OTT : రూ.పది నోటు కోసం ఇన్ని హత్యలా..? సైలెంటుగా ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ..!

కేవలం ఒకే ఒక్క పది రూపాయల నోటు చుట్టూ తిరిగే వింత క్రైమ్, హవాలా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది.

OTT : రూ.పది నోటు కోసం ఇన్ని హత్యలా..? సైలెంటుగా ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ..!

Photo Credit: Prime video

The film is now available to stream on Amazon Prime Video for Rent.

ముఖ్యాంశాలు
  • థియేటర్లలో మిస్ అయినా ఓటీటీలో అస్సలు మిస్ అవ్వద్దు
  • ఓటీటీలో ఊచకోత కోస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్..
  • ఆ మైండ్ బ్లాకింగ్ ట్విస్టులు చూస్తే నిద్రపట్టదు!
ప్రకటన

OTT :  సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. కథలో దమ్ముంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. తాజాగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా, సైలెంట్‌గా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చి ట్రెండ్ అవుతున్న ఒక సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే పైసావాలా. కేవలం ఒకే ఒక్క పది రూపాయల నోటు చుట్టూ తిరిగే వింత క్రైమ్, హవాలా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో కేవలం రెంటల్ బేసిస్ అంటే అద్దె విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఈ సినిమాను చూడాలి అనుకుంటే లేదా కొనాలి అనుకుంటే యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సినిమా కథ మొత్తం ఒక వింతైన 10 రూపాయల నోటు చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద హవాలా లావాదేవీకి సంబంధించి, పసుపు అంటిన పది రూపాయల నోటును కోడ్ వర్డ్‌గా ఉపయోగిస్తారు. ఈ హవాలా డబ్బును చేరవేయాల్సిన బాధ్యతను ఒక ఎమ్మెల్యే బావమరిది తీసుకుంటాడు. అయితే, అతను ప్రయాణిస్తున్న కారు దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతని మొబైల్ ఫోన్‌తో పాటు వాలెట్ కూడా మాయమైపోతుంది. ఆ పర్సులోనే ఆ కీలకమైన హవాలా పది రూపాయల నోటు ఉంటుంది.

ఆ పది రూపాయల నోటు దొరికితేనే కోట్లాది రూపాయల హవాలా డబ్బు చేతికి అందుతుంది. దీంతో ఆ నోటు కోసం లోకల్ గ్యాంగులు, అత్యాశపరులు, కొందరు ఊహించని పెద్ద పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగుతారు. ఆ ఒక్క నోటును దక్కించుకోవడం కోసం బెదిరింపులు, కిడ్నాప్‌లు, ఏకంగా హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఆ నోటు ఎవరికి దొరికింది? ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ట్విస్టులతో సినిమా అంతా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్‌తో సాగుతుంది.

ఈ చిత్రంలో బెజ్జంకి అధ్విక్ (రాజేష్ బెజ్జంకి) ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీధర్ పరిసెర్ల, మత్తిరెడ్డి సృజనాక్షిత, అన్సు పొన్నాచన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరంతా కొత్తవారే అయినప్పటికీ స్క్రీన్ మీద చాలా మెచ్యూర్డ్‌గా నటించి మెప్పించారు. ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. నగేష్ గౌరీష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గౌతమ్ వయిలాడ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాయి. గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ప్రస్తుతం ఐఎమ్‌డీబీ (IMDb) లో ఏకంగా 9.4/10 రేటింగ్‌తో దూసుకుపోతోంది.

#తాజా కథనాలు
  1. OTT Movie : కులాల గొడవలు, ఊరి పెద్దల అక్రమాలు.. వీటి వెనుక నిజాలు తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే !
  2. OTT Movie : మతిస్థిమితం కోల్పోయిన నిత్య.. ఏ మగాడిని చూసినా ఆ మొహమే ఎందుకు కనిపిస్తోంది?
  3. Asus : ఒకే చోట రెండు 16-ఇంచ్ 3K డిస్‌ప్లేలు.. గేమర్ల కోసం అసూస్ తెస్తోన్న వింత డివైజ్
  4. Xiaomi : రెడ్‌మి ప్రియులకు డబుల్ ధమాకా.. ఆ రెండు స్మార్ట్‌ఫోన్ల వెనుక దాగున్న అసలు ట్విస్ట్ ఇదే!
  5. Realme 16T 5G : ఏకంగా 8000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చిన రియల్‌మి కొత్త ఫోన్..చార్జర్లకు కాలం చెల్లినట్లేనా..?
  6. ఇంట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్.. అమెజాన్ తెచ్చిన ఆ రెండు వింత గ్యాడ్జెట్ల వెనుక అసలు సీక్రెట్ ఇదే..
  7. Jio Plan : జియో యూజర్లకు అంబానీ బంపర్ ఆఫర్.. రూ.200 రీఛార్జ్‌తో మొత్తం 15 ఓటీటీలు ఫ్రీ
  8. Xiaomi : మొబైల్ మార్కెట్లో వింత బ్యాటరీ.. షావోమి కొత్త ఫోన్ వెనుక దాగున్న అసలు సీక్రెట్ ఇదే..!
  9. OTT : రూ.పది నోటు కోసం ఇన్ని హత్యలా..? సైలెంటుగా ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ..!
  10. Oppo : 200MP హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7050mAh బ్యాటరీతో ఒప్పో Find X9 అల్ట్రా సేల్స్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »