వన్‌ప్లస్ నార్డ్ CE 6, వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ మోడళ్లను అధికారికంగా ప్రకటించింది
OnePlus Nord CE 6 supports 80W wired fast charging
OnePlus Nord CE 6, Nord CE 6 Lite Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇండియాలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త నార్డ్ సిరీస్ ఫోన్లను రంగంలోకి దించింది. గురువారం జరిగిన ఒక భారీ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 6, వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్లు కేవలం అందంగా ఉండటమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా భారీ బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ల డిజైన్ మరియు కెమెరా మాడ్యూల్‌లో కంపెనీ భారీ మార్పులు చేసింది.
వన్‌ప్లస్ నార్డ్ CE 6 మోడల్‌లో పాత వెర్షన్లలో ఉన్న పిల్ షేప్ కెమెరా డిజైన్‌ను పక్కన పడేసి, సరికొత్త స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను పరిచయం చేసింది. ఇది ఫోన్ కు ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. ఇక నార్డ్ CE 6 లైట్ విషయానికి వస్తే, CE 4 లైట్ తర్వాత వచ్చిన మొదటి లైట్ మోడల్ ఇదే కావడం విశేషం. ఈ రెండు ఫోన్లు కూడా సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై నడుస్తాయి.
![]()
వన్‌ప్లస్ నార్డ్ CE 6 బేస్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.29,999గా నిర్ణయించారు. 256GB మోడల్ ధర రూ.32,999గా ఉంది. ఇక బడ్జెట్ ప్రియుల కోసం తెచ్చిన 'నార్డ్ CE 6 లైట్' ప్రారంభ ధర రూ. 20,999 కాగా, హై-ఎండ్ వేరియంట్ ధర రూ. 25,999. అమెజాన్ మరియు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్లలో మే 8 నుండి నార్డ్ CE 6, మే 12 నుండి లైట్ మోడల్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఈ ఫోన్లలో హైలైట్ ఏమిటంటే వన్‌ప్లస్ నార్డ్ CE 6 లో ఉన్న 8,000mAh బ్యాటరీ. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో మూడు రోజుల వరకు నిశ్చింతగా ఉండవచ్చు. ఇక లైట్ మోడల్‌లో 7,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఈ రేంజ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు మార్కెట్లో చాలా తక్కువ.
![]()
నార్డ్ CE 6 లో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. లైట్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ చిప్‌సెట్, ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.
రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇచ్చారు. నార్డ్ CE 6 లో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండగా, లైట్ మోడల్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్, 10x డిజిటల్ జూమ్ వంటి ఫీచర్లు ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకుంటాయి. మొత్తానికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల బడ్జెట్‌లో ఆల్ రౌండర్ ఫోన్ కావాలనుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన
Moto Tag 2 With UWB Tracking, Over 600 Days of Battery Life Launched in Select Markets