ఎటువంటి ఆటంకం లేకుండా జెమిని ఏఐతో ముచ్చటించిన యూజర్లు, త్వరలోనే మధ్యలో యాడ్స్ చూడాల్సి రావచ్చు.
Google Gemini: టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ జెమిని యూజర్లకు ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా జెమిని ఏఐతో ముచ్చటించిన యూజర్లు, త్వరలోనే మధ్యలో యాడ్స్ చూడాల్సి రావచ్చు. గూగుల్ జెమిని యాప్‌లో త్వరలోనే కమర్షియల్ యాడ్స్ ప్రవేశపెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కంపెనీ త్రైమాసిక ఫలితాల సమావేశంలో గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.
గూగుల్ ఇప్పటికే తన సెర్చ్ రిజల్ట్స్‌లో ఏఐ ఓవర్‌వ్యూస్ కింద ప్రకటనలను చూపిస్తోంది. భారత్, అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఇది ఇప్పటికే అమలులో ఉంది. అయితే, ఇప్పుడు నేరుగా జెమిని యాప్‌లోనే కమర్షియల్స్ తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని గూగుల్ భావిస్తోంది. ఏఐ మోడ్‌లో సక్సెస్ అయిన యాడ్ ఫార్మాట్లను జెమిని యాప్‌లోకి కూడా సులభంగా బదిలీ చేయవచ్చని గూగుల్ ప్రతినిధులు భావిస్తున్నారు. జెమిని వృద్ధిలో ఈ ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తాయని కంపెనీ నమ్ముతోంది.
నిజానికి ఏఐ చాట్‌బాట్లలో ప్రకటనలు తీసుకురావడం గూగుల్ మాత్రమే చేస్తున్న పని కాదు. సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ ఇప్పటికే తన చాట్ జీపీటీలో యాడ్స్‌ను ప్రవేశపెట్టింది. అమెరికాలోని ఫ్రీ యూజర్లకు చాట్ జీపీటీలో యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే బాటలో నడుస్తూ తన ఏఐ అసిస్టెంట్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని చూస్తోంది. అయితే ఈ ప్రకటనలు ఏఐ ఇచ్చే సమాధానాలను ప్రభావితం చేయవని టెక్ కంపెనీలు చెబుతున్నప్పటికీ, యూజర్ల అనుభవంపై మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది.
జెమిని యాప్ వాడుతున్నప్పుడు మనం చేసే సంభాషణలు రికార్డ్ అవుతాయా? వాటిని గూగుల్ శాశ్వతంగా ఉంచుకుంటుందా? అనే సందేహాలు యూజర్లలో ఉన్నాయి. గూగుల్ తన జెమిని అసిస్టెంట్‌ను మరింత మెరుగుపరిచే క్రమంలో డేటాను వాడుకుంటున్నప్పటికీ, యూజర్లు తమ హిస్టరీని డిలీట్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తోంది. అయితే, భవిష్యత్తులో యాడ్స్ వస్తే మనం అడిగే ప్రశ్నల ఆధారంగానే ఆ ప్రకటనలు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం జెమిని యాప్ కొత్త రూపంలో రాబోతోంది. మరింత బ్రైట్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే లేఅవుట్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. అంతేకాకుండా, జెమిని ద్వారా ఫైల్స్ జనరేట్ చేయడం, వాటిని నేరుగా ఎక్స్ పోర్ట్ చేసుకునే సదుపాయాన్ని కూడా గూగుల్ మెరుగుపరిచింది. గూగుల్ వర్క్‌స్పేస్ అప్‌గ్రేడ్ల ద్వారా జెమిని సామర్థ్యాన్ని పెంచేందుకు గూగుల్ నిరంతరం కృషి చేస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung’s Next Galaxy Unpacked Event Date Leaked; New Smart Glasses Could Launch Alongside Galaxy Z Series