జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ జియో ఓటీటీ పాస్ ధర కేవలం రూ.200 మాత్రమే. దీని వాలిడిటీ 28 రోజులుగా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు సుమారు రూ.1,500 విలువ కలిగి ఉంటాయని జియో అధికారికంగా ప్రకటించింది.
Photo Credit: Jio
Jio's new plan only includes OTT and data benefits
Jio Plan : టెలికాం రంగంలో ఎప్పటికప్పుడు సంచలన ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునే దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మరోసారి మార్కెట్‌ను షేక్ చేసే అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా ప్రియులు, ఇంటర్నెట్ ఎక్కువగా వాడే యూజర్ల కోసం బుధవారం రోజున ఒక ఊహించని సరికొత్త ధమాకా ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే జియో ఓటీటీ పాస్. సాధారణంగా విడివిడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో.. జియో కేవలం టీ కప్పు ధరకే ఏకంగా 15 ప్రీమియం ఓటీటీలతో పాటు ఉచిత డేటాను అందిస్తూ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, లోపల దాగున్న అసలు విషయాలు తెలుసుకుందాం.
జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ జియో ఓటీటీ పాస్ ధర కేవలం రూ.200 మాత్రమే. దీని వాలిడిటీ 28 రోజులుగా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు సుమారు రూ.1,500 విలువ కలిగి ఉంటాయని జియో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సరికొత్త ప్యాక్ మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్, రీటైల్ స్టోర్లతో పాటు థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్స్ అయిన ఫోన్‌పే, గూగుల్‌పే లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
ఈ ప్లాన్ విషయంలో యూజర్లు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇది ఒక యాడ్-ఆన్ ప్లాన్ మాత్రమే. అంటే, మీ మొబైల్‌లో ఈ రూ.200 ఓటీటీ పాస్ పని చేయాలి అంటే.. మీ నంబర్‌పై ముందే ఏదో ఒక బేస్ ప్లాన్ (కాలింగ్, డైలీ డేటా ఉండే ప్లాన్) యాక్టివ్‌గా ఉండాలి. అంతేకాకుండా, ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి ఉచిత వాయిస్ కాలింగ్ లేదా డైలీ ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభించవు. కేవలం ఓటీటీలు, లైవ్ టీవీ, అదనపు డేటా కోసమే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ ప్లాన్ కొంటే మీకు లభించే ఓటీటీల లిస్ట్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో సరికొత్త జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ప్రైమ్ వీడియో లభిస్తాయి. వీటికి తోడు జియోటీవీ యాప్ ద్వారా సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్ కోడ్, చౌపాల్, హోయ్‌చోయ్ లాంటి మరో 12 పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ ఉచితంగా వస్తాయి. అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులో యాడ్స్ లేకుండా వీడియోలు చూసుకునేందుకు వీలుగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా బండిల్ చేసి ఇచ్చారు. దీనివల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు.
ఓటీటీ కంటెంట్ మాత్రమే కాకుండా.. టీవీ సీరియల్స్, వార్తలు చూసేవారి కోసం జియోటీవీ ద్వారా ఏకంగా 1,000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్ల యాక్సెస్‌ను ఈ ప్లాన్ ద్వారా కల్పించారు. ఇందులో 150 కి పైగా పెయిడ్ ఛానళ్లు ఉన్నాయి. జియోస్టార్, సోనీ, సన్ టీవీ నెట్‌వర్క్, ఈటీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి పెద్ద పెద్ద బ్రాడ్ కాస్టర్లకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్, సినిమాలు, స్పోర్ట్స్, కిడ్స్, రీజినల్ ఛానళ్లను ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్ లోనే లైవ్‌గా వీక్షించవచ్చు.
వినోదంతో పాటు ఇంటర్నెట్ ప్రియుల కోసం జియో ఈ ప్యాక్ ద్వారా 30GB హై-స్పీడ్ 4G/5G డేటాను అదనంగా ఇస్తోంది. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ ఉండి, మీ దగ్గర 5G మొబైల్ ఉంటే.. అర్హత గల యూజర్లందరికీ ఈ 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5G డేటా ఉచితంగా లభిస్తుంది. కాబట్టి రోజువారీ డేటా లిమిట్ అయిపోయినా సరే.. ఎలాంటి బఫరింగ్ లేకుండా హై క్వాలిటీలో సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999