Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్

టెక్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. ల్యాప్‌టాప్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒకే పరికరంలో రెండు పూర్తి స్థాయి భారీ స్క్రీన్లను అమర్చి అసూస్ సరికొత్త సంచలనానికి తెరలేపింది.

Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్

Photo Credit: Asus

Asus ROG Zephyrus Duo (2026) GX651 has a 90Wh battery

ముఖ్యాంశాలు
  • తొలి డ్యూయల్ 16-ఇంచ్ 3K OLED స్క్రీన్‌లతో వస్తున్న Asus ROG Zephyrus Duo
  • ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. విడదీయగలిగే వింత కీబోర్డ్ మ్యాజిక్
  • ఏకంగా Nvidia GeForce RTX 5090 GPU, Intel Core Ultra 9 386H ప్రాసెసర్
ప్రకటన

Asus :  టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో యూజర్లను ఆశ్చర్యపరిచే ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ అసూస్.. గేమింగ్ ప్రియుల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ ల్యాప్‌టాప్‌ను సిద్ధం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రపంచానికి పరిచయమైన అసూస్ ఆర్‌ఓజీ జెఫైరస్ డ్యూఓ (2026) GX651 ల్యాప్‌టాప్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. టెక్ వర్గాల నుంచి లీకైన సమాచారం ప్రకారం.. ల్యాప్‌టాప్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒకే పరికరంలో రెండు పూర్తి స్థాయి భారీ స్క్రీన్లను అమర్చి అసూస్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. దీనికి సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్,  భారత్‌లో ఉండబోయే షాకింగ్ ధర వివరాలు ఇప్పుడు లీకయ్యాయి.

ప్రముఖ టెక్ వెబ్‌సైట్ స్మార్ట్‌ప్రిక్స్, ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన తాజా లీక్స్ ప్రకారం.. అసూస్ ఆర్‌ఓజీ జెఫైరస్ డ్యూఓ GX651 ల్యాప్‌టాప్ జూన్ చివరి నాటికి భారతదేశంలో అధికారికంగా విక్రయానికి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ 16-ఇంచ్ స్క్రీన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ డివైజ్ కోసం దేశీయ గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ ల్యాప్‌టాప్ ధర సామాన్యులకు అందుబాటులో ఉండేలా లేదు. అమెరికా మార్కెట్లో దీని ధర సుమారు $5,500 డాలర్లు (మన దేశీ కరెన్సీలో దాదాపు రూ.5,26,000) గా ఉంది. భారతదేశానికి వచ్చేసరికి దిగుమతి సుంకాలు, పన్నులు  అన్నీ కలుపుకొని దీని ధర దాదాపు రూ.5,30,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై అసూస్ కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో రెండు 16 ఇంచుల ఆర్‌ఓజీ నెబ్యులా హెచ్‌డీఆర్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేలను అమర్చారు. ఇవి 3K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అధునాతన ఓఎల్ఈడీ  ప్యానల్స్. యాంటీ గ్లేర్ కోటింగ్ ఉన్న ఈ డిస్‌ప్లేలు స్టైలస్ పెన్, టచ్ ఇన్‌పుట్‌ను సపోర్ట్ చేస్తాయి. విశేషం ఏంటంటే.. దీని బ్లూటూత్ వైర్‌లెస్ కీబోర్డ్‌ను ల్యాప్‌టాప్ నుండి పూర్తిగా విడదీసి కూడా వాడుకోవచ్చు. మనం స్క్రీన్‌ను ఓపెన్ చేయగానే లోపల ఉన్న రెండో స్క్రీన్ ఆటోమేటిక్‌గా పైకి లేచి అద్భుతమైన మల్టీటాస్కింగ్ అనుభూతిని ఇస్తుంది.

 

Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!

పర్ఫార్మెన్స్ పరంగా ఈ ల్యాప్‌టాప్‌ను ఒక పవర్‌హౌస్‌లా మార్చేశారు. ఇందులో లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రొసెసర్ 386Hను వాడారు. ఇందులో ఉండే ఇన్-బిల్ట్ ఎన్‌పీయూ ఏకంగా 50 TOPS వరకు ఏఐ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీనికి తోడు గ్రాఫిక్స్ కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 24GB GDDR7 VRAM కలిగిన  ఎన్‌విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 ల్యాప్‌టాప్ జీపీయూని జత చేశారు. ఇది విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో ఏకంగా 64GB LPDDR5x ర్యామ్, 2TB PCIe 5.0 NVMe ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. విండోస్ హెల్లో ఫేషియల్ రికగ్నిషన్ కోసం 1080p ఫుల్ హెచ్‌డీ ఐఆర్ కెమెరా ఉంది. ఆడియో విషయానికి వస్తే.. ఇందులో రెండు ట్వీటర్లు, నాలుగు వూఫర్లతో కూడిన 6-స్పీకర్ల సిస్టమ్‌ను అమర్చారు. ఇది వైఫై 7, బ్లూటూత్ 6.0 వంటి అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఇందులో 90Wh సామర్థ్యం గల బ్యాటరీ, 250W అడాప్టర్‌ను రక్షణగా ఇచ్చారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »