ర్యామ్, స్టోరేజ్ చిప్స్ కొరత కారణంగా బడ్జెట్ ఫోన్లే కాదు, ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు కూడా రూ.6,000 వరకు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
Mobile Price Hike : కొత్త ఫోన్ కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు వన్‌ప్లస్, నథింగ్, రెడ్‌మీ, రియల్‌మీ తమ పాపులర్ ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ర్యామ్, స్టోరేజ్ చిప్స్ కొరత కారణంగా కంపెనీలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. కేవలం బడ్జెట్ ఫోన్లే కాదు, ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు కూడా రూ.6,000 వరకు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ధరలు పెరగడానికి అసలు కారణం ఏంటి?
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయలో ఉంది. ఈ ఏఐ టెక్నాలజీని నడపడానికి టెక్ దిగ్గజాలకు భారీ డేటా సెంటర్లు అవసరం. వీటికి కావలసిన హై-స్పీడ్ ర్యామ్, గ్రాఫిక్ చిప్‌లను తయారీదారులు ఎక్కువగా ఏఐ పరిశ్రమకే సరఫరా చేస్తున్నారు. దీనివల్ల సాధారణ స్మార్ట్‌ఫోన్లలో వాడే DRAM, NAND చిప్స్ కొరత ఏర్పడింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటంతో చిప్స్ ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చు పెరిగి, ఆ భారాన్ని కంపెనీలు కస్టమర్ల మీద వేస్తున్నాయి.
వన్‌ప్లస్ యూజర్లకు భారీ వాత
వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 15 ధరను ఏకంగా రూ.5,000 పెంచింది. లాంచ్ సమయంలో రూ.72,999 ఉన్న బేస్ వేరియంట్ ఇప్పుడు రూ.77,999 కి చేరింది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.85,999కి పెరిగింది. అలాగే వన్‌ప్లస్ 15R ధర కూడా రెండోసారి పెరిగి ప్రస్తుతం రూ.52,999 వద్ద ఉంది. అంటే లాంచ్ ప్రైస్ కంటే ఇది సుమారు రూ.5,000 ఎక్కువ అన్నమాట.
నథింగ్, రెడ్‌మీ పరిస్థితి ఏంటి?
నథింగ్ కంపెనీ కూడా తన నథింగ్ ఫోన్ 4a సిరీస్ ధరలను సవరించింది. నథింగ్ 4a ప్రో ధర ఇప్పుడు రూ.44,999 గా ఉండగా, సాధారణ 4a మోడల్ రూ.34,999 కి చేరింది. మరోవైపు, షియోమీ సబ్-బ్రాండ్ రెడ్‌మీ కూడా తన నోట్ 15 ప్రో సిరీస్ ధరలను పెంచింది. రెడ్‌మీ నోట్ 15 ప్రో+ ఇప్పుడు రూ.39,999 కి, నోట్ 15 ప్రో మోడల్ రూ.31,999 కి దొరుకుతున్నాయి. అంటే ప్రతి మోడల్ మీద సగటున రూ.2,000 వరకు భారం పడింది.
రియల్‌మీలో కూడా అదే బాట
రియల్‌మీ తన రియల్‌మీ 16 ప్రో సిరీస్ ధరలను కూడా భారీగా పెంచింది. రియల్‌మీ 16 ప్రో+ ధర రూ.39,999 నుంచి ఏకంగా రూ.44,999 కి పెరిగింది. అలాగే 16 ప్రో మోడల్ ధర రూ.36,999 కి చేరింది. ఇవే కాకుండా రియల్‌మీ సి85, 15ఎక్స్ వంటి బడ్జెట్ ఫోన్ల ధరలను కూడా రూ. 1,000 వరకు పెంచడం గమనార్హం. వివో, ఐకూ కంపెనీలు కూడా త్వరలో ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
| Model | New Price | Old Price |
|---|---|---|
| OnePlus | ||
| OnePlus 15 | Rs. 77,999 | Rs. 72,999 |
| OnePlus 15R | Rs. 52,999 | Rs. 50,499 |
| Nothing | ||
| Nothing Phone 4a Pro | Rs. 44,999 | Rs. 39,999 |
| Nothing Phone 4a | Rs. 34,999 | Rs. 31,999 |
| Redmi | ||
| Redmi Note 15 Pro+ | Rs. 39,999 | Rs. 37,999 |
| Redmi Note 15 Pro | Rs. 31,999 | Rs. 29,999 |
| Realme | ||
| Realme 16 Pro+ | Rs. 44,999 | Rs. 43,999 |
| Realme 16 Pro | Rs. 36,999 | Rs. 35,999 |
| Realme C85 5G | Rs. 20,999 | Rs. 19,999 |
| Realme 15x 5G | Rs. 23,999 | Rs. 22,999 |
| Realme 15T | Rs. 27,999 | Rs. 26,999 |
| Realme C71 | Rs. 11,999 | Rs. 10,999 |
ప్రకటన
ప్రకటన
Google's Android Show I/O Edition: How to Watch Livestream, What to Expect