Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ

టాప్-ఎండ్ మోడల్ ఒప్పో Find X9 Ultra (12GB ర్యామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.1,69,999 గా ఉంది.

Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra has a quad rear camera setup

ముఖ్యాంశాలు
  • ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్లు Find X9 అల్ట్రా, Find X9s సేల్
  • 200MP కెమెరా, 7050mAh బ్యాటరీ ధర రూ.1,69,999
  • 10x ఆప్టికల్ జూమ్ కూడా
ప్రకటన

Oppo : ఎప్పుడెప్పుడా అని స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న ఒప్పో ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఒప్పో Find X9 అల్ట్రా, ఒప్పో Find X9sల విక్రయాలు భారతదేశంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. నిజానికి ఈ ఫోన్ల అమ్మకాలు మే 28 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది, కానీ కస్టమర్ల నుంచి వచ్చిన భారీ ప్రి-బుకింగ్స్ డిమాండ్ కారణంగా ఒప్పో సంస్థ రెండు రోజుల ముందే.. అంటే మే 26 నుంచే వీటిని మార్కెట్లోకి తెచ్చింది. హాసెల్‌బ్లాడ్ పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీలతో వచ్చిన ఈ ప్రీమియం ఫోన్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్లతో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే.. టాప్-ఎండ్ మోడల్ ఒప్పో Find X9 Ultra (12GB ర్యామ్ + 512GB స్టోరేజ్) ధర రూ.1,69,999 గా ఉంది. ఇక ఒప్పో Find X9s మోడల్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.79,999 కాగా, 12GB + 512GB వేరియంట్ ధర రూ.89,999 గా కంపెనీ నిర్ణయించింది.

ఒప్పో Find X9 Ultra కెమెరా విభాగంలో ఒక అద్భుతమనే చెప్పాలి. ఇందులో వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT-901 సెన్సార్ తో పాటు 50MP అల్ట్రా-వైడ్, 3x జూమ్ గల 200MP టెలిఫోటో లెన్స్, ఏకంగా 10x జూమ్ సపోర్ట్ చేసే 50MP అల్ట్రా-టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. మరోవైపు, Find X9s మోడల్‌లో 50MP సోనీ LYT-700 ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలోని కెమెరాలను ప్రముఖ లెన్స్ తయారీ సంస్థ హాసెల్‌బ్లాడ్ ప్రత్యేకంగా ట్యూన్ చేసింది.

ఇక పవర్ విషయానికి వస్తే, ఒప్పో Find X9 Ultra లో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీ ని అమర్చారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Find X9s లో 7,025mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.

 

Vivo : ఆడియో మార్కెట్లోకి వివో ఎంట్రీ.. ఒకేసారి 3 డివైజ్ కనెక్ట్ అయ్యే సరికొత్త హెడ్‌ఫోన్స్

సాఫ్ట్‌వేర్ పరంగా ఇవి ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతాయి. అల్ట్రా మోడల్‌లో అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్‌సెట్ ఉండగా.. X9s మోడల్‌లో మీడియాటెక్ డెమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నీటిలో పడినా ఏమీ కాకుండా వీటికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి.

ఈ ఫోన్లను ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే నెలకు రూ.8,889 నుంచి ప్రారంభమయ్యే 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. వీటితో పాటు 3 నెలల ఉచిత గూగుల్ AI ప్రో యాక్సెస్ (5TB స్టోరేజ్), రూ.35,100 విలువైన రిలయన్స్ జియో బెనిఫిట్స్ కస్టమర్లకు అదనంగా లభిస్తాయి.

#తాజా కథనాలు
  1. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
  2. Vivo : ఆడియో మార్కెట్లోకి వివో ఎంట్రీ.. ఒకేసారి 3 డివైజ్ కనెక్ట్ అయ్యే సరికొత్త హెడ్‌ఫోన్స్
  3. Realme : మార్కెట్లోకి రియల్‌మీ మరో కొత్త 5G అస్త్రం.. జూన్‌లో రియల్‌మీ P4s 5G గ్రాండ్ ఎంట్రీ
  4. Samsung : శాంసంగ్ వినియోగదారులకు పండగే.. పాత ఫోల్డబుల్ మొబైల్స్‌లోకి ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్
  5. Oppo : అఫీషియల్ ఎంట్రీ.. రూ.13,999 ధరకే ఒప్పో కొత్త 4G ఫోన్ వచ్చేసింది
  6. Smartphone Comparison : రియల్‌మీ 16T, వన్‌ప్లస్ నార్డ్ CE 6, మోటో ఎడ్జ్ 70.. రూ. 30 వేల బడ్జెట్‌లో ఏ ఫోన్ బెస్ట్?
  7. Xiaomi : రెడ్‌మి లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. రెండు పాపులర్ 5G ఫోన్ల ధరలను పెంచేసిన షావోమి
  8. Oppo A6c 4G : గెలాక్సీ, రెడ్‌మిలకు పోటీగా 7,000mAh బ్యాటరీతో ఒప్పో A6c లాంచ్
  9. Motorola : మోటో G37, G37 పవర్ సేల్స్ షురూ.. రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్
  10. WhatsApp : వాట్సాప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్.. ఇకపై ఫోన్ నంబర్ ఇవ్వకుండానే చాటింగ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »