్ సెక్షన్‌లో ఉన్న క్రియేట్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు వేర్వేరు బట్టలను కలిపి కొత్త అవుట్‌ఫిట్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఒక పాత షర్టు మీదకు కొత్త ప్యాంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. కేవలం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్ ద్వారా ఆ బట్టలు మీ మీద ఎలా ఉన్నాయో ఒక స్నాప్‌షాట్ రూపంలో ఏఐ చూపిస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గెట్ రెడీ విత్ మీ వీడియోల లాగే, ఇది మీ పర్సనల్ ఏఐ ఫ్యాషన్ డిజైనర్‌లా మారుతుంది.
గూగుల్ ఈ ఫీచర్‌ను ఈ వేసవి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మొదట ఆండ్రాయిడ్ యూజర్లకు, ఆ తర్వాత ఐఓఎస్ వినియోగదారులకు ఇది లభిస్తుంది. ముఖ్యంగా రాబోయే మోటరోలా రేజర్ 2026 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా వస్తుందని సమాచారం. అయితే ఇది ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే ఉంటుందా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.
![]()
ప్రకటన
ప్రకటన
Moto Tag 2 With UWB Tracking, Over 600 Days of Battery Life Launched in Select Markets