YouTube : యూట్యూబ్ యూజర్లకు పండగే.. ఇక పిక్చర్-ఇన్-పిక్చర్ అందరికీ ఫ్రీ

యూట్యూబ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

YouTube : యూట్యూబ్ యూజర్లకు పండగే.. ఇక  పిక్చర్-ఇన్-పిక్చర్ అందరికీ ఫ్రీ

Youtube Picture in Picture Feature update

ముఖ్యాంశాలు
  • అందుబాటులోకి రానున్న యూట్యూబ్ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌
  • మ్యూజిక్ వీడియోలు మినహా, అన్ని లాంగ్-ఫార్మ్ మోడ్‌లో వీడియోలు
  • ప్రీమియం లైట్ మెంబర్లు కూడా నాన్-మ్యూజిక్ కంటెంట్‌ను PiPలో ఆస్వాదించవచ్చు
ప్రకటన

YouTube : యూట్యూబ్ చూస్తూనే వాట్సాప్‌లో చాటింగ్ చేయాలన్నా లేదా వేరే యాప్స్ వాడుకోవాలన్నా ఇప్పటివరకు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం లేదు.. యూట్యూబ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో ఈ సౌకర్యం అమెరికాలోని ఉచిత యూజర్లకు, ఇతర దేశాల్లో కేవలం ప్రీమియం సభ్యులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు రాబోయే కొద్ది నెలల్లో భారత్ సహా అన్ని దేశాల్లోని సాధారణ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) అంటే ఏమిటి?
మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు.. యాప్‌ను మినిమైజ్ చేసినా లేదా హోమ్ బటన్ నొక్కినా, ఆ వీడియో ఆగిపోకుండా స్క్రీన్ మీద ఒక చిన్న విండోలో ప్లే అవుతూనే ఉంటుంది. దీనినే PiP మోడ్ అంటారు. దీనివల్ల మీరు ఒక పక్క వీడియో చూస్తూనే మరోపక్క ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం, మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేసుకోవచ్చు. ఈ చిన్న విండోను మీరు స్క్రీన్ మీద ఎక్కడికైనా జరుపుకోవచ్చు.

ఎవరికి ఏది వర్తిస్తుంది?
యూట్యూబ్ నిబంధనల ప్రకారం.. ఈ గ్లోబల్ రోలవుట్‌లో కొన్ని పరిమితులు ఉన్నాయి. సాధారణ యూజర్లు మ్యూజిక్ వీడియోలు మినహా, మిగిలిన అన్ని రకాల లాంగ్-ఫార్మ్ వీడియోలను ఈ PiP మోడ్‌లో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యూజిక్ వీడియోలను కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. ప్రీమియం లైట్ మెంబర్లు కూడా నాన్-మ్యూజిక్ కంటెంట్‌ను PiPలో ఆస్వాదించవచ్చు.

మీ ఫోన్‌లో ఎలా ఆన్ చేసుకోవాలి?
ఈ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లలో పని చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
* ఆండ్రాయిడ్ యూజర్లు: ఫోన్ సెట్టింగ్స్ > యాప్స్ > యూట్యూబ్ > అడ్వాన్స్‌డ్ > పిక్చర్-ఇన్-పిక్చర్ లోకి వెళ్లి టాగల్ ఆన్ చేయాలి.
* యూట్యూబ్ యాప్ లో: సెట్టింగ్స్ > జనరల్ > పిక్చర్-ఇన్-పిక్చర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు ఈ ఫీచర్ వద్దనుకుంటే అక్కడే ఆఫ్ చేసే సదుపాయం కూడా ఉంది. వీడియోను పాజ్ చేసి యాప్ నుంచి బయటకు వస్తే PiP యాక్టివేట్ అవ్వదు.
 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »