OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?

కేవలం ఒక గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటన.. ఒక అమ్మాయి జీవితాన్ని, ఆమె మానసిక స్థితిని ఎలా మార్చేసిందనే వింతైన సైకలాజికల్ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది.

OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?

Photo Credit: Sun NXT

Face is landing on May 29, 2026, on Sun NXT.

ముఖ్యాంశాలు
  • మే 29 నుంచి Sun NXTలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ఫేసెస్
  • కాళేష్ రామానంద్, హన్నా రెజీ కోషి నటనతో పాటు గోపీ సుందర్ బీజీఎం
  • ప్రతి మగాడిలో తన ప్రియుడు మైఖేల్ మొహమే కనిపించడం ఈ మూవీకి ప్రధాన ట్విస్ట్
ప్రకటన

OTT Movie : సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ సైకోలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. కథలో ఉండే ఊహించని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టేసేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఒక విలక్షణమైన, మైండ్ బ్లోయింగ్ కథాంశంతో థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఒక సరికొత్త సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అదే ఫేసెస్. కేవలం ఒక గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటన.. ఒక అమ్మాయి జీవితాన్ని, ఆమె మానసిక స్థితిని ఎలా మార్చేసిందనే వింతైన సైకలాజికల్ పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది.

ఈ మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ సరిగ్గా ఈ రోజు (మే 29, 2026) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‎లో అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఒరిజినల్‌గా మలయాళ భాషలో నిర్మించినప్పటికీ.. ఇప్పుడు సౌత్ ఆడియన్స్ కోసం తమిళ భాషలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా కథ మొత్తం నిత్య అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక ఘోరమైన గ్యాస్ పేలుడు ప్రమాదంలో నిత్య తలకు తీవ్రమైన గాయం అవుతుంది. దీంతో ఆమె గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మర్చిపోవడంతో పాటు తీవ్రమైన పీటీఎస్‌డీ (PTSD - పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) బారిన పడుతుంది. అయితే, ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మైఖేల్ హఠాత్తుగా మాయమైపోతాడు. ఆ తర్వాత నిత్యకు ఒక వింతైన సైకలాజికల్ కండిషన్ ఏర్పడుతుంది. ఆమె రోడ్డు మీద లేదా బయట ఏ మగాడిని చూసినా.. వాళ్లందరిలోనూ తన ప్రియుడు మైఖేల్ మొహమే కనిపిస్తూ ఉంటుంది.

Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్



అసలు తన ప్రియుడు మైఖేల్ ఏమయ్యాడు? తనకు ఎందుకు అందరిలోనూ అతనే కనిపిస్తున్నాడు? అనే సత్యాలను తెలుసుకోవడానికి నిత్య రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆనాడు జరిగిన గ్యాస్ పేలుడు ప్రమాదం వెనుక కొందరు పెద్ద పెద్ద మనుషులు చేసిన భయంకరమైన కుట్రలు, రహస్యాలు బయటపడతాయి. అయితే, ఈ నిజాలు తెలుసుకునే లోపే ఆమె ఒక ఊహించని పెద్ద ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకుపోతుంది. ఆ ఉచ్చు నుంచి నిత్య ఎలా బయటపడింది? చివరకు మైఖేల్ బతికే ఉన్నాడా లేదా అనేది మిగతా కథ.

ఈ మైండ్ గేమ్ సైకోలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో కాళేష్ రామానంద్, హన్నా రెజీ కోషి ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిద్దరి నటన, ముఖ్యంగా హన్నా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. నీలేష్ ఇ. కె. ఈ చిత్రానికి అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా డైరెక్ట్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్ లెవెల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. శ్రీ అంగళమ్మన్ ఫిల్స్ బ్యానర్‌పై మురుగేషన్ ఇ., రోచ్ అరోకియారాజ్ కేకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా.. ప్రస్తుతం ఐఎమ్‌డీబీలో ఏకంగా 8.9/10 రేటింగ్‌తో దూసుకుపోతోంది.

#తాజా కథనాలు
  1. OTT Movie : కులాల గొడవలు, ఊరి పెద్దల అక్రమాలు.. వీటి వెనుక నిజాలు తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే !
  2. OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?
  3. Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్
  4. Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!
  5. Realme 16T 5G : ఏకంగా 8000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చిన రియల్‌మి కొత్త ఫోన్..చార్జర్లకు కాలం చెల్లినట్లేనా..?
  6. ఇంట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్.. అమెజాన్ తెచ్చిన ఆ రెండు వింత గ్యాడ్జెట్ల వెనుక అసలు సీక్రెట్ ఇదే..
  7. Jio Plan : జియో యూజర్లకు అంబానీ బంపర్ ఆఫర్.. రూ.200 రీఛార్జ్‌తో మొత్తం 15 ఓటీటీలు ఫ్రీ
  8. Xiaomi : మొబైల్ మార్కెట్లో వింత బ్యాటరీ.. షావోమి కొత్త ఫోన్ వెనుక దాగున్న అసలు సీక్రెట్ ఇదే..!
  9. OTT : రూ.పది నోటు కోసం ఇన్ని హత్యలా..? సైలెంటుగా ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ..!
  10. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »