Samsung Galaxy A56 5G Price Drop: శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A56 5G ధర

Get Rs 7,000 Discount on Samsung Galaxy A56 5G in Amazon India Now: శాంసంగ్ గెలాక్సీ ఏ56 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 8GB రామ్, 256GB భారీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‎తో పాటు శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.34,999 ప్రారంభ ధరకే లిస్ట్ చేశారు.

Samsung Galaxy A56 5G Price Drop: శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన  శాంసంగ్ గెలాక్సీ A56 5G ధర

Samsung Galaxy A56 5G

ముఖ్యాంశాలు
  • శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  • భారీగా తగ్గిన ‘Samsung Galaxy A56 5G’ ధర
  • లాంచ్ ప్రైస్ కంటే రూ. 7,000 తక్కువకే సొంతం చేసుకోండి
ప్రకటన

Get Rs 7,000 Discount on Samsung Galaxy A56 5G in Amazon India now: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తన ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఏ56 5జీ పై కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన డీల్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ మొదట రూ.41,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ అయింది. ఆ తర్వాత కంపెనీ దీని ధరను కొద్దిగా తగ్గించినప్పటికీ.. ఇటీవల కాలంలో మొబైల్ మార్కెట్లో ఫోన్ల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ఫోన్ రేటు మళ్లీ రూ.40,999కి చేరింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లాంచ్ ధర కంటే ఏకంగా రూ.7,000 తక్కువ ధరకే ఇప్పుడు లభిస్తోంది.

రూ. 34,999 కే అమెజాన్‌లో లిస్టింగ్..

శాంసంగ్ గెలాక్సీ ఏ56 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 8GB రామ్, 256GB భారీ స్టోరేజ్ వేరియంట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‎తో పాటు శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.34,999 ప్రారంభ ధరకే లిస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి డైరెక్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు లేనప్పటికీ, కస్టమర్ల సౌకర్యార్థం ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా నెలవారీ సులభ వాయిదాలలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌తో అదనపు క్యాష్‌బ్యాక్..

ఒకవేళ మీ వద్ద గనుక స్పెషల్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే, మీకు ఇంకాస్త అదనపు లాభం చేకూరుతుంది. ఈ కార్డ్ ద్వారా ఫుల్-స్వైప్ ట్రాన్సాక్షన్  చేసి ఫోన్ కొనుగోలు చేస్తే.. కస్టమర్లకు ఫ్లాట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే దాదాపు రూ.1,750 వరకు అదనంగా డబ్బులు ఆదా అవుతాయి. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కలుపుకుంటే ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే లభిస్తుందని చెప్పాలి. ప్రీమియం లుక్, బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి ఈ ధరలో ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఎక్సినోస్ ప్రాసెసర్..

ఫీచర్ల పరంగా చూస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ56 5జీ స్మార్ట్‌ఫోన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో 1080 x 2340 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.7 ఇంచుల Full HD+ Super AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ స్వంత  ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా, ధూళి, నీటి నుంచి ఫోన్‌కు రక్షణ కల్పించడానికి ఇందులో ఐపీ67 రేటింగ్‌ను కూడా అందించారు.

Phone Under Rs.30,000 : రూ.30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్? మోటో G77 పవర్, వన్‌ప్లస్ నార్డ్, ఐకూ Z10R ల మధ్య అసలైన ఫైట్

50ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్..

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు అద్భుతమైన కెమెరాలను అమర్చారు. f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, f/2.4 అపెర్చర్‌తో కూడిన 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా లో-లైట్‌లో కూడా మంచి క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో f/2.2 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G, 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి అన్ని రకాల లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »