Best Selling Smart Phone Globally 2026 Q1: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 17 ప్రభంజనం... ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానం

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో 2026 మొదటి త్రైమాసికంలో (Q1) ఐఫోన్ 17, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

Best Selling Smart Phone Globally 2026 Q1: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 17 ప్రభంజనం... ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానం
ముఖ్యాంశాలు
  • ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అగ్రస్థానంలో ఐఫోన్
  • శాంసంగ్ గెలాక్సీ ఏ07 4G అత్యధిక అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది
  • షావోమీకి చెందిన రెడ్‌మి రెడ్‌మి ఏ5 పదో స్థానంలో నిలిచింది
ప్రకటన

Best Selling Smart Phone Globally 2026 Q1: ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫోన్ ఒక్కటే మార్కెట్‌లో 6 శాతం వాటాను సొంతం చేసుకోవడం విశేషం. ఐఫోన్ 17 సిరీస్‌లో వచ్చిన ప్రో మోషన్ డిస్‌ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఐఫోన్ 17 తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో నిలిచి యాపిల్ సత్తాను చాటాయి.

టాప్ 10లో శాంసంగ్ మెజారిటీ 

మొత్తం అమ్మకాల జాబితాను పరిశీలిస్తే.. టాప్ 10లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఐదు మోడళ్లు చోటు సంపాదించుకున్నాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. శాంసంగ్ నుంచి కేవలం బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్లు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ఆండ్రాయిడ్ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ ఏ07 4G అత్యధిక అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచి, టాప్ ఆండ్రాయిడ్ ఫోన్‌గా రికార్డు సృష్టించింది. దీని తర్వాత గెలాక్సీ ఏ17 5G తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్26 ఆల్ట్రా మాత్రం కొద్దిలో టాప్ 10 స్థానాన్ని కోల్పోయింది.

రెడ్‌మి బడ్జెట్ ఫోన్‌కు మంచి డిమాండ్

యాపిల్, శాంసంగ్ కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మి. ఆ కంపెనీ నుంచి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్  రెడ్‌మి ఏ5 పదో స్థానంలో నిలిచింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వర్ధమాన దేశాల మార్కెట్లలో ఈ ఫోన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొత్తం మీద టాప్ 10 స్మార్ట్‌ఫోన్లలో నాలుగు ఐఫోన్ మోడళ్లు ఉండగా, ఐదు శాంసంగ్ ఫోన్లు, ఒకటి రెడ్‌మి ఫోన్ ఉన్నాయి. యాపిల్ ఫోన్లు ప్రీమియం విభాగంలో రాజ్యమేలుతుంటే, బడ్జెట్ విభాగంలో శాంసంగ్ తన పట్టును నిరూపించుకుంది.

ఐఫోన్ 17 సక్సెస్ వెనుక కారణాలివే 

ఐఫోన్ 17 ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి అందులో చేసిన మార్పులే ప్రధాన కారణం. పాత మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 17లో హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్, డ్యూయల్ 48 మెగాపిక్సెల్ కెమెరా యూనిట్, ప్రో మోడల్స్‌లో ఉండే సెల్ఫీ కెమెరాను అందించారు. దీనివల్ల సాధారణ కస్టమర్లు కూడా ప్రో ఫీచర్లను తక్కువ ధరలో అనుభవించే అవకాశం దక్కింది. ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఇచ్చే డిస్కౌంట్లు కూడా ఈ అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లు తమ బ్యాటరీ లైఫ్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కారణంగా మిడ్-రేంజ్ వినియోగదారుల ఫేవరెట్‌గా మారాయి.

#తాజా కథనాలు
  1. YouTube : యూట్యూబ్ యూజర్లకు పండగే.. ఇక పిక్చర్-ఇన్-పిక్చర్ అందరికీ ఫ్రీ
  2. Mobile Price Hike : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు
  3. Flipkart Sasa Lele Sale 2026: ఫ్లిప్‌కార్ట్ సాసా లెలే సేల్ వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌లపై కనీవినీ ఎరుగని ఆఫర్లు
  4. Best Selling Smart Phone Globally 2026 Q1: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ 17 ప్రభంజనం... ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్ అగ్రస్థానం
  5. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ వచ్చేస్తోంది..సగానికి తగ్గిన ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు
  6. Flipkart Summer Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా.. మోటరోలా, ఒప్పో, రియల్‌మీ ఫోన్ల ధరలు భారీగా డౌన్
  7. OnePlus Summer Sale 2026 : వన్‌ప్లస్ సమ్మర్ సేల్ ధమాకా.. అదిరిపోయే ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్లు
  8. Nothing CMF Watch 3 Pro : నథింగ్ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌వాచ్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
  9. ChatGPT : ఓపెన్ ఏఐపై క్రిమినల్ ఎంక్వయిరీ.. షూటింగ్‌కు ప్లాన్ వేయడానికి ChatGPT సాయం చేసిందా..?
  10. iPhone 18 Pro: శామ్సంగ్ & ఇతరేతర కంపెనీలకు పెద్ద దెబ్బేసిన యాపిల్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »