Xiaomi : మొబైల్ మార్కెట్లో వింత బ్యాటరీ.. షావోమి కొత్త ఫోన్ వెనుక దాగున్న అసలు సీక్రెట్ ఇదే..!

. గ్లోబల్ మార్కెట్లో గురువారమే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన షావోమి 17T సిరీస్.. వచ్చే నెల ప్రారంభంలోనే అధికారికంగా భారత గడ్డపై ల్యాండ్ కాబోతోంది

Xiaomi : మొబైల్ మార్కెట్లో వింత బ్యాటరీ.. షావోమి కొత్త ఫోన్ వెనుక దాగున్న అసలు సీక్రెట్ ఇదే..!

Photo Credit: Xiaomi

Xiaomi 17T series will sport a flat rear panel

ముఖ్యాంశాలు
  • షావోమి 17T ఫోన్ లో ఏకంగా 120x జూమ్ కెమెరా
  • 6,500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ.. కళ్ల ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్షన్
  • ఒక్కసారి చార్జ్ చేస్తే 9.5 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వీడియో రికార్డింగ్
ప్రకటన

Xiaomi : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రియులు కేవలం బ్రాండ్ మాత్రమే కాదు.. లోపల ఉండే కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్‌ను కూడా నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి అంచనాలతో ఉన్న కస్టమర్ల కోసం గ్లోబల్ టెక్ జెయింట్ షావోమి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో గురువారమే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన  షావోమి 17T సిరీస్.. వచ్చే నెల ప్రారంభంలోనే అధికారికంగా భారత గడ్డపై ల్యాండ్ కాబోతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ మైక్రోసైట్ అప్‌డేట్ అవ్వడమే కాకుండా.. ఊహించని రేంజ్ ఫీచర్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఒక వారం రోజుల తర్వాత.. అంటే సరిగ్గా జూన్ 4వ తేదీన షావోమి 17T స్టాండర్డ్ మోడల్ భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ఈ ల్యాండ్‌మార్క్ ఫోన్‌ను కస్టమర్లు అమెజాన్ ఇండియా, షావోమి అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చని కంపెనీ ధృవీకరించింది. షావోమి 17 లైనప్‌లోని ఇతర మోడల్స్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చినప్పటికీ.. ఈ సరికొత్త 17T సిరీస్‌లో మాత్రం కంపెనీ రూట్ మార్చింది. షావోమి 17T ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇదే పవర్‌ఫుల్ చిప్‌సెట్ త్వరలో రాబోయే రెడ్‌మి టర్బో 5 ఫోన్‌లో కూడా ఉండటం విశేషం. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఈ ప్రొసెసర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ ఏంటంటే.. ఇందులో సాధారణ బ్యాటరీ కాకుండా సరికొత్త టెక్నాలజీతో కూడిన 6,500mAh భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. స్క్రీన్ నుంచి వచ్చే హానికరమైన కాంతి నుంచి కళ్లను కాపాడటానికి TUV రైన్‌ల్యాండ్‎లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ, సర్కాడియన్ ఫ్రెండ్లీ,  ఇంటెలిజెంట్ ఐ కేర్ సర్టిఫికేషన్లను ఇచ్చారు. పంచ్-హోల్ డిజైన్‌తో కూడిన అద్భుతమైన స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇందులో మనకు దక్కుతుంది.

ఫోటోగ్రఫీని ప్రాణంగా ప్రేమించే వారి కోసం ఇందులో ప్రొఫెషనల్ లైకా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. దీని వెనుక భాగంలో ఉండే టెలిఫోటో కెమెరా ద్వారా 5x ఆప్టికల్ జూమ్, 10x ఆప్టికల్ క్వాలిటీ జూమ్‌తో పాటు.. ఆకాశంలోని చందమామను కూడా దగ్గరగా చూసేలా ఏకంగా 120x డిజిటల్ జూమ్ ఫీచర్‌ను అందించడం ఆటోమొబైల్, టెక్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

స్టాండర్డ్ మోడల్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ అయిన  షావోమి 17T ప్రో ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో 3nm ప్రాసెస్‌పై తయారైన ఫ్లాగ్‌షిప్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను వాడారు. అంతేకాదు, ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఈ ప్రో మోడల్‌లో ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 9.5 గంటల పాటు నిరంతరాయంగా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని షావోమి గట్టిగా ఛాలెంజ్ చేస్తోంది.

#తాజా కథనాలు
  1. OTT Movie : కులాల గొడవలు, ఊరి పెద్దల అక్రమాలు.. వీటి వెనుక నిజాలు తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే !
  2. OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?
  3. Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్
  4. Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!
  5. Realme 16T 5G : ఏకంగా 8000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చిన రియల్‌మి కొత్త ఫోన్..చార్జర్లకు కాలం చెల్లినట్లేనా..?
  6. ఇంట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్.. అమెజాన్ తెచ్చిన ఆ రెండు వింత గ్యాడ్జెట్ల వెనుక అసలు సీక్రెట్ ఇదే..
  7. Jio Plan : జియో యూజర్లకు అంబానీ బంపర్ ఆఫర్.. రూ.200 రీఛార్జ్‌తో మొత్తం 15 ఓటీటీలు ఫ్రీ
  8. Xiaomi : మొబైల్ మార్కెట్లో వింత బ్యాటరీ.. షావోమి కొత్త ఫోన్ వెనుక దాగున్న అసలు సీక్రెట్ ఇదే..!
  9. OTT : రూ.పది నోటు కోసం ఇన్ని హత్యలా..? సైలెంటుగా ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ..!
  10. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »